
నిజామాబాద్ రూరల్: నగరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర యూనిట్ సందడి చేసింది. పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించారు

అనిల్ రావిపుడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవి సంకాంత్రి పండుగ (ఈ నెల14న) రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది

ఈ నేపథ్యంలో నగరంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. వెంకటేశ్‌తో తీసిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయని తెలిపారు




















































