
అంతరిక్షంలో ఆడియో రిలీజ్
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణమే కాదు, సినిమా ప్రమోషన్ కూడా తలకు మించిన భారంగా మారింది. అందుకే సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి రిలీజ్ డేట్ వరకు వీలైనన్ని కొత్త మార్గాల్లో సినిమాను ఆడియన్స్కు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇదే బాటలో సరికొత్త ఆలోచన చేశారు మళయాళ చిత్రం 'లార్డ్ లివింగ్స్టోన్ 7000 కాండీ' యూనిట్.
గతంలో ఏ సినిమాకు చేయని విధంగా అంతరిక్షంలో ఆడియో రిలీజ్ను ప్లాన్ చేశారు. అయితే ఈ ఆడియో రిలీజ్లో యూనిట్ సభ్యులు ఎవరూ పాల్గొనే అవకాశం లేదు. వెదర్ బెలూన్ సాయంతో ట్రైలర్ లాంచింగ్ డివైజ్ను మాత్రం అంతరిక్షంలోకి పంపారు. దీంతో పాటు అక్కడి విశేషాలను భూమికి చేరవేసేలా గోప్రో కెమెరాను బెలూన్కి అమర్చారు. CUSAT విద్యార్ధుల సాయంతో ఈ ప్రయోగం చేసిన్నట్టుగా ప్రకటించారు. వెదర్ బెలూన్ను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టేందుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు తీసుకున్న చిత్రయూనిట్ గురువారం ఉదయం వెదర్ బెలూన్ను స్పేస్లోకి పంపింది. దీంతో అంతరిక్షంలో ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న తొలి చిత్రంగా 'లార్డ్ లివింగ్స్టోన్ 7000 కాండీ' చరిత్ర సృష్టించింది.
ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే అడ్వంచరస్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రాధకృష్ణన్ మీనన్ దర్శకుడు. బాహుబలి మళయాళ డిస్ట్రిబ్యూటర్స్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ యునైటెడ్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.