Son of India OTT Release Date and Platform Details in Telugu - Sakshi
Sakshi News home page

Son Of India Movie: ఓటీటీలోకి 'సన్‌ ఆఫ్‌ ఇండియా'.. ఎక్కడంటే ?

Published Tue, May 17 2022 5:10 PM | Last Updated on Tue, May 17 2022 5:40 PM

Mohan Babu Son Of India Movie Streaming On Amazon Prime Video - Sakshi

Son of India OTT Release Date: విలక్షణ నటుడు మోహన్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సన్‌ ఆఫ్ ఇండియా. దేశభక్తి ప్రధానంగా సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమాలో మోహన్‌ బాబు లుక్స్‌, సంభాషణలు ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మంగళవారం (మే 17) నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా, సర్వేష్‌ మురారి ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఈ మూవీకి మోహన్‌ బాబు స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. 

చదవండి: ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్‌ బాబు భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement