శారీ పల్లూతో స్కర్ట్! | skirt with sari pallu new designs | Sakshi
Sakshi News home page

శారీ పల్లూతో స్కర్ట్!

Published Thu, Sep 15 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

శారీ పల్లూతో స్కర్ట్!

శారీ పల్లూతో స్కర్ట్!

చీరలను స్కర్ట్‌లుగా రూపొందించుకోవడం మనకు ఎప్పటి నుంచో తెలుసు.

అయితే, చీర మిగతా భాగాన్ని స్కర్ట్‌కి ఉపయోగించినా పల్లూ భాగాన్ని ఏం చేయాలో తెలియక ఓ పక్కన పెట్టేస్తుంటారు. కొందరు పల్లూ భాగంతో బ్లౌజులు కుట్టుకుంటారు.

అయితే, పల్లూతో కలిపి లేయర్డ్ స్కర్ట్ ఏ విధంగా రూపొందించుకోవచ్చో తెలుసుకుందాం.

స్కర్ట్స్‌లలో హిప్పీ స్టైల్ ఒకటి. నాలుగైదు రకాల సిల్క్ ఫ్యాబ్రిక్స్‌ను ఉపయోగించి ఈ స్కర్ట్‌ను రూపొందించుకోవచ్చు. చీర అంచులను ఈ స్కర్ట్‌కు జత చేయవచ్చు.

రెండు-మూడు రకాల సిల్క్ చీరలను ఎంచుకొని వాటికి కుచ్చులపెట్టి, పైన బెల్ట్ భాగాన్ని జత చేయాలి. దీనిని నడుము చుట్టూ చుట్టి, నాడతో ముడి వేస్తే మరో అందమైన లేయర్డ్ డ్రెస్ రెడీ. 

ఒక ప్లెయిన్ చీర, మరో ప్రింటెడ్ చీర ఎంచుకొని రెండింటి కాంబినేషన్‌తో ఒక డిజైనర్ స్కర్ట్‌ను రూపొందించుకోవచ్చు.

స్కర్ట్ నడుము కింది భాగంలో లేదా క్రాస్‌గా చీర పల్లూ భాగం వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి. దీంతో ఆకర్షణీయమైన పల్లూ భాగం స్కర్ట్ మీద ఓ వైపు అందంగా ఇమిడిపోతుంది. స్కర్ట్‌కు ఇదో డిజైన్ అనిపించేలా ఉంటుంది. అందంగానూ కనిపిస్తుంది.

దాండియా నృత్యాలలో డిజైనర్ లెహంగాలు లేవని ఇబ్బంది పడకుండా ఇలాంటి స్కర్ట్‌లను ఆనందంగా ధరించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement