బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన కొత్త సినిమా 'ఐ వాంట్ టు టాక్' ఓటీటీలోకి వచ్చేసింది. అభిషేక్ ప్రధాన పాత్రలో సూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామాగా గతేడాది నవంబర్ 22న విడుదలైంది. అయితే, థియేటర్స్‌లో పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. కానీ, సినిమా చూసిన కొందరు పాజిటివ్ రివ్యూలు ఇవ్వండంతో నెట్టింట కాస్త క్రేజ్ పెరిగింది. అయితే, చాలామంది ఈ చిత్రాన్ని ఓటీటీలో వచ్చాక చూడొచ్చు అనే అభిప్రాయం ఉన్నట్లు సోషల్‌మీడియాలో వెల్లడి అయింది.
'ఐ వాంట్ టు టాక్' సినిమా ఆమెజాన్ ప్రైమ్‌లో తాజాగా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సినిమా చూడాలంటే రూ. 349 చెల్లించాలని అమెజాన్ పేర్కొంది. అయితే, ఉచిత స్ట్రీమింగ్ విడుదల తేదీ ఇంకా వెల్లడి కాలేదు. సాధారణంగా, ఇలా అద్దెకు ఉన్న సినిమాలు 30 రోజుల టైమ్‌లైన్ తర్వాత ఉచితంగా ప్రసారం చేయబడతాయి.
అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ఎన్‌ఆర్‌ఐ అర్జున్ సేన్‌గా మెప్పించారు. తన డ్రీమ్ నిజమైన తర్వాత అకస్మాత్తుగా క్యాన్సర్ బారీన పడిన అర్జున్ ఆపై భార్యతో విడాకులు తీసుకోవడం. ఈ క్రమంలో తన కుమార్తెకు ఎదురైన కష్టం వంటి సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అర్జున్ కేవలం 100 రోజులు మాత్రమే జీవిస్తాడని వైద్యులు చెప్పడంతో ఆయన తన కుటుంబం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది సినిమాలో ప్రధాన అంశంగా ఉంటుంది. ఎలాగైన క్యాన్సర్ నుంచి మరణాన్ని జయించాలని సుమారు 20 ఆపరేషన్స్ చేయించుకుంటాడు. అయితే, ఈ కథలో అర్జున్ సేన్ చివరికి ప్రాణాలతో బయటపడుతాడా..? ఆయన కుమార్తె పరిస్థితి ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment