సీజన్‌కు తగ్గట్టు స్టైల్‌గా ఉండాలి
వేడుకకు తగ్గట్టు బ్రైట్‌గా ఉండాలి
అంతకుమించి కంఫర్ట్ ఉండాలి
డిజైనర్ క్రాప్‌టాప్స్, పలాజో స్కర్ట్స్‌తో సింపుల్ అండ్ మార్వలెస్ అంటూ మార్కులు కొట్టేయడం ఇప్పుడిక సూపర్ ఈజీ.
రాబోయేది పెళ్ళిళ్ల సీజన్. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తక్కువ మందితో సింపుల్‌గా కుటుంబసభ్యుల మధ్యన మాత్రమే వేడుకలు జరిగే అవకాశాలున్నాయి. బర్త్‌డే పార్టీ అయినా, చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయినా తక్కువ మందితో జరుపుకునే వేడుక ల్లో మీరు బ్రైట్‌గా వెలిగిపోవాలంటే సింపుల్ ఐడియా స్కర్ట్ పలాజో, డిఫరెంట్ క్రాప్‌టాప్. అందులోనూ ఇది వేసవి కూడా కావడంతో ధరించే డ్రెస్ సౌకర్యంగానూ ఉండాలి. అదే టైమ్‌లో బ్రైట్‌గా కనిపించాలి. స్టైలిష్ అనిపించాలి. ఈ హంగులన్నీ తీసుకువచ్చే ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని కాటన్ ఫ్యాబ్రిక్‌తోనే ప్లాన్ చేసుకోవచ్చు.
సౌకర్యమే ఫస్ట్
ప్రింటెడ్ కాటన్‌తో డిజైన్ చేసిన డ్రెస్సులివి. క్యాజువల్ వేర్‌కి, పార్టీవేర్‌కి వాడుకోదగినవి. ఇకత్ కాటన్, హకోబా కాటన్, ప్రింటెడ్ కాటన్స్‌ని పలాజో డిజైన్‌కి తీసుకున్నాం. పలాజోలు ఇష్టం లేనివారు ఇదే ప్యాటర్న్‌తో స్కర్ట్‌లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్‌గా ఫ్లోరల్ షిఫాన్, చందేరీతో డిజైన్ చేసిన క్రాప్‌టాప్స్, పెప్లమ్ స్టైల్ క్రాప్‌టాప్ జత చేశాం. ఈ డ్రెస్సింగ్ బర్త్‌డే వంటి పార్టీలకు బాగా నప్పుతాయి. ఇది వేసవి కాబట్టి ఈ డ్రెస్సింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. అమ్మాయిలకు మాత్రమే ఈ డ్రెస్సులు బాగుంటాయి అనుకోనక్కర్లేదు. అన్ని వయసుల వారూ ఈ డ్రెస్సింగ్ స్టైల్‌ను కొన్ని మార్పులతో ప్లాన్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ స్టైల్‌కు నప్పే దుపట్టాను కూడా జత చేసుకోవచ్చు.
భార్గవి అమిరినేని
ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment