Sari
-
చీరను వండింది
టెక్నాలజీ ఎంతవేగంగా ఎదుగుతోందో మనిషిలోని సృజనాత్మకత అంతే వేగంగా విభిన్న కోణాల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. క్రియేటివిటీకి హద్దులు లేకపోవడంతో అనేక రంగాల్లో చిత్రవిచిత్ర ఆలోచనలకు రూపురేఖలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అగ్గిపెట్టెలో పట్టగలిగే చీరలు, బంగారంతో నేసిన చీరలను తయారు చేయడం గురించి విన్నాం. తాజాగా కేరళకు చెందిన మహిళా బేకర్ నమిలి మింగేయగల సరికొత్త చీరను రూపొందించింది. మహిళలు ధరించే పరిమాణం, ఆకర్షణీయమైన డిజైన్‌తో కేరళ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చీర ఉండడం విశేషం. కేరళలోని కొల్లంకు చెందిన అన్నా ఎలిజబెత్ జార్జ్... క్యాన్సర్ అండ్ న్యూరోబయాలజీలో పీహెచ్డీ చేస్తోంది. ఒక పక్క చదువుతూనే మరోపక్క తన కిష్టమైన కుకింగ్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇటీవల ముగిసిన ఓనం వేడుకల్లో సరికొత్తగా ఏదైనా తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే మలయాళీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, కేరళలో జరిగే ప్రతి సంప్రదాయ కార్యక్రమానికి తప్పసరిగా కట్టుకునే ‘కేరళ కసువ చీర’ను సరికొత్తగా రూపొందించింది. తెల్లని రంగు, గోల్డెన్ జరీ అంచుతో ఉండే కసువా చీరను బంగాళ దుంప గుజ్జుతో చేసిన పొడి, బియ్యప్పిండిని ఉపయోగించి చీరను తయారు చేసింది. అన్నా.. వంటలు చేయడమేగాక ఫ్యాషన్ డిజైనర్‌గా, ఫ్లోరిస్ట్ గా రాణిస్తుండడంతో, తన సృజనాత్మకతను కొంత జోడించి... దుంపల గుజ్జు నుంచి తీసిన పొడి, బియ్యప్పిండిలని కలిపి అరఠావు పరిమాణంలో పలుచటి పొరను తయారు చేసి వాటిని చీరకు బేస్‌గా వాడింది. అలా దాదాపు వంద పలుచటి పొరలను వాడి ఐదున్నర మీటర్ల చీరను రూపొందించింది. కేక్ డెకరేషన్స్‌లో వాడే గోల్డెన్ రంగులను చీర అంచుకు అద్దింది. ముప్పై గంటలపాటు శ్రమించి స్వీట్ చీరను తయారు చేసింది. తియ్యటి చీరకు మొత్తం ముప్పై వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. రెండు కేజీల బరువున్న ఈ చీరను భుజం మీద వేసుకుని, సరదాగా కొంగును కొరుకుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యి మాకు ఒకటి చేసివ్వండి అని కామెంట్లు చేస్తున్నారు. తన తాతయ్య జాకబ్ దగ్గర వంటలు నేర్చుకుంది అన్నా. తాతయ్య గుర్తుగా ఆయన పేరుమీద బేకింగ్, ఫ్లోరల్ ప్రాజెక్టులను చేస్తోంది.‡‘‘జీవితంలో తొలిసారి ఇంత ఖర్చు పెట్టి తియ్యటి చీరను తయారు చేసాను. ఓనంకు ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న ఉద్దేశ్యం తోనే ఈ చీరను తయారు చేసాను. కణజీవ శాస్త్రం (సెల్ బయాలజీ) పరిశోధకురాలిగా సరికొత్తగా చేయాలన్న ఉద్దేశ్యంతో సెల్ బయాలజీని నా బేకింగ్ స్కిల్స్ యాడ్ చేసి ప్రపంచంలోనే తొలిసారి కట్టుకుని కొరుక్కు తినగల చీరను తయారు చేశాను’’ అని అన్నా చెప్పింది. -
ఆ 40 మందికి ఎలా సోకింది?
న్యూఢిల్లీ: వారు విదేశాలు వెళ్లిన దాఖలాలు లేవు.. చుట్టాలు పక్కాలు, ఇరుగు పొరుగు వారెవరూ విదేశాల నుంచి రాలేదు.. ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందితోనూ సంబంధాలు లేవు..లేబొరేటరీల్లోనూ పని చేయలేదు..అయినా సరే 40 మందికి కరోనా సోకింది. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది..ఎందుకిలా?? ఇప్పుడిదే కేంద్రానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్‌లో కరోనా వ్యాప్తిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో (ఎస్ఏఆర్ఐ) బాధపడుతున్న వారిలో ఎంపిక చేసిన 5,911 మందికి ఐసీఎంఆర్ కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. వారిలో 104 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిలో 40 మందికి వ్యాధిగ్రస్తులెవరితోనూ నేరుగా సంబంధాలు లేకపోవడం, విదేశాల నుంచి వచ్చిన చరిత్ర లేకపోవడం ప్రభుత్వానికి షాక్ కలిగించింది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 52 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు తాజాగా ఐసీఎంఆర్ మెడికల్ జర్నల్‌లో వెల్లడయ్యాయి. సర్వే నివేదిక ముఖ్యాంశాలు.. ► తీవ్రమైన శ్వాస కోశ సమస్యలతో బాధపడే రోగులకు (ఎస్ఏఆర్ఐ) మార్చి 14 కంటే ముందు కరోనా వైరస్ అసలు సోకలేదు. అదే ఏప్రిల్ 2 వచ్చేసరికి అలాంటి వారిలో 2.6% మందికి కోవిడ్–19 సోకింది. ► 50 ఏళ్లకు పైబడినవారిలోనూ, పురుషులపైనా ఈ వైరస్ పంజా విసురుతోంది. 50–59 ఏళ్ల మధ్య వయస్కుల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► ఎస్ఏఆర్ఐ రోగుల్లో 5,911 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 104 మందికి (1.4%) కరోనా ఉన్నట్టు తేలింది. ► ఈ కరోనా కేసుల్లో 40 మంది విదేశీ ప్రయాణాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధాలు లేకపోయినా వైరస్ సోకింది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో ఇలాంటి కేసులున్నాయి. ► శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ కోవిడ్–19 బారిన పడిన వారిలో గుజరాత్ నుంచి అత్యధికంగా కేసులు (792) నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు (577), మహారాష్ట్ర (533), కేరళ (503) ఉన్నాయి. కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇవే కావడం గమనార్హం. నిబంధనలు కఠినతరం చేయాలి దేశవ్యాప్తంగా 36 జిల్లాల్లో ఎలాంటి లింకులు లేకపోయినా కరోనా వ్యాపించడంతో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. భారత్‌లో సమూహ వ్యాప్తికి ఇది సంకేతమని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్ అభిప్రాయపడ్డారు. సరిహద్దులు జాగ్రత్త బీఎస్ఎఫ్కు అమిత్ షా ఆదేశాలు న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట చొరబాట్లను అడ్డుకునే దిశగా మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి సరిహద్దు భద్రతాదళాన్ని(బీఎస్ఎఫ్)ను ఆదేశించారు. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో, ముఖ్యంగా ఫెన్సింగ్ లేని ప్రాంతాలపై, మరింత దృష్టి పెట్టాలన్నారు. ఈ సరిహద్దుల్లో పరిస్థితిపై శుక్రవారం బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అమిత్ షా సమీక్ష జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో చొరబాట్లకు అవకాశం కల్పించకూడదని వారికి ఆదేశాలిచ్చారు. ఈ వివరాలను హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మీడియాకు వివరించారు. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 37,978 రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటయ్యాయని, వాటిలో 14.3 లక్షల మంది కార్మికులు, వలస కూలీలకు ఆశ్రయం కల్పించామన్నారు. ఎఫ్‌సీఐ ఉద్యోగులకు బీమా సౌకర్యం ► లక్ష మందికి పైగా ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) అధికారులు, కార్మికులకు రూ. 35 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ► ఉద్యోగులు తమ వేతనాల నుంచి యాజమాన్యాల ద్వారా పీఎంకేర్స్ నిధికి విరాళం ఇస్తున్నట్లయితే.. ఆ వివరాలను యాజమాన్యాలు ఆయా ఉద్యోగుల ఫామ్–16 టీడీఎస్ సర్టిఫికెట్లో చూపించాలని ఐటీ శాఖ కోరింది. ► దేశవ్యాప్త లాక్డౌన్ పరిస్థితుల్లో వీధుల్లో తిరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం కల్పించేందుకు తీసుకున్న చర్యలను రెండు వారాల్లోగా వివరించాలని హోం శాఖను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ► మధ్యప్రదేశ్‌లో 75 వేల జనాభాకు ఒక వెంటిలేటర్, 47 వేల మందికి ఒక ఐసీయూ బెడ్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తాజా అధికార గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 426 కరోనా కేసులు, 33 మరణాలు సంభవించాయి. -
సందడి పట్టుకోండి
ముహూర్తాలు మూటగట్టుకొని మాఘమాసం వచ్చింది. పెళ్లి పీటల మీద వధువు పక్కన పేరంటాలను కళకళలాడేలా చేయనుంది. అంతా సందడి.. ముచ్చటగా తయారవ్వాలనే తపన ఆలస్యమెందుకు పట్టు అందుకోండి సందడి పట్టుకోండి. ►కంచిపట్టు చీర వివాహ వేడుకలకు ఎవర్గ్రీన్. దీనికి కాంబినేషన్‌గా బెనారస్ లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్‌ను ధరిస్తే గ్రాండ్లుక్తో ఆకట్టుకుంటారు. దీని మీదకు వెడల్పాటి చోకర్స్, టెంపుల్ జువెల్రీ లేదా పెద్ద పెద్ద ముత్యాల హారాలు రాణికళను తెప్పిస్తాయి. ►పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు అందమైన పట్టుచీరల రెపరెపలు కూడా ఉండాలి. అవి వధువుకైనా, వేదికను అలంకరించే వనితలకైనా నిండుతనాన్ని తీసుకువస్తాయి. పెళ్లింటికి లక్ష్మీ కళను మోసుకువస్తాయి. ►కంచిపట్టు చీరకు డిజైనర్ లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ ఎంపికతో వివాహ వేడుకలో గ్రాండ్‌గా కనిపిస్తారు. అందులోనూ లాంగ్ స్లీవ్స్ ట్రెండ్‌లో ఉన్న స్టైల్. ఆధునికతను, హుందాతనాన్ని కోరుకునే అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు. కుందన్స్ ఆభరణాలు కంచిపట్టు చీరలకు అమితమైన కళను తీసుకువస్తాయి. ►పెళ్లిలో గ్రాండ్‌గా కనిపించడానికి సిల్వర్ జరీ పట్టుచీరల కాంబినేషన్ బాగా నప్పుతుంది. జరీ రంగులో డిజైనర్ బ్లౌజ్ ధరించి, పెద్ద పెద్ద రాళ్ల హారాలను ఎంపిక చేసుకుంటే లుక్ గ్రాండ్‌గా కనువిందు చేస్తుంది. ►సింపుల్, మార్వలెస్ అనిపించే కలర్ కాంబినేషన్స్ చిలకపచ్చ, గులాబీ రంగులు. ఈ రంగు కాంబినేషన్ బ్లౌజ్‌కి ఎంబ్రాయిడరీతో ప్రత్యేకత తీసుకురావచ్చు. వజ్రాలు, పచ్చల హారాలు హెవీగా అనిపించక స్మార్ట్‌నెస్‌ను తలపిస్తున్నాయి. – శశి వంగపల్లి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ద ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్ -
మీ లుక్ ఇలా మార్చుకోండి
ఎత్తు తక్కువ ఉన్నవారు పొడవుగా కనిపించాలన్నా, సన్నగా ఉన్నవారు కొంచెం బొద్దుగా కనిపించాలన్నా ఈ చిన్న చిన్న కిటుకులు పాటించాలి... ఎత్తు తక్కువ ఉన్నవారు చిన్న అంచు(బార్డర్) లేదా అసలుఅంచు లేని చీరలు కట్టుకుంటే పొడువుగా కనిపిస్తారు.చర్మరంగుకు దగ్గరగా ఉండే రంగు దుస్తులను ధరిస్తే మీ రూపం పొడువుగా కనిపిస్తుంది. సన్నగా ఉన్నవారు అలంకరణలు ఎక్కువ ఉన్న అంటే గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు, చీరలు కట్టుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.నలుపు, ఎరుపు, నీలం.. వంటి బాగా ముదురు రంగు దుస్తుల మీదకు బంగారు ఆభరణాలు ధరిస్తే అందం రెట్టింపు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బొద్దుగా ఉన్నవారు చర్మం రంగు దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు.బొద్దుగా, ఎత్తు తక్కువ ఉన్నవారు చారల దుస్తులు, చీరలు ధరించాలంటే.. నిలువు చారలున్నవి ఎంచుకోవాలి. -
పూసా వసూల్
తెల్లని ముత్యాలుఒక్కొక్కటి ఒక్కో తీరుగుట్టపూసలని వాటికి పేరుఒక్కో పూస చేర్చిఒద్దికగా అల్లితేఆ పూస గుచ్చిన అందాన్నిచూసినవారు ఒళ్లంతా కళ్లు చేసుకోవాల్సిందే! వేడుక ఏదైనా పూసలు మేనును మెరిపించాల్సిందే!ప్రతి పూసా చూపులలెక్కలు వసూల్ చేయాల్సిందే! గుట్ట పూసల హారాలు పట్టు చీరల మీదకు ఎంత అందంగా ఉంటున్నాయో తెలిసిందే కదా! పెళ్లి, పండగ సంప్రదాయ వేడుకల్లో గుట్టపూసల ఆభరణాల ధరించడం ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. అయితే, వీటి ఖరీదు ఎక్కువే! గుట్టపూసల ఆభరణాన్ని భర్తీ చేయడానికా అన్నట్టుగా ఇప్పుడు మగ్గం వర్క్‌లో గుట్టపూసలతో చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకే పరిమాణంలో కాకుండా ఇష్టం వచ్చిన తీరులో ఉండే గుట్టపూసల(ముత్యాలు)ని హారంగా చేసి, అతివ మెడను అందంగా అలంకరించారు ఆభరణాల నిపుణులు. అదే థీమ్‌ని తెల్లని పూసలతో పట్టుచీర జాకెట్ల మీద ముచ్చట గొలుపుతున్నారు ఎంబ్రాయిడరీ డిజైనర్లు. ఈ డిజైన్‌లో ఎన్ని పూసలు ఎక్కువ వాడితే అంత ఖరీదు అని గుర్తించాలి. సింపుల్ లేదా గ్రాండ్ డిజైన్ అనేది బడ్జెట్ చీర హంగును బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత చిన్న డిజైన్ అయినా గుట్టపూసల డిజైన్ వేడుకలో హైలైట్‌గా నిలుస్తుంది. కుందన్స్‌తో కనువిందు ఎరుపు, పసుపు, పచ్చ కుందన్స్‌తో మరింత అందంగా దోస్తీ కడుతున్నాయి తెల్లని పూసలు. వీటికి జరీ జిలుగులు కూడా తోడై కొత్త సింగారాలతో వయ్యారాలు పోతున్నాయి. పట్టు చీర అంచు మీద నాటి రోజుల్లో పట్టుచీరలోనే వచ్చే కాంబినేషన్ బ్లౌజ్‌ను డిజైన్ చేయించుకునేవారు. ఆ స్టైల్ పాత బడి మూలన పడింది. అయితే, ఇటీవల మళ్లీ ఈ తరహా స్టైల్ వెలుగులోకి వచ్చింది. పట్టు చీర అంచు ఉండే పొడవు చేతులకు గుట్టపూసలతో చేసిన డిజైన్ అదనపు హంగులతో ఆకట్టుకుంటుంది. దీంతో ఓల్డ్ అని మూలన పడేసిన స్టైల్ ఇప్పుడు ‘వావ్’ అనిపిస్తోంది. కాసుల కాంబినేషన్ లక్ష్మీ కాసులతో డిజైన్ చేసిన మగ్గం వర్క్‌లు తెలిసినవే! ఇప్పుడు అందంగా ఉండే గుట్టపూసల డిజైన్‌కి అదనంగా కాసులను కూడా వాడి మరింత ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నారు. ముదురు రంగులు ముదురు ఎరుపు, నీలం, పచ్చ, గులాబీ రంగు పట్టు ఫ్యాబ్రిక్‌లు పూసల డిజైన్‌కి బాగా నప్పుతాయి. తెల్లటి ముత్యాలు, పూసలను ఈ డిజైన్ ఔట్‌లెట్‌గా వాడుతారు. ముదురు రంగు ఫ్యాబ్రిక్ అయితే తెల్లటి పూసల హంగులు మరింత బాగా కనిపిస్తాయి. నిర్వహణ - ఎన్.ఆర్. -
కుర్తా కుచ్చిళ్లు
చీరకట్టులో ఓ కొత్త స్టైల్ కుర్తా–కుచ్చిళ్లు. చీరను కుచ్చిళ్లుగా మడిచి ... బ్లౌజ్‌ను కుర్తాగా ధరించి... పల్లూను దుపట్టాలా సింగారిస్తే... చూపులకు చక్కగా స్టైల్‌కి సూపర్బ్‌గా... సౌకర్యంలో సుందరంగా... సందర్భమేదైనా, వేడుక ఏదైనా చీరను మించిన ఎవర్గ్రీన్ డ్రెస్ లేదన్నది నేటితరమూ ఒప్పుకుంటున్న మాట. అయితే, ఒకప్పటిలా కాకుండా చీరకట్టులో ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. పవిటను తీరొక్కతీరుగా అలంకరించడం నిన్నటి మాట. బ్లౌజ్ పార్ట్‌ని భిన్నమైన టాప్స్‌తో చీరకు జత చేయడం నేటి మాట అయ్యింది. అవి నవతరం మెచ్చేలా స్టైలిష్ లుక్‌తో పాటు సంప్రదాయతను చాటేలా ఉండటం ప్రధానంగా కనిపిస్తోంది. షార్ట్ లేదా లాంగ్ కుర్తా – చీర కాంబినేషన్ లేదా లాంగ్ జాకెట్–చీర, షర్ట్ స్టైల్ –చీర.. ఇలా ఈ స్టైల్స్ ఆధునిక కాలం అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేక సందర్భాలలో ఈ కుర్తా లేదా కుర్తీ చీరకట్టు మరింత ప్రత్యేకతను చాటుతోంది. చీరకట్టులో కుర్తీ శారీ నేటి కాలానికి తగినట్టు స్టైలిష్‌గా ఉండటంతో ఆకట్టుకుంటోంది. పైగా సౌకర్యవంతంగా ఉంటుంది.కుర్తా శారీ ఎంపికలో రెండు భిన్న రంగులను ఎంచుకోవాలి. అలాగే ఫ్యాబ్రిక్లోనూ మార్పులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంచుతో కూడిన ప్లెయిన్ శారీ అయితే తెల్లటి కుర్తా టాప్‌గా ధరిస్తే చాలు మంచి కాంబినేషన్ అవుతుంది. ∙ప్రింటెడ్ శారీకి ప్లెయిన్ కుర్తా పర్ఫెక్ట్ ఎంపిక. చీరకట్టులోనే కొత్తదనం కనిపిస్తుంది కాబట్టి ఇతరత్రా ఆభరణాల అలంకరణ అవసరం లేదు. సింపుల్‌గా చెవులకు జూకాలను ధరిస్తే సరిపోతుంది. క్రోషెట్ లేదా లేస్ ఫ్యాబ్రిక్ కుర్తాలు కూడా బ్లౌజ్ పార్ట్ (కుర్తా టాప్)కి బాగా నప్పుతాయి. షార్ట్ కుర్తీ వేసుకున్నప్పుడు అంచులు తగిలేలా పవిటను తీయాలి. అలాగే లాంగ్ కుర్తా (నీ లెంగ్త్) ధరించిన్నప్పుడు పవిటను కుర్తా అంచులను తగిలేలా సెట్ చేస్టే స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. షార్ట్ లేదా లాంగ్ కుర్తీలను చీర మీదకు ధరించడం వల్ల ఫార్మల్ లుక్‌తో ఆకట్టుకుంటారు. ప్రత్యేక∙సభలు, సమావేశాలకూ ఈ లుక్ నప్పుతుంది. – కీర్తిక, డిజైనర్ -
రవికట్టు
చీర కట్టుకుని నడుముకు వడ్డాణం పెట్టుకోవడం పాత పద్ధతి. బ్లౌజ్‌నే బెల్ట్‌గా మార్చేసి చుట్టేయడం నేటి పద్ధతి. రవికను ముడి వేసినట్టుగా... బెల్ట్‌తో పవిటను కట్టేస్తే... ఆ బెల్ట్‌కి ఎంబ్రాయిడరీ సొబగులు అద్దితే... అది ఇలా అందమైన బెల్ట్ బ్లౌజ్‌గా రూపుదిద్దుకుంటుంది. స్టైలిష్ లుక్ ►పైట చెంగుకు 8–10 ఫ్రిల్స్ పెట్టి, భుజం మీదుగా జాకెట్‌కు పిన్‌తో జత చేసి, అదే జాకెట్ బెల్ట్ పెట్టేసుకుంటే సరి. ఎలా సెట్ చేసిన ఫ్రిల్స్ అలాగే ఉంటాయి. సౌకర్యంగా ఉంటుంది. లుక్స్‌లో వచ్చిన స్టైలిష్ మార్పుకు వేడుకలో ఎక్కడా ఉన్నా బ్రైట్‌గా వెలిగిపోతారు. ►జాకెట్టు మాత్రమే కాదు బెల్ట్కూ ఎంబ్రాయిడరీ చేసి, ఇలా పైట కొంగుమీదుగా తొడిగేస్తే సరి. అలంకరణ పూర్తయినట్టే. ట్రెండ్‌లో ఉన్నారన్న కితాబులూ సొంతం అవుతాయి. ►ప్లెయిన్ శారీకి బెల్ట్ బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణ ►కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యాటర్న్ ఎంపిక చేసుకోవాలి. దానితో పాటు బ్లౌజ్‌కి సన్నని బెల్ట్నీ అదే రంగు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయించుకోవాలి. ►చిన్న ప్రింట్లు లేదా ప్లెయిన్ శారీకి ఎంబ్రాయిడరీ బెల్ట్ బ్లౌజ్ అక్కర్లేదు. ఫ్లోరల్ ప్రింట్ బెల్ట్ బ్లౌజ్ తీసుకుంటే చాలు. ఫ్యాషన్ వేదికలైనా, సంప్రదాయ వేడుకైనా స్పెషల్‌గా కనిపిస్తారు ►లాంగ్ బ్లౌజ్‌కి బెల్ట్ హంగుగా అమరితే సాదా చీర అయినా సరికొత్త స్టైల్‌తో మెరిసిపోతుంది. –కీర్తిక, డిజైనర్, హైదరాబాద్ -
కుచ్చు కుచ్చు కూనమ్మా!
మహిళల పాశ్చాత్య దుస్తుల్లో బాగా పాపులర్ అయిన డిజైన్ ‘కుచ్చులు’. స్కర్ట్స్, బ్లౌజ్‌లు, గౌన్లు... వీటిలో చాలారకాల ‘కుచ్చులు’ మనం గమనించవచ్చు. కుచ్చుల గౌన్లలో మెరిసిపోయే కుందనపు బొమ్మలు అని మనం చిన్నారులను చూసీ అనుకుంటూ ఉంటాం. ఈ ‘కుచ్చుల’ అందాన్ని గౌన్లకే కాకుండా మన సంప్రదాయ చీరలకు జత చేసి ఒక వినూత్న కళను తీసుకువచ్చారు డిజైనర్లు. దీంతో ఇవి మోడ్రన్ కాలాన్ని మరింత అద్భుతంగా మార్చేశాయి. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో రెట్రో స్టైల్ తెగ హడావిడి చేస్తోంది. అయినా కొన్ని ఆధునిక మెరుపులు సందడి చేస్తూనే ఉన్నాయి. వాటిలో కుచ్చులు అనబడే ఫ్రిల్ శారీ స్టైల్ ఒకటి. ∙చీరను కుచ్చిళ్లు పెట్టి కట్టుకుంటాం. అయితే కుచ్చిళ్ల ప్యాటర్న్‌ని ముందే కుట్టి చీరకు జత చేసి, కట్టుకుంటే విభిన్నమైన అందం సొంతం అవుతుంది.∙జార్జెట్, షిఫాన్, సిల్క్, నెటెడ్ చీరలకే కాదు కాటన్ చీరలకూ ఫ్రిల్స్ జత చేసి కొత్త లుక్‌ని తీసుకురావచ్చు. ∙నవతరం అమ్మాయిలే కాదు, నేటి తరం అమ్మలు కూడా వీటిని కట్టుకోవడం ఫ్యాషన్ అయ్యింది.∙ఈ స్టైల్‌కి శారీకి పూర్తి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్‌ని ఎంచుకోవాలి. ప్లెయిన్, కొద్దిపాటి ఎంబ్రాయిడరీ బ్లౌజులు బాగా నప్పుతాయి. చీరకు కుచ్చులు ఎంపిక చేసుకునేటప్పుడు కాంట్రాస్ట్, సెల్ఫ్.. ఏ రంగు నప్పుతుందో ఫ్యాబ్రిక్‌ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఫ్రిల్స్ శారీకి రంగుల హంగులు ఎన్నయినా జత చేసుకోవచ్చు. ప్రింట్ శారీ అయితే ప్లెయిన్ కుచ్చుల ప్యాటర్న్‌ని, అదే ప్లెయిన్శారీ అయితే ప్రింటెడ్ కుచ్చులనూ ఎంచుకోవచ్చు.కుచ్చుల ప్యాటర్న్‌ని ముందే కుట్టి, దానిని చీరకు మరో కుట్టుతో ప్యాచ్ చేయాలి. ఫ్రిల్ శారీకి కుచ్చులే అలంకరణ కాబట్టి ఆభరణాలంటూ ఇతర అలంకరణల హంగులు అవసరం లేదు. ఎంత సింపుల్‌గా ఉంటే అంత బ్రైట్‌గా కనిపిస్తారు. సంప్రదాయ వివాహాది వేడుకలకన్నా కాక్టెయిల్ పార్టీస్‌కి బాగా నప్పే ఫ్యుజన్ లుక్ ఇది. – నిఖిత, డిజైనర్, ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ -
నైజీరియా మగువ.. చీరంటే మక్కువ
అల్లిపురం(విశాఖ దక్షిణ): ‘‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అందమంతా చీరలోనే ఉన్నది’’ అన్న మనసుకవి మాటలు చీర మహిమేమిటో చెబుతాయి.. చీరకట్టి ఆడతనం పెంచుకొమ్మన్న యువకవి పదాలు ఆ ఆరుమూరల వస్త్ర విశేషం ప్రత్యేకతను చాటిచెబుతాయి. అయితే ఎన్ని విధాలా వర్ణించినా.. ఇంకా ఏదో మిగిలిపోయిందన్న విశిష్టత చీరకే ఉంది. నెమలిపింఛంలా, నీలి మేఘంలా, కడలి కెరటంలా, పూలగాలి తెమ్మెరలా ఎన్నెన్నో హొయలు పోయే చీర భారతీయ వనిత ఔన్నత్యానికి తిరుగులేని రీతిలో అద్దం పడుతుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ అందచందాల చీర నైజీరియా నుంచి వచ్చిన ఇంతి మనసును ఆకట్టుకుంది. కట్టులో వింత ఆమెను విస్మయానికి గురిచేసింది. విశాఖకు తమ కంపెనీ పని మీద వచ్చిన నైజీరియా దేశస్తురాలు గ్రీన్ అలా హబ్జాకు చీర మీద చాలా మనసైంది. ఏదేశం మగువైనా ఒకటే కదా. వెంటనే ఆమె చీరకట్టు గురించి వివరంగా తెలుసుకున్నారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నైజీరియా షిప్పింగ్కంపెనీ లీగల్ విభాగం డెప్యుటీ డైరెక్టర్ అయిన హబ్జా చీరకట్టులోనే పాల్గొని అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. ఈస్ట్ కోస్ట్ మారిటైం అకాడమీలో షిప్పింగ్‌లో ఎగుమతులు, దిగుమతుల అంశంపై శిక్షణ నిమిత్తం తాను వచ్చానని.. విశాఖ వచ్చిన దగ్గర నుండి ఇక్కడి వారి చీరకట్టు తనను ఎంతగానో మైమరపించిందని, అందుకే గత రాత్రి షాపింగ్‌కు వెళ్లి చీర, చెవి రింగులు, నక్లెస్ కొనుక్కొని, జాకెట్టు కుట్టించుకుని మరీ ధరించానని ఆమె సమావేశంలో చెప్పగానే అంతా కేరింతలు కొట్టారు. శిక్షణ కార్యక్రమం ముగింపు సదస్సులో అలా ఆమె అందరిలో కేంద్రబిందువు అయ్యారు. భారతీయ సంప్రదాయాల్లో తెలుగువారి చీరకట్టు తనను ముగ్ధురాలిని చేసిందని ఆమె చెప్పారు. -
నెమలీ పద.. పద...
నెమలికి తెలియని నడకలివినెమలి పింఛాన్ని మించిన హంగులివి చీరకట్టులో వచ్చిన సరికొత్త స్టైల్.ఓణీ కట్టులోబాణీ మార్పు.ఇక, నెమలీ పద పద! చీరకట్టుకు ఓ అందం ఉంటుంది. ఆ ‘కట్టు’లో ఎన్నో విధానాలు. వాటిలో ఇప్పుడు వెనుకవైపు కుచ్చుళ్లు కొత్తగా సందడి చేస్తున్నాయి. ఆ స్టైల్ నెమలి పింఛాన్ని తలపిస్తోంది. క్రీమ్ కలర్ లెహంగా, బ్లౌజ్.. దీని మీదకు ఎరుపు లేదా గులాబీ రంగు చీరను చుట్టేసి, నడుము వెనుక కుచ్చులను పెట్టి, పూసల బెల్ట్‌ని ధరిస్తే.. వేడుకలో హైలైట్! బామ్మల కాలం నాటి చీరలనూ ఈ స్టైల్‌కి వాడుతున్నారు. -
సైడ్ ఇవ్వండి
అమ్మాయిలు స్టైల్లో చింపేస్తున్నారు.ఎడాపెడా కొత్త డిజైన్లు లాంగించేస్తున్నారు.కుడి ఎడమ తేడా చూపిస్తున్నారు.ఒకప్పుడు పైటలేనండి కుడి పక్క, ఎడమ పక్క.ఇప్పుడు టాప్‌లు కూడా కుడి ఎడమలు అయ్యాయి. కొత్త స్టైల్ వచ్చేసింది కొంచెం సైడ్ ఇవ్వండి. శారీ విత్ ఒన్‌సైడ్ టాప్ చీర కట్టడం లేదంటే లంగా ఓణీనిధరించడం.. ఏముంది కొత్తదనంఅంటారా! బ్లౌజ్ బదులు ఇలా ఒన్‌సైడ్ లాంగ్ కుర్తా లేదా టాప్ వేసుకోండి. లుక్‌లో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. కుర్తీ విత్ ఒన్‌సైడ్ ఏ సీజన్‌కైనా అతివలకు సౌకర్యంగా ఉండే డ్రెస్ కుర్తీ. అందుకే దీంట్లో చెప్పలేనన్ని స్టైల్స్ వచ్చాయి. అవి ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ఉంటాయి. అలాగే, దీంట్లోనూ ఒన్‌సైడ్ సింగిల్ కలర్ డిజైనర్ కుర్తీలు వచ్చాయి. అదీ ఒకవైపు మాత్రమే పొడవుగా ఉండే డిజైన్ కుర్తీ లవర్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. రెండు రంగుల ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసే ఈ కుర్తీలలోనూ చాలా వెరైటీలు ఉన్నాయి. లెహెంగావిత్ ఒన్ సైడ్ టాప్ బ్రైట్ కలర్లో డిజైన్ చేసిన లాంగ్ లెహెంగా మీదకు లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ లేదా క్రాప్‌టాప్ సరైన ఎంపిక. అయితే, అదే క్లాత్‌తో ఒక సైడ్లాంగ్ ప్యాటర్న్‌ని జత చేసి, దానికి కొంత ఎంబ్రాయిడరీని కూర్చితే సంప్రదాయ, పాశ్చాత్య రెండు వేడుకులలో స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు. లాంగ్ గౌన్ విత్ ఒన్ సైడ్ టాప్ ప్లెయిన్‌గా ఉండే వెస్ట్రన్వేర్కి మరిన్ని హంగులు అద్దాలంటే సింపుల్ టెక్నిక్ ఉంది. అదే ఒన్‌సైడ్ లాంగ్జాకెట్. ఫ్లోరల్ డిజైన్‌తో ఉండే ఒన్‌సైడ్ లాంగ్ జాకెట్ లేదా టాప్ వెస్ట్రన్ గౌన్ రూపురేఖలే మార్చేస్తుంది. ట్రౌజర్ విత్ ఒన్ సైడ్ టాప్ ట్రౌజర్, క్రాప్టాప్నిబెనారస్ క్లాత్‌తో డిజైన్ చేయాలి. టాప్ పార్ట్‌కి అదే రంగు జార్జెట్ మెటీరియల్‌తో ఒక వైపు మాత్రమే ఇలా కుచ్చులు పెట్టి జత చేస్తే స్టైలిష్ పార్టీవేర్డ్రెస్ రెడీ. డిజైనర్ నెక్ పీస్ సంప్రదాయ దుస్తుల మీదకు బంగారు, ఇమిటేషన్ ఆభరణాలు అందంగా ఉంటాయి. కానీ, ఇండో వెస్ట్రన్ స్టైల్ దుస్తుల మీదకు అట్రాక్టివ్ లుక్‌నిచ్చే ఫ్యాన్సీ ఆభరణాలే ఉండాలి. దాన్ని చాలా సులువుగా మనకు మనంగానే రూపొందించుకోవచ్చు. కావల్సినవి: ∙గులాబీ రంగు నూలు దారం – మీటరు ∙బంతిపువ్వు రంగు నూలు లేస్ విత్ ఉండలు ఉన్నది – మీటరు ∙చైన్ – 1 ∙క్లాంప్స్ – కొన్ని ∙పట్టు కార 1 క్లాంప్స్ని పట్టుకారతో తెరిచి బంతిపువ్వు రంగు నూలు లేసుకు జత చేయాలి. 2 క్లాంప్స్ లేసును పట్టి ఉంచుతాయి. అలాగే చైన్‌ని కూడా జత చేస్తూ పట్టుకారతో క్లాంప్స్ని గట్టిగా నొక్కాలి. 3 చిత్రంలో చూపిన విధంగా నూలు లేస్, క్లాంప్స్, చైన్‌ను మొత్తం జత చేయాలి. 4 క్లాంప్స్ మధ్య నుంచి గులాబీ రంగు దారాన్ని తీయాలి. 5 సరిగా పట్టని చోట క్లాంప్ని మళ్ళీ తెరిచి, సరిచేయాలి. 6 బంతిపువ్వు రంగు నూలు లేసు, క్లాంప్స్, చైన్, గులాబీరంగు నూలు దారం సెట్ చేసి, చివర్లు ముడివేయాలి. చిత్రంలో చూపిన విధంగా ఫ్యాన్సీ నెక్ పీస్ రెడీ. ఆభరణాలు లెస్ ఆభరణాలు అక్కర్లేని సింగారాన్ని ఈ స్టైల్‌తో రప్పించవచ్చు. దుస్తుల ద్వారా చూపించే కొత్తదనానికి ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. దానికి అదనపు హంగులుగా చేతికి గాజులు, మెడలో హారాలు అక్కర్లేదు. చెవులకు జూకాలు, సింపుల్ మేకప్‌తో పార్టీలో అదరగొట్టేయచ్చు. మీరూ ఇలా ట్రై చేయవచ్చు. నిర్వహణ ఎన్.ఆర్. -
బీచ్‌లో చీర కట్టుకొని తిరగాలా?
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి రాధికా ఆప్తే తెలుగువారికీ సుపరిచితురాలే. బాలకృష్ణతో లెజెండ్, లయన్.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతోపాటు రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’సినిమాతో ఆమె దక్షిణాదివారికి చేరువైంది. బాలీవుడ్‌లోనూ మంచి నటిగా పేరొందిన రాధికా ఆప్తే ఇటీవల అక్షయ్‌కుమార్ సరసన ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాలో అలరించింది. ఇటీవల ఈ భామ తన స్నేహితుడితో కలిసి బీచ్‌లో సేదదీరుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. బికినీ ధరించి గోవా బీచ్‌లో దిగిన ఈ ఫొటో పెట్టగానే.. ఆమెను కించపరుస్తూ పలువురు కామెంట్లు చేశారు. బాడీషేమింగ్ చేస్తూ ఎద్దేవా చేశారు. ఈ విషయమై మీడియా ప్రస్తావించగా.. ‘నన్ను ట్రోల్ (కించపరుస్తూ) చేసేవారి కామెంట్లు పెద్దగా పట్టించుకోను. ఎవరైనా ఆ విషయం చెప్తే తప్ప నాకు వాటి గురించి తెలియదు. అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మూర్ఖత్వం. బీచ్‌లో నేను చీర కట్టుకొని తిరగాలని వారు భావిస్తున్నారా?’ అని ఆమె ప్రశ్నించారు. ట్రోలర్స్‌ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. నాకు వాళ్లు ఎవరో తెలియదు.. వాళ్ల గురించి అసలే పట్టించుకోను అని ఆమె తాపీగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో హీరోయిన్లను కించపరుస్తూ ట్రోలర్స్ చెలరేగిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాలీవుడ్ నటీమణులు ప్రియాంకచోప్రా, తాప్సీ పన్ను, ఈషా గుప్తా, దీపికా పదుకోన్, పరిణీత చోప్రా తదితరుల ఫొటోలపై కూడా కొందరు కించపరిచేరీతిలో అసభ్య కామెంట్లు పెట్టారు. ఇలా ట్రోల్ చేసేవారికి కొందరు ఘాటు రిప్లే ఇవ్వగా.. మరికొందరు సెలబ్రిటీలు లైట్ తీసుకున్నారు. #holiDay #timeoff #goa #sea #sunset #friends @marc_t_richardson #afteraswim A post shared by Radhika (@radhikaofficial) on Feb 24, 2018 at 5:55am PST -
‘బతుకమ్మ చీర’కు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండగకు పంపిణీ చేయనున్న చీరల కొనుగోలుకు చేనేత జౌళిశాఖ టెండర్లు పిలిచింది. సిరిసిల్ల మరమగ్గాల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం తలపెట్టింది. దీనికోసం దాదాపు 86 లక్షల చీరెలు అవసరం. కానీ అంత భారీ మొత్తం వస్త్రోత్పత్తి సిరిసిల్లలో ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అధికారు లు అంచనాకు వచ్చారు. రాష్ట్రంలోనే అత్య ధికంగా సిరిసిల్లలో 32 వేల మరమగ్గాలు న్నాయి. కానీ అక్కడున్న రెగ్యులర్ ఆర్డర్ల కారణంగా ప్రభుత్వం ఇచ్చిన చీరల తయారీ పదివేల మరమగ్గాలపై మాత్రమే ప్రారంభమైంది. ఈ లెక్కన రోజుకు 8 లక్షల మీటర్ల ఉత్పత్తికి మించి సాధ్యం కాదు. కానీ ప్రభుత్వ ఆర్డరు మేరకు ఆరు కోట్ల మీటర్లు ఉత్పత్తి కావాలి. నెలలో ఇంత భారీ మొత్తం సాధ్యం కాదు కనుక... టెండర్లను ఆహ్వానించింది. -
చీర కట్టుకున్నదని నటిని తిట్టేశారు!
బాలీవుడ్ నటి సోహా అలీఖాన్, ఆమె భర్త కునాల్ ఖేము త్వరలోనే తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గర్భవతి అయిన ఆమెకు తమ ఇంట్లో సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోహా అలీఖాన్ ట్విట్టర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఇళ్లంతా అలకరించిన బెలూన్ల నడుమ.. గులాబీ రంగు చీర కట్టుకొని, భర్తతో దిగిన ఫొటోను ఆమె పోస్టు చేసింది. ఆమె ఇలా ఫొటోలు పెట్టిన కాసేపటికే.. కొందరు విద్వేషకులు ఆమెపై మండిపడ్డారు. సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకున్నందుకు ఆమె తీరుపై విమర్శలు గుప్పించారు. ఆమె ఇక ఎంతమాత్రం ముస్లిం కాదంటూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఆమె తన శ్రీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. రంజాన్ ఈద్ సందర్భంగా ఈ ఫొటోలు పెట్టారంటూ కొందరు నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. కొందరు నెటిజన్లు ఆమె హిందూమతంలోకి మారిందంటూ విమర్శించారు. కాగా, పలువురు నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. ఈ ఫొటోలకు మతానికి ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి వైఖరితోనే ఇస్లాం మతంపై తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. చీర కట్టుకోవడం భారతీయ సంప్రదాయం అని, దీనిని మతకోణంలో చూడొద్దంటూ హితవు పలుకుతున్నారు. It isn't a party without balloons 🎈! pic.twitter.com/VjWnntegjS — Soha Ali Khan (@sakpataudi) 27 June 2017 The love of family and friends is reason enough to dress up 💕 pic.twitter.com/7UP6YMU7UM — Soha Ali Khan (@sakpataudi) 28 June 2017 so finally you have become a hindu — Rizwan Khan (@rizwan_khan1012) 28 June 2017 I wll not abuse,But Ppl like u are responsible ,y Islam is being Blamed.for godsake come out of this mentality @SahilThoughts @purujimishra — Legion's Guru (@Avishal9) 28 June 2017 -
చేతులు మొక్కిన చీరలు
సృష్టిని... చేతిలో తీసుకొని ముద్దాడి... మగ్గానికి రాసి దోరగా... దారానికి పూసి నవ నవ... నవ్యదనం నేసి చేతులు మొక్కిన చీరలతో నీ అందానికి దండం చేసి... ►చీర మీద లేత రంగులు, అంతే అమరికగా ఇమిడిపోయే నూలు దారాల పువ్వులు మగ్గం మీదే పురుడు పోసుకుంటే... ఇలా అందంగా కళ్లకు కడతాయి. ►రాయల్ బ్లూ కలర్ కాటన్ శారీకి మల్టీకలర్ బార్డర్ ఆకర్షణీయతను పెంచుతోంది. పార్టీవేర్‌లో ప్రత్యేకంగా నిలుపుతుంది. ►చీరంతా ఒకే రంగు... దానికి ఓ సన్నని కాంట్రాస్ట్ అంచు... మరే ఆభరణమూ అక్కర్లేని హుందాతనం కాటన్ చీరకే సొంతం. ►చీరంతా చెక్స్ వచ్చినా కాంట్రాస్ట్ కలర్స్‌తో మ్యాజిక్ చేసినా కాటన్ శారీదెప్పుడూ ఓ ప్రత్యేకత. వేసవికి ఆధునికపు హంగుగా ఉండే కాటన్ శారీ ఎవర్గ్రీన్! ►సింపుల్‌గా అనిపించే తెలుపు రంగు కాటన్ శారీకి ప్రింటెడ్ కాటన్ బ్లౌజ్ స్టైలిష్ లుక్‌ను తీసుకువస్తుంది. క్యాజువల్ వేర్‌గానే కాదు ఈవెనింగ్ వేడుకల్లోనూ హైలైట్‌గా నిలుస్తుంది. ►వేడుకల్లోనే కాదు ఫ్యాషన్ వేదికల మీదా కాటన్ ప్రత్యేకతను చాటుతోంది. అందుకే అతివల మనసు లేత రంగు లినెన్ కాట¯Œ చీరల మీదకు మళ్లుతుంది. -
కుట్టుపట్టు
ముందే పట్టు పట్టుకుందామన్నా పట్టు దొరకదుఅలా జారిపోయే సిల్క్ ఇది.దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్!ఈ చేతి కుట్టు తర్వాతచీర మీదపట్టు దొరుకుద్ది గానీధరే పట్టు చిక్కదు.చూసి ఆనందిద్దాంవీలైనప్పుడు కొందాంలేదంటే...ఈ కుట్టు పట్టుకే కాదుఅన్ని చీరలకూక్రియేటివ్గా కుట్టితక్కువలో కొట్టేద్దాం. ⇔ నలుపు రంగు చీరకు వెడల్పాటి అంచులా ఎంబ్రాయిడరీ పనితనం జిలుగులు పోతోంది. చిరు నగవులతో పోటీపడుతూ కొత్త అందాలు విరబూస్తోంది. ⇔ జరీతో అల్లిన మామిడిపిందెల డిజైన్ అంచుజత చేస్తే ఏ రంగు చీరైనా ఇలా ముచ్చటగారూపుకట్టాల్సిందే! ⇔ రాణీపింక్ చీరపై జరీ దారాలు, ముత్యాల వరుసలు కొంగొత్తగా రూపుకట్టి కొత్త కళను మోసుకొచ్చాయి. ⇔ పట్టుచీరే బంగారం. ఇక ఎంబ్రాయిడరీ హంగులు తోడైతే వేడుకకే సింగారం. ⇔ పచ్చని చీరకు గులాబీ రంగు అంచు సంప్రదాయాన్ని కూడా సై్టలిష్‌గా మార్చేస్తుంది. ⇔ జరీ జిలుగులతోనూ, అద్దాలతోనూ అంచుగా రూపు కట్టిన బంగారు రంగు చీర వేదికపై వెలుగు పూలు వెదజల్లుతుంది. -
గుడి కట్టు పండగ పట్టు
పసుపు, పచ్చ, ఎరుపు, నీలం, గంధం, గులాబీ... గుడి ద్వారానికి ఈ అన్ని రంగులూ అద్దినట్టు అనిపిస్తున్నాయి. ఈ చీరల్లో... మన బంగారు తల్లులు గుడిలో అడుగుపెడితేనే పండుగలా అనిపిస్తుంది. ఈ పండుగ సీజన్లో గుడికట్టు... పండగ పట్టు. ► రాణీ పింక్ కలర్ పట్టుచీరకు బంగారు జరీ వెలుగు... వేడుకకు వెయ్యింతల కళను మోసుకొస్తుంది. ► నీలం, వంగపండు, జరీ కాంబినే షన్తో నేసిన పట్టు చీర కడితే నవ్వులతో పండుగ కళ నట్టింటికి విచ్చేసినట్టే! ► జరీ మామిడి పిందెల డిజైన్, సియాన్గ్రీన్ కలర్ కలనేతలో ఓ ఆకర్షణ. పట్టు చీరకు పూర్తి కాంట్రాస్ట్ డిజైన్ బ్లౌజ్ పండుగ రోజుకు సిసలైన కాంబినేషన్. ► గడపకు కుంకుమ బొట్టు... మేనికి ఎరుపు రంగు పట్టు చీర పండుగ కళను వెయ్యింతలు చేస్తుంది. ► చీరంత అంచు అయితే సింగారం బంగారమే! ► మిసిమి మేని ఛాయతో పోటీపడే పసుపువన్నె పట్టు చీర ఆధునికపు సింగారాలను అలవోకగా అద్దుతుంది. ► అలల అలల జరీ కలబోత. నీలం రంగు జిలుగుల పట్టుచీర కడితే ఆకాశం నడిచి వచ్చినట్టే! ► నారింజ రంగు పట్టుచీరకు ముదురు నీలం రంగు అంచు, అందులో దాగున్న జరీ జిలుగుల వెలుగులు మేనిపై అమరితే రత్నాలు రాశులుగా పోసినట్టే! -
శారీతో.. ప్యాంట్!
న్యూలుక్ శారీస్‌తో స్కర్టులు, గౌన్లు, లెహంగాలను రూపొందించడం తెలిసిందే! ఇలా ట్రౌజర్ ప్యాంట్గానూ డిజైన్ చేస్తే?! కుర్తా, టాప్స్‌కు కొత్త అందాలను అద్దవచ్చు. మోడ్రన్‌గా వెలిగిపోవచ్చు. దీనికోసం మందంగా ఉండే దుపట్టాలనూ ఉపయోగించవచ్చు. ∙పాత మోడల్ అనుకున్న జరీ, పువ్వుల ప్లింట్లు ఉన్న చీరలు లేదా దుపట్టాలను ఎంచుకోవాలి. కొలతల ప్రకారం కావల్సినంత ఫ్యాబ్రిక్ తీసుకొని ప్యాంట్‌గా డిజైన్ చేయాలి. పూర్తి కాంట్రాస్ట్ పువ్వుల డిజైన్లలో ఉన్న కలర్ టాప్ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈవెనింగ్, వెస్ట్రన్ వేడుకలకు ఈ ప్యాంట్స్ బాగా నప్పుతాయి ∙పూర్తి ప్లెయిన్ సిల్క్ శారీస్‌తోనూ రూపొందించుకోవచ్చు ∙కాటన్ శారీ లేదా దుపట్టాలను ఇలా ట్రౌజర్ ప్యాంట్‌గా రూపొందించుకొని ధరిస్తే సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉంటాయి. -
వివాహిత ఆత్మహత్య
చెన్నూరు : స్థానిక పడమటి వీధిలో నివాసం ఉండే కాలహస్తి నాగరాజు భార్య లక్ష్మిదేవి(42) గురువారం ఇంటిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ వినోద్‌కుమార్ కథనం మేరకు...ప్రొద్దుటూరుకు చెందిన ఈమె 24ఏళ్ల క్రితం నాగరాజుతో వివాహమైంది. నాగరాజు ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తూ, స్థానిక సాయిబాబా గుడిలో పూజారిగా ఉండేవాడు. పాఠశాలకు వెళ్లడంతో ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెందింది. స్థానికులు గమనించి తలుపులు పగులగొట్టి తీయగా అప్పటికే మృతి చెందింది. మృతి కారణం సంతానం కలుగలేదని, అనారోగ్యం వల్లే నంటూ బంధువులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. -
శారీ పల్లూతో స్కర్ట్!
⇔ చీరలను స్కర్ట్లుగా రూపొందించుకోవడం మనకు ఎప్పటి నుంచో తెలుసు. ⇔ అయితే, చీర మిగతా భాగాన్ని స్కర్ట్‌కి ఉపయోగించినా పల్లూ భాగాన్ని ఏం చేయాలో తెలియక ఓ పక్కన పెట్టేస్తుంటారు. కొందరు పల్లూ భాగంతో బ్లౌజులు కుట్టుకుంటారు. ⇔ అయితే, పల్లూతో కలిపి లేయర్డ్ స్కర్ట్ ఏ విధంగా రూపొందించుకోవచ్చో తెలుసుకుందాం. ⇔ స్కర్ట్స్లలో హిప్పీ స్టైల్ ఒకటి. నాలుగైదు రకాల సిల్క్ ఫ్యాబ్రిక్స్‌ను ఉపయోగించి ఈ స్కర్ట్‌ను రూపొందించుకోవచ్చు. చీర అంచులను ఈ స్కర్ట్‌కు జత చేయవచ్చు. ⇔ రెండు-మూడు రకాల సిల్క్ చీరలను ఎంచుకొని వాటికి కుచ్చులపెట్టి, పైన బెల్ట్ భాగాన్ని జత చేయాలి. దీనిని నడుము చుట్టూ చుట్టి, నాడతో ముడి వేస్తే మరో అందమైన లేయర్డ్ డ్రెస్ రెడీ. ⇔ ఒక ప్లెయిన్ చీర, మరో ప్రింటెడ్ చీర ఎంచుకొని రెండింటి కాంబినేషన్‌తో ఒక డిజైనర్ స్కర్ట్‌ను రూపొందించుకోవచ్చు. ⇔ స్కర్ట్ నడుము కింది భాగంలో లేదా క్రాస్‌గా చీర పల్లూ భాగం వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి. దీంతో ఆకర్షణీయమైన పల్లూ భాగం స్కర్ట్ మీద ఓ వైపు అందంగా ఇమిడిపోతుంది. స్కర్ట్‌కు ఇదో డిజైన్ అనిపించేలా ఉంటుంది. అందంగానూ కనిపిస్తుంది. ⇔ దాండియా నృత్యాలలో డిజైనర్ లెహంగాలు లేవని ఇబ్బంది పడకుండా ఇలాంటి స్కర్ట్‌లను ఆనందంగా ధరించవచ్చు. -
చీర సింగారం..నారు సురక్షితం
బయ్యారం : చుట్టూ చీరలు..తడిక మాదిరి చుట్టేశారు. వేలాది రూపాయలు వెచ్చించి మిరప గింజలు కొని..పోసిన నారును ఇలా..చీరల కాంపౌడ్ లోపల పోసేసుకున్నారు. పశువులు తొక్కకుండా కాపాడుకునేందుకు బయ్యారంలో రైతులు ఈ ఉపాయం చేశారు. అప్పుడే వస్తున్న మొలకలను అస్తమానం కాపలా కాయలేక, వదిలేస్తే వచ్చే నష్టం భరించలేక..ఇదిగో ఇలా చీరలతో రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నారు. వారెవ్వా..భలే ఐడియా వేశారే..అని కొందరు రైతులు ఆశ్చర్యపోతున్నారు. -
ఆ బడిలో రోజూ చీరల పంచాయితే!
మైలవరం: సాధారణంగా చాలా బళ్లలో మహిళా ఉపాధ్యాయులు చీరెలకు, జాకెట్లకు, కుట్లు, అల్లికలతో వృథాగా కాలం వెళ్లబుచ్చుతుంటారు. కానీ వద్దిరాల ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయినులు సరికొత్త నిర్వాకాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతి రోజు పాఠశాల పనివేళల్లోనే చీరల అమ్మకందారుల ఇళ్లవద్దకు విద్యార్థినులను పంపించి చీరెలు బడికి తెప్పించుకొంటున్నారు. ‘ అది బాగుంది... ఇది బాగలేదు‘ అంటూ గంటల తరబడి కాలం వృథా చేస్తున్నారు. వద్దిరాల జెడ్పీ హైస్కూల్‌కు చుట్టుపక్కల గ్రామాలైన ధన్నవాడ, గొల్లపల్లె, చిన్నవెంతుర్ల, ఉప్పలపాడు, మాధవాపురం నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఉపాధ్యాయులు మాత్రం జమ్మలమడుగు పట్టణం నుంచి వస్తారు. సాధారణంగా ఒక వయసు వచ్చిన ఆడపిల్లలను ఇతర ఇళ్లకు గాని, దుకాణాలకు గాని పంపడానికి వారి తల్లిదండ్రులు ఇష్టపడరు. అలాంటిది ఎక్కడో పరాయి ఊరిలో అది కూడా చీరల కోసమని కొత్త వ్యక్తుల ఇళ్ల వద్దకు ఆడపిల్లలను పంపించడం.. పాఠశాల పనివేళల్లోనే రోడ్లపైన సంచరిస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు కొందరు మహిళా ఉపాధ్యాయులు సంవత్సరం, రెండేళ్ల లోపు వయస్సు ఉన్న తమ చిన్నారులను బడికి తీసుకొని వచ్చి వారిని సముదాయించుకోవడంతోనే సమయాన్నంతా వృథా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్ధులు సైతం ఆ చిన్నారులతో ఆడుకొంటూ ఉండడంతో బోధనాభ్యసన ప్రక్రియ కుంటు పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక పురుష ఉపాధ్యాయులలో కొందరు పాఠశాల సమయంలోనే నోటి నిండా పాన్‌పరాగ్ నములుతుండడం.. విద్యార్థుల కళ్ల ముందే ధూమపానం సేవిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. అలాగని ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ అలాంటి వారే అనుకుంటే పొరపాటు పడినట్లే. కొందరు అయ్యవార్లు విద్యార్థుల కోసం నిత్యం కష్టపడుతూ ఉదయం, సాయంత్రం గంట చొప్పున అదనపు తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. కేవలం కొందరు ఉపాధ్యాయుల నిర్వాకం పాఠశాలకు చెడ్డపేరు తెస్తోంది. గత విద్యా సంవత్సరంలో ఉదయం 9.30 గంటలకే పాఠశాల ప్రధాన ద్వారం మూసివేయడం, తిరిగి సాయంత్రం వరకు తాళాలు తీయక పోవడంతో అప్పట్లో పాఠశాలలో క్రమ శిక్షణ బాగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు పాఠశాల పనివేళల్లో తరచూ రోడ్లపైనే సంచరిస్తున్నారు. పాఠశాల పరిస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
స్టైల్ సందడి
గలగల గోదావరికి చీరకడితే... కుదురు గోదావరి అవుతుంది! నింగి విహంగానికి చీరకడితే... హరివిల్లై ఒద్దికగా వాలుతుంది! చీరంటేనే.. పద్ధతీ, పెద్దరికం. మరి ఈ ‘స్టైల్’ ఏమిటి? ‘సందడి’ ఏమిటి?! గౌరాంగ్ షా క్రియేట్ చేశారు. కుదురైన స్టైల్... పెళ్లి సందడికి ఒదిగేలా! పసుపు రంగు అంచు, బూడిదరంగు టై అండ్ డై ఇకత్ కంజీవరం చీరలో సినీ నటి కాజల్ అగర్వాల్. ఈ చీరను సంప్రదాయ కొరవాయి, కంచిపురం, ఇకత్ చేనేత కళలను ఇనుమడింపజేసి డిజైన్ చేశారు.మరుగునపడిపోయిన కళను వెలికితీసే బాధ్యతను తలకెత్తుకున్నట్టు కనిపిస్తాయి గౌరాంగ్ షా డిజైన్లను పరిశీలిస్తే. ఎక్కడ ఉన్నా కళ్లను కట్టిపడేసే రంగులు, సంప్రదాయ చేనేత హంగులు, వాటిలోనే అల్లుకుపోయే డిజైన్లు చూపుతిప్పుకోనివ్వవు. భారతీయ సంప్రదాయ కళకు ప్రాణం పోసే గౌరంగ్ షా కంజీవరం, ఇకత్ వంటి చేనేతలకు జమదాని కళతో కనువిందు చేసేలా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తులు. గౌరంగ్ షా డిజైన్ శారీస్‌ను చూస్తే ఒక అద్భుతమైన పెయింటింగ్ కాన్సెప్ట్ మన కళ్లకు కడుతుంది. భారతీయ హస్తకళలలో ప్రముఖంగా నిలిచే బెంగాలీయుల కాంతా వర్క్, హైదరాబాదీల జర్దోసీ పనితనం, హుబ్లీ వారి కసుటి, రాజస్థాన్ మరోది, లక్నో చికంకారి, కశ్మీర్ కశిదకారి, కచ్ బంధని-పార్శి, ముంబయ్ గర వర్క్స్ ప్రధానంగా కనిపిస్తాయి. తెలుగు నేల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఎదిగిన ఫ్యాషన్ డిజైనర్ గౌరాంగ్ షా! సమకాలీన రంగులతో డిజైన్ చేసిన డబుల్ ఇక్కత్ చీరలు ఇవి. వీటికి జమదాని బ్లౌజ్‌లను జత చేశారు.ఇండిగో ఖాదీ చేనేత శారీ ఇది. పూర్తి జమదాని కళానైపుణ్యాన్ని మేళవించి ఈ చీరను రూపొందించారు. నెమలిపింఛం రంగు, జరీ పనితనంతో నేసిన ఈ సంప్రదాయ కంజీవరం చీరలో సినీ నటి తాప్సీ. లైన్ ఆఫ్ కింగ్ కాన్సెప్ట్‌తో తీసుకువచ్చిన ఈ చీరలో ఎవరైనా మహారాణి కళతో వెలిగిపోవాల్సిందే!గౌరాంగ్ షా డిజైన్ చేసిన కాంతులీనే పైథాని పట్టు చీరను ధరించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్. -
శారీ పోయి గౌను వచ్చే!
రీయూజ్ ‘చీర రంగు బాగుంది.. కానీ డిజైన్ నచ్చలేదు.’ ‘ఈ చీర కట్టి కట్టి బోర్ కొట్టి పక్కన పెట్టేశాను.’ ‘చీర పాడైనా అంచులు, పల్లూ సూపర్బ్‌గా ఉన్నాయి.తీసేయాలనిపించడం లేదు.’ ‘ఈ చీర కట్టుకుంటే నాయనమ్మలా ఉన్నావు అంటున్నారు... ’ చీరల గురించి ఈ తరహా కామెంట్స్ చాలా మంది ఇల్లాళ్ల నోట వింటూ ఉంటాం. ఇలాంటి ఇబ్బంది ఉంటే మీ శారీకో కొత్త రూపు ఇవ్వవచ్చు. మీ అమ్మాయి మోడ్రన్ స్టైల్‌కి అనువుగా పాత చీరలను ఇలా కొత్తగా మార్చేయవచ్చు. నేటి యూత్‌ని మీ సరికొత్త సృజనతో సర్ప్రైజ్ చేయచ్చు. ఇలా చేయండి ఆరు గ జాల చీరలో కావల్సిన భాగాన్ని ఎంచుకోండి. మ్యాక్సీ డిజైన్ చేయాలా.. స్కర్ట్ కుట్టించాలా అనేది తేల్చుకోండి. పల్లూని, అంచులను వేరు చేసి స్కర్ట్ లేదా గౌనులకు అంచులుగా జత చేయండి. పట్టు చీరతో డిజైన్ చేసిన మిడ్ స్కర్ట్‌కి మోడ్రన్ టాప్ వేస్తే అల్ట్రామోడ్రన్ లుక్‌తో పార్టీలోనూ అదరగొట్టేస్తారు. చీర అంచులను గౌన్‌కి నెక్ డిజైన్‌గా, బెల్ట్‌గా,... రకరకాల ప్యాటర్న్స్ తీసుకుంటే వాటిల్లో మీ అమ్మాయిలు బుట్టబొమ్మల్లా మెరిసిపోతారు. -
సబ్యసాచీరలు
సబ్యసాచి దుప్పటి చుట్టినా అందంగానే ఉంటుంది. ఇక చీర చుడితే...ఆయన డిజైన్ చేసిన చీరలకు విదేశాలలోనూ మాంచి గిరాకీ ఉంటుంది. ‘ఏమిటయ్యా నీ మ్యాజిక్’ అని అడిగితే.... చీరల్ని చీరల్లా కాకుండా సబ్యసా‘చీర’ల్లా చూడమంటున్నాడు. ఆ గొప్పతనమేంటో మీరూ చూడండి. మీ చీరలకూ ఆ కొత్త కళను తీసుకురండి. నిలయ పేరుతో సబ్యసాచి రూపొందించిన డిజైనరీ శారీ ఇది. ఎరుపు రంగు బెనారస్ పట్టుకు అదనంగా అమర్చిన ఎంబ్రాయిడరీ అంచు... దానికి తగ్గ అలంకరణ ఈ చీర అందాన్ని వెయ్యింతలు చేసింది. పువ్వుల ప్రింట్ల క్రేప్ శారీకి ఎంబ్రాయిడరీ అంచు, మోడ్రన్ బ్లౌజ్‌తో తీర్చిదిద్దిన హంగులు కిందటేడాది కాన్స్ అంతర్జాతీయ సినిమా ఉత్సవంలో హైలైట్‌గా నిలిచాయి. కథ చెబుతున్నంత అందంగా! ఇండియన్ ఫ్యాషన్ రంగానికి రాచకళను తీసుకువచ్చిన ప్రసిద్ధ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి. రంగులు, హంగులతో దుస్తులకు అతనో అద్భుతమైన కళను తీసుకువస్తారు. వాటిని అలంకరించుకున్న అతివలు రాచఠీవితో వేదికలపైన అడుగులు కదుపుతారు. తన ప్రతీ డ్రెస్ డిజైన్ ఒక కథ చెబుతున్నట్టు, ఓ అందమైన కవిత అల్లుతున్నట్టు మనసులను హత్తుకుపోతుంది. ఇండియన్ ప్యాషన్ డిజైన్ కౌన్సిల్లో ముఖ్య సభ్యుడుగా కొనసాగుతున్న ‘సబ్యసాచి’ లేబుల్ డిజైన్స్ అంటే బాలీవుడ్ తారలు పోటీపడతారు. సబ్యసాచి డిజైన్స్ రూపకల్పనను పరిశీలిస్తే అత్యంత సాదాగా అనిపిస్తూనే ఒక అద్భుతమైన తత్త్వాన్ని మన కళ్లకు కడతాయి. ప్రాచీనసౌరభాలు వెదజల్లుతుతుంటాయి. ప్రాంతీయ పట్టణమైన కలకత్తా సాంస్కృతిక సంప్రదాయాల నుంచి స్ఫూర్తిపొందిన సబ్యసాచి ఆ వైభవాన్ని తన మేథాశక్తితో దుస్తుల మీద రూపొందిస్తుంటారు. అపూర్వమైన అల్లికతో కూడిన ఫ్యాబ్రిక్స్, ప్యాచ్ వర్క్స్, ఇతర అలంకారాలను సబ్యసాచి డ్రెస్ డిజైన్స్‌లో చూస్తాం. వెలకట్టలేని ఇతని డిజైన్స్ వేల రూపాయల నుంచి లక్షల్లో ధరపలుకుతున్నాయి. ఈ వైభవాన్ని కొద్దిపాటి మార్పులతో మీ చీరలకూ అద్దవచ్చు.