Modern Dresses
-
నిన్న.. నేడు.. రేపటి స్టైల్
ఒకరేమో నిన్నటి తరం ఇష్టాలను తెలిసున్నవారు మరొకరు నేటి తరపు ఆసక్తులను ఒంటపట్టించుకున్నవారు. ఈ ఇద్దరూ తూరుపు పశ్చిమానికి వారధులుగా ఇండోవెస్ట్రన్ డ్రెస్ డిజైన్స్‌తో సినీ స్టార్స్‌ను కూడా ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ అత్తాకోడళ్ల పేర్లు శివానీ సింఘానియా, మాన్సీ సింఘానియా. అత్త తన డిజైన్స్‌ని కోడలికి నేర్పిస్తుంటే.. కోడలు నేటి ట్రెండ్‌ని అత్తకు పరిచయం చేస్తుంది. ఇద్దరూ కలిసి ఒకే రంగంలో రాణిస్తూ పాతికమందికి ఉపాధి కల్పిస్తున్నారు. డిజైన్స్ తెలుసుకుంటూ.. కోడలు మాన్సీ మాట్లాడుతూ.. ‘నేను ఎంబీయే చేశాను. డ్రెస్ డిజైన్స్‌ని ఎంపిక చేసుకోవడంలో ఇష్టంతో పాటు ఈ తరం ఎలాంటి మోడల్స్‌ని ఇష్టపడుతుందో తెలుసు. అయితే, ఈ రంగంలోకి వస్తాను అనుకోలేదు. నా పెళ్లికి మా అత్తగారే డిజైనర్. అవి నాకు చాలా బాగా నచ్యాయి. పెళ్లయ్యాక మా అత్తగారు శివానీ దగ్గర డిజైన్స్‌కు సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి రూపకల్పనలో ఉంటున్నాను. మా కలెక్షన్లో బ్రైడల్, కాంటెంపరరీ, వెస్ట్రన్, ఇండో–వెస్టర్న్– క్లాసిక్ వేర్లలో స్ట్రెయిట్ కట్ ΄్యాటర్న్స్, మినిమలిస్ట్ ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా ఉంటాయి. వింటేజ్ స్టైల్స్‌తో పాటు మోడర్న్ డ్రెస్సుల రూపకల్పన మా ప్రత్యేకత’ ’ అని వివరిస్తుంది మాన్సీ. సెల్ఫ్ డిజైనర్‌ని.. వ్యక్తిగత శైలి, క్లిష్టమైన డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ తమ ప్రత్యేకతలు అని చెబుతారు ఈ అత్తాకోడళ్లు. బాలీవుడ్ స్టార్ సోహా ఆలీఖాన్, సోనాక్షి, మోడల్స్, ప్రముఖ గాయకులతో కలిసి తమ క్రియేషన్స్‌తో వేదికలపైన ప్రదర్శించామని వివరించారు. ‘‘నేను చదువుకున్నది ఇంటర్మీడియెట్ వరకు. కానీ ఈ రంగంలో ఉన్న ఆసక్తి నన్ను ఎంతోమందికి పరిచయం చేసింది. ఇంట్లో ఖాళీ సమయాల్లో పెయింట్స్, పెన్సిల్ డ్రాయింగ్ చేసేదాన్ని. కొన్నాళ్లకు ఆ డ్రాయింగ్స్‌ని టైలర్‌కి చూపించి మోడల్ డ్రెస్సులు తయారు చేయమని చె΄్పాను. మొదట మా ఇంట్లో అమ్మాయిలకు, బంధువులకు డిజైన్ చేసి ఇస్తూ, ఈ రంగంలోకి వచ్చేశాను. ఆ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్‌ని సొంతంగా నేర్చుకున్నాను. నా డిజైన్స్ మామూలు వారి దగ్గర నుంచి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కూడా మెచ్చుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రతి అమ్మాయి మా దుస్తుల్లో ఒక దివ్వెలా వెలిగి΄ోవాలని ఊహించి తొమ్మిదేళ్ల క్రితం బంజారాహిల్స్‌లో కనక్ పేరుతో డ్రెస్ డిజైన్ స్టూడియో ్రపారంభించాం’ అని వివరిస్తారు శివాని. -
ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అంటుంటారు
‘ఏ వయసులో అయినా సరే ఎవ్వరిపైనా ఆధారపడకూడదు’ అని టైలరింగ్ చేస్తూ తన రెక్కల కష్టం మీదే బతుకుతోంది 70 ఏళ్ల లచ్చుమమ్మ. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంధర్మారావు పేట గ్రామంలో ఉండే లచ్చుమమ్మ ఐదు దశాబ్దాలుగా పాత కాలం నాటి రవికల నుంచి నేటి మోడ్రన్ డ్రెస్సుల వరకు తన కుట్టుపనితనంతో మెప్పిస్తోంది. ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అని అంటుంటారు. ఏడు పదుల వయసులో కూడా లచ్చుమమ్మ ఆధునిక డిజైన్లలో బ్లౌజులు, డ్రెస్సులు కుట్టడం చూసి కాలానికి తగినట్టు పని తనాన్ని మెరుగుపరుచుకుంటుంది అని కూడా అంటుంటారు. యాబై ఏళ్లుగా అలుపెరగకుండా బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్న లచ్చుమమ్మ అసలు పేరు గజవాడి లక్ష్మి. ధర్మారావుపేట గ్రామంలో అందరూ లచ్చుమమ్మ అని పిలుస్తారు. లచ్చుమమ్మకు 14వ ఏట ధర్మరావుపేటకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిగింది. వాళ్లకు ఐదుగురు కూతుళ్లు. ఉన్న ఊళ్లో ఉన్నంతలో చదివించారు. వాళ్లను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి, అత్తవారిళ్లకు పంపించారు. వాళ్లకు పిల్లలు. లచ్చుమమ్మకు పన్నెండు మంది మనుమలు, మనుమరాళ్లు. వాళ్లు కూడా పెద్దోళ్లయ్యారు. నాటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ‘ఐదుగురు ఆడపిల్లల్ని పెంచి, పెళ్లిళ్లు చేయడం అంటే సవాలే..’ అంటూ తమ కష్టాన్ని వివరిస్తుంది. లచ్చుమమ్మ భర్త బాలవీరయ్య చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. భర్త కష్టానికి చేదోడుగా ఉంటుందని యాబై ఏళ్ల కిందటే లచ్చుమమ్మ సొంతంగా బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ ఊళ్లోకి ఇంకా టైలరింగ్ మిషన్లు రాలేదు. దాంతో బట్టలు కత్తిరించి సూదీదారంతోనే కుట్టేది. గ్రామంలో నాటి తరం మహిళలు ధరించే రవికలను బాగా కుడుతుందనే పేరు లచ్చుమమ్మకి. ఆడపిల్లలకు గౌన్లు, లంగా, జాకెట్లు కుట్టడమూ సొంతంగానే నేర్చుకుంది. అందరి ఇళ్లల్లోనూ ఆమె కుట్టిన బట్టలు ఉంటాయి. ఆధునిక డిజైన్లు సైతం లచ్చుమమ్మ చేతికుట్టు బాగుంటుందని చాలా మంది ఆమె దగ్గరే కుట్టించుకునేవారు. నిన్న మొన్నటి వాళ్లే కాదు, ఈ తరం అమ్మాయిలు కూడా లచ్చుమమ్మ దగ్గరకు వచ్చి బ్లౌజులు కుట్టించుకుంటారు. మొదట్లో సాదా రవిక కుట్టడానికి 30 పైసలు, గుండీల రవిక కుట్టడానికి 50 పైసలు తీసుకునేదట. ఇప్పుడు సాధారణ బ్లౌజ్‌కు రూ. 65, లైనింగ్ బ్లౌజ్‌కు రూ.130 తీసుకుంటుంది. ‘అప్పట్లో రోజుకు పది నుంచి ఇరవై దాకా బ్లౌజులు, గౌన్లు కుట్టేదాన్ని. పండుగల సీజన్లో అయితే రాత్రి, పగలు తేడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా రోజూ రెండు మూడు బ్లౌజులు కుడతా’ అని చెబుతోంది లచ్చుమమ్మ. పదేళ్ల క్రితం భర్త వీరయ్య చనిపోయాడు. ఇప్పుడు లచ్చుమమ్మ ఒక్కత్తే ఉంటుంది. తన పోషణార్థం కుట్టుపనినే నమ్ముకుంది. ఏళ్లుగా ఆమె దగ్గర రవికలు కుట్టించుకున్న నాటి తరం వాళ్లంతా ఇప్పటికీ లచ్చుమమ్మ దగ్గరికే వస్తుంటారు. వయసు మీద పడి, నెమ్మదిగా కుట్టినా చెప్పిన మాట ప్రకారం కుట్టి ఇస్తుందని నమ్మకం ఎక్కువ. ఏ సమయంలో ఆమె ఇంటికి వెళ్లినా.. కూర్చుని బట్టలు కత్తిరించడమో, లేదంటే మిషన్ మీద కుట్టడమో చేస్తూ కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. యాబై ఏళ్లుగా కుడుతున్నా.. పద్నాలుగేళ్ల వయసులో పెళ్లయ్యి ఈ ఇంటికి వచ్చా. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తరువాత కుటుంబ అవసరాల కోసం ఏదైనా పని చేయాలనుకున్నా. మా అమ్మ మాకు చిన్నప్పుడు చేతితోనే బట్టలు కుట్టేది. ఇంటి అవసరాలు పెరిగిన ప్పుడు నేను కూడా బట్టలు కుట్టాలని, చేతికుట్టుతో రవికలు కుట్టడం మొదలుపెట్టాను. ఒక్కొక్కరుగా రావడం మొదలై ఊళ్లో ఉన్న ఆడవాళ్లందరూ రవికలు కుట్టించుకునేవారు. ముప్పయి ఏళ్ల పాటు చేతికుట్టుతోనే కుట్టేదాన్ని. కుట్టు మిషన్లు వచ్చిన తరువాత ఓ మిషన్ తీసుకున్నా. కొన్ని రోజుల్లోనే మిషన్ కుట్టు నేర్చుకొని, సొంతంగానే కుట్టడం మొదలుపెట్టిన. పిల్లలు వద్దంటరు కానీ, చేతనైనన్ని రోజులు పనిచేసుకొని బతకాలి, ఎవరి మీదా ఆధారపడవద్దని ఈ పని వదలడం లేదు. – గజవాడ లక్ష్మి – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి -
Fashion: ర్యాప్.. డ్రేప్.. టాప్ టు బాటమ్ ఒకే రంగుతో!
ర్యాప్.. డ్రేప్.. టాప్ టు బాటమ్ ఒకే రంగుతో ఆకట్టుకోవడం ఈ డ్రెస్ ప్రత్యేకత ఇండియన్ శారీ లుక్‌ను తలపిస్తూనే వెస్ట్రన్ గౌన్లా అనిపించే స్టైలిష్ డ్రెస్. వేడుకలలో వెరైటీ మార్కులు కొట్టేస్తుంది. క్యాజువల్ వేర్‌గా కంఫర్ట్‌ని సొంతం చేస్తుంది. సింగిల్‌పీస్ అయినప్పటికీ ఇంద్రధనుస్సును మరిపించే హంగులు ఉన్న డ్రెస్‌గా నవతరం మనసులను దోచేస్తుంది ఈ ర్యాప్ డ్రేప్ డ్రెస్. ప్లెయిన్ లేదా చిన్న చిన్న ప్రింట్లు ఉన్న సిల్క్ మెటీరియల్‌ను లాంగ్ ఫ్రాక్ మోడల్ వచ్చేలా డిజైన్ చేసి, కింది అంచు భాగంలో చీర కుచ్చిళ్లను తలపించేలా డ్రేప్ చేసి, నడుము దగ్గర బెల్ట్‌తో ర్యాప్ చేయడం ఈ డ్రెస్ ప్రత్యేకత. ధోతీ టాప్ కాంబినేషన్ సెట్‌లా కూడా ఈ స్టైల్ మనల్ని ఆకట్టుకుంటుంది. చదవండి: Sonali Bendre: సోనాలీ బింద్రే ధరించిన ఈ త్రీ పీస్ డ్రెస్ ధర 78 వేల పైమాటే! స్పెషాలిటీ? -
ర్యాంప్‌పై క్యూట్‌గా క్యాట్ వాక్ (ఫొటోలు)
-
Women Party Wear Dresses: పార్టీవేర్.. సీజన్కేర్..
సీజన్‌కు తగ్గట్టు స్టైల్‌గా ఉండాలి వేడుకకు తగ్గట్టు బ్రైట్‌గా ఉండాలి అంతకుమించి కంఫర్ట్ ఉండాలి డిజైనర్ క్రాప్‌టాప్స్, పలాజో స్కర్ట్స్‌తో సింపుల్ అండ్ మార్వలెస్ అంటూ మార్కులు కొట్టేయడం ఇప్పుడిక సూపర్ ఈజీ. రాబోయేది పెళ్ళిళ్ల సీజన్. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తక్కువ మందితో సింపుల్‌గా కుటుంబసభ్యుల మధ్యన మాత్రమే వేడుకలు జరిగే అవకాశాలున్నాయి. బర్త్‌డే పార్టీ అయినా, చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయినా తక్కువ మందితో జరుపుకునే వేడుక ల్లో మీరు బ్రైట్‌గా వెలిగిపోవాలంటే సింపుల్ ఐడియా స్కర్ట్ పలాజో, డిఫరెంట్ క్రాప్‌టాప్. అందులోనూ ఇది వేసవి కూడా కావడంతో ధరించే డ్రెస్ సౌకర్యంగానూ ఉండాలి. అదే టైమ్‌లో బ్రైట్‌గా కనిపించాలి. స్టైలిష్ అనిపించాలి. ఈ హంగులన్నీ తీసుకువచ్చే ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని కాటన్ ఫ్యాబ్రిక్‌తోనే ప్లాన్ చేసుకోవచ్చు. సౌకర్యమే ఫస్ట్ ప్రింటెడ్ కాటన్‌తో డిజైన్ చేసిన డ్రెస్సులివి. క్యాజువల్ వేర్కి, పార్టీవేర్‌కి వాడుకోదగినవి. ఇకత్ కాటన్, హకోబా కాటన్, ప్రింటెడ్ కాటన్స్ని పలాజో డిజైన్‌కి తీసుకున్నాం. పలాజోలు ఇష్టం లేనివారు ఇదే ప్యాటర్న్‌తో స్కర్ట్‌లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్‌గా ఫ్లోరల్ షిఫాన్, చందేరీతో డిజైన్ చేసిన క్రాప్‌టాప్స్, పెప్లమ్ స్టైల్ క్రాప్‌టాప్ జత చేశాం. ఈ డ్రెస్సింగ్ బర్త్‌డే వంటి పార్టీలకు బాగా నప్పుతాయి. ఇది వేసవి కాబట్టి ఈ డ్రెస్సింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. అమ్మాయిలకు మాత్రమే ఈ డ్రెస్సులు బాగుంటాయి అనుకోనక్కర్లేదు. అన్ని వయసుల వారూ ఈ డ్రెస్సింగ్ స్టైల్‌ను కొన్ని మార్పులతో ప్లాన్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ స్టైల్‌కు నప్పే దుపట్టాను కూడా జత చేసుకోవచ్చు. భార్గవి అమిరినేని ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
స్త్రీల దుస్తులకూ వయసుంటుందా?
తెలుగు సినిమాల్లో హీరోయిన్ పెళ్లికి ముందు మోడ్రన్ డ్రస్సుల్లో పాటలు పాడుతుంది. పెళ్లయ్యాక తప్పని సరిగా చీరల్లోకి మారుతుంది. హీరో పెళ్లికి ముందు... తర్వాత కూడా ప్యాంట్‌లోనే ఉంటాడు. మన దేశంలో స్త్రీలు యాభై దాటాక మన సంస్కృతి సంప్రదాయాలకు తగినట్టుగా దుస్తులు ధరించాలనే ఒక అప్రకటిత నిబంధనకు నిబద్ధులుగా ఉంటారు. యాభై దాటాక వారు తమ మనసు ఎలా ఉన్నా తప్పనిసరిగా వృద్ధాప్యాన్ని ప్రదర్శించాల్సిందేనా? కేరళలో 69 ఏళ్ల నటి రజని చాంది తన సరదా మేరకు మోడ్రన్ దుస్తుల్లో దిగిన ఫొటోలు ఆమెకు ప్రశంసలతో పాటు శాపనార్థాలు కూడా తెచ్చి పెట్టాయి. ‘ఈ వయసులో ఇదేం పని’ అన్నవారే ఎక్కువ. 29 ఏళ్ల మహిళా ఫొటోగ్రాఫర్ అతిరా రాయ్ ఈ ఫొటోలు తీసింది. టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్న వృద్ధులు ఉండొచ్చు.. టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్న వృద్ధ స్త్రీలు ఉండకూడదా అని ఇప్పుడు చర్చ. ‘నేను మా అమ్మను చూశాను. 60 ఏళ్లు రావడంతోటే ఆమె జీవితం అంతా ముగిసిపోయినట్టుగా తయారైంది. 60 తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలన్నింటిని ఎదుర్కొనడానికి సిద్ధపడింది. 60 దాటాక మన దేశంలో స్త్రీలు అమ్మమ్మలుగా, నానమ్మలుగా తమ శరీరాల మీద శ్రద్ధ, అలంకరణ పట్ల ఆసక్తీ లేకుండా ఉండటం అలవాటు చేసుకున్నారు. కాని రజని చాందిని చూసినప్పుడు నాకు మా అమ్మ కంటే భిన్నంగా అనిపించారు. ఆమె తన శరీరాన్ని చక్కగా చూసుకుంటున్నారు. రూపాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఉత్సాహంగా హుషారుగా జీవితాన్ని ఏ వయసులో అయినా గడపొచ్చు అన్నట్టుగా ఉంటారు. ఇలా మిగిలిన స్త్రీలు కూడా ఉండొచ్చు కదా అనిపించింది. అందుకే ఆమెతో డిఫరెంట్‌గా ఫొటోషూట్ చేద్దామని అనుకున్నాను. చేశాను’ అంది ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అతిరా రాయ్. ఈమె సంప్రదాయ ఫొటోషూట్లకు కొంచెం ఆవల భిన్నమైన ఫొటోలు తీస్తుంటుంది అన్న పేరు తెచ్చుకుంది. అదే విధంగా ఇప్పుడు రజని చాందికి తీసిన ఫొటోలతో కూడా వార్తల్లోకి ఎక్కింది. ఎవరీ రజని చాంది? రజని చాందిది కేరళలోని కొచ్చి. ఇప్పుడు ఆమె వయసు 69 సంవత్సరాలు. జీవితంలోని చాలా భాగం ముంబైలో గడిచింది భర్త బ్యాంకు ఉద్యోగం వల్ల. అతను రిటైర్ అయ్యాక కొచ్చికి వచ్చి స్థిరపడ్డారు. అయితే ముంబైలో గడిపి వచ్చిన రజని ఆ నగర ధోరణికి తగిన దుస్తులు ధరిస్తూ అక్కడి స్త్రీలను భృకుటి ముడిపడేలా చేస్తూ వచ్చారు. ‘నేను స్లీవ్‌లెస్ వేసుకొని వెళితే ఒకలాగా చూశారు’ అని రజని చెప్పుకున్నారు. అయినా సరే రాజీ పడుకుండా తనకు నచ్చిన దుస్తులు ధరిస్తూ వచ్చారు. అంతేనా? 65 ఏళ్ల వయసులో నటిగా అవతారం ఎత్తి ‘ఒరు ముత్తాసి గాధ’ అనే మలయాళ సినిమాలో నటించారు. ఇంకా జనాన్ని ఆశ్చర్యపరుస్తూ మలయాళం బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు. ‘నా వయసు వారు లిప్‌స్టిక్ రాసుకున్నా తప్పేనా?’ అంటారు రజని. విమర్శలు రేపిన ఫొటోషూట్ ‘మీరు నా భర్త పర్మిషన్ తీసుకుంటే మీరు కోరిన ఫొటోషూట్‌లో నేను పాల్గొంటాను’ అన్నారు రజని చాంది తనతో ఫొటోషూట్ ప్రస్తావన చేసిన అతిరా రాయ్‌తో. అతిరా రజని చాంది భర్తను అడిగితే ‘ఆమె జీవితం ఆమె ఇష్టం. నచ్చితే చేయమనండి’ అన్నాడాయన. ఇక ఫొటోషూట్ మొదలైంది. లొకేషన్ రజని చాంది ఇల్లే. ఒక బొటిక్ నుంచి కొన్ని డ్రస్సులు తెచ్చి మొత్తం 30 ఫొటోలు తీసింది అతిరా. ‘మొదట్లో ఆ డ్రస్సులను చూసి షాక్ అయ్యాను. వేసుకున్నాక బాగానే ఉన్నా అనిపించింది’ అన్నారు రజని చాంది. డిసెంబర్ 2020 చివరి వారంలో ఈ ఫొటోషూట్ జరిగింది. వారం క్రితం రజని తన ఫేస్బుక్లో ఇన్‌స్టాలో ఆ ఫొటోలను పెట్టడంతో మొదట ప్రశంసలు మెల్లగా విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే ఒక డ్రస్‌లో రజనీ మోకాళ్లు కనిపిస్తున్నాయి. మరో డ్రస్సులో వక్ష అంచు కనిపిస్తూ ఉంది. ‘నువ్వెందుకు చచ్చిపోలేదు అని ట్రోల్ చేశాడొకడు. నీకీ వయసు లో కావలసింది బైబిల్. ప్రార్థన చేసుకో అన్నాడొకడు. మరొకడు నువ్వొక పాత ఆటోవి. కొత్త రంగేసినా పాత ఆటో పాతదే అన్నాడు. ఆశ్చర్యంగా మగవాళ్ల కంటే స్త్రీలే నన్ను ఎక్కువ తిట్టారు. నా కాళ్లు