శారీలో శ్రావ్యం..
తరాలు మారినా చీరకట్టుకు ఆదరణ తగ్గదని, చీరకట్టుతో వచ్చే అందం మరే వస్త్ర సౌందర్యంలో రాదని ‘కాయ్ రాజా కాయ్’ కథానాయిక శ్రావ్య అన్నారు. శుక్రవారం ఆమె బషీర్‌బాగ్‌లో అవంతి స్కిల్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షోరూంలోని వస్త్ర అందాలను తిలకించారు. భారతీయ సంస్కృతిలో చీర కట్టుకు విడదీయరాని బంధమని, తాను ఎక్కువగా చీరలనే ఇష్టపడతానని పేర్కొన్నారు.
అనంతరం అవంతి స్కిల్స్ నిర్వహకులు మహేష్ అవస్తి, మాట్లాడుతూ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తి, హోల్ సెల్ రంగంలో 20 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఈ షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన కళాంకారి, హ్యాండ్ పెయింటింగ్, బాతిక్, బనారస్, మహేశ్వరి వంటి రకాలు అందుబాటులో ఉంటాయన్నారు. -హిమాయత్‌నగర్