యోగా విత్ లైవ్ మ్యూజిక్
ఆడియో మోగుతుంటే ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేయుడం మామూలే. సజీవ సంగీతం వింటూ యోగసాధన చేయుడం మాత్రం కచ్చితంగా ఒక కొత్త అనుభవం. ఇలాంటి అనుభవాన్ని నగర వాసులకు అందించేందుకు తొలిసారిగా ‘యోగా విత్ లైవ్ మ్యూజిక్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ యోగా శిక్షకురాలు మానసీ గులాటీ. హోటల్ మారియట్‌లో నవంబర్ 9న సాయుంత్రం 4.00 నుంచి 6.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
యోగాసనాలు కండరాలకు, కీళ్లకు వ్యాయామం కల్పిస్తే, సంగీతం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని, సంగీతం వింటూ యోగసాధన చేస్తే, ఏకకాలంలో మనశ్శరీరాలు రిలాక్స్ అవుతాయని గులాటీ చెబుతున్నారు. అలాగే, దేశంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమంలో ‘ఫేస్ యోగా’ను పరిచయం చేయనున్నారు. ‘ఫేస్ యోగా’తో ముదిమిని దూరం చేయవచ్చని, ముఖసౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవచ్చని చెబుతున్నారు.