శారీ పల్లూతో స్కర్ట్!
⇔ చీరలను స్కర్ట్లుగా రూపొందించుకోవడం మనకు ఎప్పటి నుంచో తెలుసు.
⇔ అయితే, చీర మిగతా భాగాన్ని స్కర్ట్‌కి ఉపయోగించినా పల్లూ భాగాన్ని ఏం చేయాలో తెలియక ఓ పక్కన పెట్టేస్తుంటారు. కొందరు పల్లూ భాగంతో బ్లౌజులు కుట్టుకుంటారు.
⇔ అయితే, పల్లూతో కలిపి లేయర్డ్ స్కర్ట్ ఏ విధంగా రూపొందించుకోవచ్చో తెలుసుకుందాం.
⇔ స్కర్ట్స్లలో హిప్పీ స్టైల్ ఒకటి. నాలుగైదు రకాల సిల్క్ ఫ్యాబ్రిక్స్‌ను ఉపయోగించి ఈ స్కర్ట్‌ను రూపొందించుకోవచ్చు. చీర అంచులను ఈ స్కర్ట్‌కు జత చేయవచ్చు.
⇔ రెండు-మూడు రకాల సిల్క్ చీరలను ఎంచుకొని వాటికి కుచ్చులపెట్టి, పైన బెల్ట్ భాగాన్ని జత చేయాలి. దీనిని నడుము చుట్టూ చుట్టి, నాడతో ముడి వేస్తే మరో అందమైన లేయర్డ్ డ్రెస్ రెడీ.
⇔ ఒక ప్లెయిన్ చీర, మరో ప్రింటెడ్ చీర ఎంచుకొని రెండింటి కాంబినేషన్‌తో ఒక డిజైనర్ స్కర్ట్‌ను రూపొందించుకోవచ్చు.
⇔ స్కర్ట్ నడుము కింది భాగంలో లేదా క్రాస్‌గా చీర పల్లూ భాగం వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి. దీంతో ఆకర్షణీయమైన పల్లూ భాగం స్కర్ట్ మీద ఓ వైపు అందంగా ఇమిడిపోతుంది. స్కర్ట్‌కు ఇదో డిజైన్ అనిపించేలా ఉంటుంది. అందంగానూ కనిపిస్తుంది.
⇔ దాండియా నృత్యాలలో డిజైనర్ లెహంగాలు లేవని ఇబ్బంది పడకుండా ఇలాంటి స్కర్ట్‌లను ఆనందంగా ధరించవచ్చు.