బాగుంటే నేనేం చేయను. వాటిని చూపిస్తే మీకేంటి నొప్పి అనాలనిపిస్తోంది. నా మీద మీ శక్తిని ఖర్చుపెట్టడం కంటే దేశం కోసం ఏదైనా పనికొచ్చే పని చేయండి అని బదులు ఇచ్చాను’ అన్నారు రజని చాంది. ‘మన దేశంలో స్త్రీలు అమ్మమ్మలుగా నానమ్మలుగా ఒక వయసు తర్వాత ఇళ్లల్లో గౌరవం పొందుతూ ఉంటారు. వారి బట్టలు కూడా ఎలా ఉండాలో మనం నిర్ణయించేశాం. వితంతువులైతే తెల్లబట్టల్లో ఉండాలి. ఆకర్షణ రహితంగా ఉండాలి వీరు. కాని రజని చాంది చేసిన ఈ ఫొటోషూట్ స్టీరియోటైప్‌ను బద్దలు కొట్టేలా ఉంది. అందుకే అందరూ ఇబ్బంది పడుతున్నారు’ అని నమిత భండారే అనే ఒక వెబ్సైట్ ఎడిటర్ వ్యాఖ్యానించారు. అయితే ప్రశంసలు కూడా ఉన్నాయి. వయసు అనేది కేవలం శారీరకమే తప్ప మానసికం కాదని నిరూపించారని చాలామంది రజనిని మెచ్చుకున్నారు. కాని ఆలోచించ వలసింది ఏమిటంటే 70 ఏళ్ల తాతయ్యలు మనవళ్ల టీషర్ట్స్ వేసుకుని మురిసిపోతూ తిరుగుతూ ఉంటారు. వారిని ఎవరూ ఏమీ అనరు. కాని మనవరాలిలా బట్టలు తొడుక్కున్న అమ్మమ్మను మాత్రం విమర్శిస్తారు. స్త్రీల దుస్తులు వారు వ్యక్తం చేసే కోరికకు సంకేతంగా, వారి మేకప్ లైంగిక ప్రేరకంగా, వారి ప్రతి చర్య అభ్యంతరకరంగా భావించబడేంత వరకూ స్త్రీలు ఈ విమర్శలు ఎదుర్కొనక తప్పదు. రజని చాందిలాంటి వారు చేసే ప్రయత్నాలు ఈ లైంగికతకు ఆవల ఉండే సౌందర్య వ్యక్తీకరణలుగా భావించేలా చేస్తాయి. సంఘ నియమాలు ఉంటాయి నిజమే. కాని వ్యక్తుల ప్రతిఘటన జరిగినప్పుడు ఆ నియమాలు కుదుపులకు లోనవుతాయని రజని చాంది ఘటన నిరూపిస్తోంది. రజని చాందితో అతిరా రాయ్ – సాక్షి ఫ్యామిలీ -
‘ఇరుకు’ మాటలు
‘హవ్వా! పాశ్చాత్య దుస్తులు ధరించి పవిత్రమైన పార్లమెంట్ ముందు ఫొటోలు దిగుతారా? ఇదేమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? ఎప్పుడు ఎలాంటి వస్త్రధారణ ఉండాలో మీకు తెలియదా? ఇదేమి షూటింగ్ స్పాట్ కాదు, హాలిడే డెస్టినేషన్ కాదు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. టిక్‌టాక్‌ల స్థలం కాదు. పేజ్‌త్రీ పార్టీకి వెళ్లినట్టుగా ఆ డ్రెస్ ఏంటి? ఫొటోలు తీసుకోవడం మానేసి పని మీద దృష్టిపెట్టండి’ ఇలా అనేక రకాల కామెంట్లు చేశారు. ఆధునిక దుస్తులు ధరించి పార్లమెంట్ ముందు ఫొటోలు తీసుకున్నందుకు మిమి చక్రవర్తి, నుస్రత్ జహ్రాన్‌కు సోషల్ మీడియాలో ఎదురైన స్పందన ఇది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాలీ యువ నటీమణులు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ రూహి భారీ విజయాలు అందుకున్నారు. జాదవపూర్ నుంచి మిమి చక్రవర్తి 2,95,239 ఆధిక్యంతో విజయం సాధించగా, బాసిర్హాత్లో నుస్రత్ జహాన్ 3,50,369 మెజార్టీతో విజయదుందుభి మోగించారు. గెలిచిన ఆనందంలో ఉత్సాహంతో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టి పరవశించారు. తమ అదృష్టానికి మురిసిపోతూ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇక అక్కడి నుంచి మొదలైంది ఇరుకు మనస్కుల దాడి. ట్విటర్లో ట్రోలింగ్ మొదలెట్టేశారు. ఇంతకీ వారు ధరించిన డ్రెస్ ఏంటి? మిమి చక్రవర్తి తెల్లని చొక్కా, డెనిమ్ జీన్స్ ప్యాంట్ వేసుకోగా.. జహ్రాన్ వైన్ కలర్ పెప్పలప్ జిప్డ్ టాప్, ప్యాంట్ ధరించారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, బాలీవుడ్ నటుడు సన్నిడియోల్ కూడా జీన్స్, టీషర్టులు ధరించి తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టినా ఛాందసులకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. లోక్‌సభకు ఎన్నికైన యువతులు హుందాగా ఉన్న ఆధునిక వస్త్రాలు ధరించి పార్లమెంట్‌కు రావడం మాత్రం నేరంగా తోస్తుంది.ప్రజాప్రతినిధులు హుందాగా ఉండే దుస్తులు ధరించాలనే వాదనలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ ఫలానా దుస్తులు వేసుకుంటేనే హుందాతనం వస్తుందని వాదించడంలో అర్థం లేదు. ఆధునిక తరానికి ప్రతినిధులుగా చట్టసభలో అడుగుపెట్టబోతున్న యువతుల వస్త్రధారణపై వివాదం చేయడం శోచనీయం. మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ వివాదంతో మరోసారి మహిళ వస్త్రధారణ చర్చనీయాంశంగా మారింది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వీరికి మద్దతుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎటువంటి దుస్తులు ధరించారనే దాని ఆధారంగా వీరి సామర్థ్యాలను అంచనా వేయడం సరికాదని పేర్కొన్నారు. పార్లమెంట్ చర్చల్లో వీరు ఎంత సమర్థవంతంగా పాల్గొంటారనే దానిపై దృష్టి పెట్టాలిగానీ వస్త్రధారణపై కాదని పేర్కొన్నారు. – పోడూరి నాగ శ్రీనివాసరావు, సాక్షి వెబ్ డెస్క్ ఈ వివాదాలు మాకు కొత్తేమి కాదు. గతంలోనూ ఇలాంటివి ఎదుర్కొన్నాం. ఎంపీలు అభ్యర్థులుగా ఎంపికైన నాటి నుంచే మా మీద బురద చల్లడం మొదలుపెట్టారు. మేమేంటో మా పని తీరు ద్వారానే నిరూపించుకున్నాం. ఇప్పుడు మరింత కష్టపడి పనిచేసి విమర్శలకు సమాధానం చెబుతాను. అసంబద్ధ వ్యాఖ్యలను పట్టించుకోకుండా నా నియోజకవర్గ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తాను. – నుస్రత్ జహాన్ ఏ రకంగా చూసినా నేను, నుస్రత్ జహాన్ ధరించిన దస్తులు అమర్యాదకరంగా లేవు. మగాళ్లు జీన్స్, టీషర్ట్ ధరించి పార్లమెంట్‌కు వచ్చినా ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయరు. మా విషయంలోనే ఎందుకు భిన్నంగా స్పందిస్తున్నారు? వస్త్రధారణ విషయంలో మమ్మల్ని ఎంతగా విమర్శించినా, దూషించినా పట్టించుకోము. పార్లమెంట్ మర్యాదను మంటగలిపామని మేము అనుకోవడం లేదు. సహజత్వం నాకు ఇష్టం. నాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు. – మిమి చక్రవర్తి -
నా బట్టలు.. నా ఇష్టం
సోషల్ మీడియా వచ్చేసరికి మా ఒపీనియన్‌ని వెలిబుచ్చుతున్నాం అంటూ సెలబ్రిటీలను కామెంట్ చేసేవారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువైపోతోంది. తైముర్ పుట్టాక కూడా కరీనా కపూర్ ఖాన్ ఇంకా తల్లిలా డ్రెస్ చేసుకోవడం లేదంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ కామెంట్స్‌ను కరీనా తిప్పికొడుతూ – ‘‘ఎవరైనా తమకి ఏది నప్పుతుందో, ఏది సౌకర్యంగా అనిపిస్తుందో అలాంటి బట్టలు ధరించాలి. మదర్‌లా డ్రెస్ చేసుకోవడం అంటే ఏంటో నాకు తెలియదు. మా అమ్మగారు (బబితా కపూర్) ఇంకా మోడ్రన్ దుస్తులనే ధరిస్తారు. మా అత్తగారు (నటి షర్మిలా ఠాగూర్) కూడా. మాకు ఏం నచ్చిందో అవి వేసుకునే స్వాతంత్య్రం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చా. కేవలం నేనో పిల్లాడికి తల్లిని కాబట్టి షార్ట్ డ్రెస్‌లు వేసుకోకూడదు అనుకోవటం మూర్ఖత్వం. నా బట్టలు. నా ఇష్టం. కాన్ఫిడెన్స్ ఉండి, వేసుకున్న డ్రెస్‌ని చక్కగా క్యారీ చేయగలగమనే నమ్మకం ఉంటే మనకు ఇష్టమొచ్చిన డ్రెస్సును మనం వేసుకోవచ్చు’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. -
అందానికి భుజమివ్వండి
మీ పట్టు చీర, ప్లెయిన్ చీర మీదకు ఎన్ని రకాల బ్లౌజ్ డిజైన్స్ వున్నాయి? ఎందుకంటే ఆ బ్లౌజ్లన్నింటిలోనూ ఇప్పుడు కామ్‌గా వచ్చి ముందు వరసలో నిలిచిపోయింది కోల్డ్ షోల్డర్ స్లీవ్స్ బ్లౌజ్. ఆధునిక దుస్తుల మీద అందంగా మెరిసిన ఈ స్లీవ్స్ ఇప్పుడు సంప్రదాయ శారీ బ్లౌజ్‌ల మీద ఒద్దికగా చేరాయి. చాలా సాధారణంగా ఉండే డ్రెస్కే కోల్డ్ షోల్డర్ స్లీవ్స్‌తో అద్భుతమై లుక్ వస్తే.. ఇక సంప్రదాయ పెళ్లి పట్టు చీరలకైతే చూపుతిప్పుకోనివ్వని కళ తీసుకువస్తున్నాయి. పెళ్లికూతురు అందానికి కొత్త సింగారాలు అద్దుతున్నాయి. కోల్డ్ షోల్డర్ స్లీవ్స్.. బ్లౌజ్‌కి ఒక చిరుగులా అనిపిస్తాయి. ఈ స్లీవ్స్‌కి ఎంబ్రాయిడరీ చేయడం, ఆభరణాలతో అలంకరించడం కూడా మంచి అందాన్ని తీసుకువస్తున్నాయి. -
సెల్ఫీ... సో స్పెషల్!
శ్రద్ధగా మేకప్ చేసుకున్నప్పుడు సెల్‌ఫోన్‌తో ఓ సెల్ఫీ తీసుకుని, తీపి గుర్తుగా దాచుకోవాలనుకుంటాం. విహార యాత్రకు వెళ్లినప్పుడు అందమైన లొకేషన్స్‌లో సెల్ఫీ తీసుకుంటాం. చానాళ్ల తర్వాత స్నేహితులను కలిసినప్పుడు వాళ్లతో సెల్ఫీ దిగుతాం. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ సెల్ఫీకి అనర్హం. సినిమా తారలు ట్విట్టర్స్, ఫేస్‌బుక్స్‌లో ఇలాంటి సెల్ఫీలు చాలా కనిపిస్తాయి. అలా గత వారంలో హల్చల్ చేసిన సెల్ఫీల్లో రామ్‌చరణ్, వరుణ్‌తేజ్ కలిసి దిగిన సెల్ఫీ ఓ హైలైట్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి నేడు బెంగళూరులో జరగనున్న విషయం తెలిసిందే. వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణంలో చరణ్, వరుణ్ సెల్ఫీ దిగారు. ఆదివారం చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా తాము దిగిన సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి, ‘హ్యాపీ బర్త్‌డే అన్నా.. లవ్ యు’ అని పేర్కొన్నారు వరుణ్ తేజ్. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులో మెరిసే శ్రుతీహాసన్ ‘సింగమ్ 3’ చిత్రం కోసం పట్టుచీర కట్టుకున్నారు. అందుకని మురిపెంగా సెల్ఫీ దిగి, ఫేస్బుక్లో పెట్టారు. తల్లితో కలిసి రకుల్ ప్రీత్‌సింగ్ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు. అక్కడ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో తల్లితో కలిసి సెల్ఫీ దిగారు. హిందీ చిత్రం ‘పింక్’ షూటింగ్ స్పాట్లో షాట్ గ్యాప్‌లో కో-స్టార్స్‌తో కలిసి తాప్సీ ఓ సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీలు సో... స్పెషల్‌గా ఉన్నాయి కదూ! -
జిప్ అప్ హుర్రె
భారతీయ వనితకు అందం సంప్రదాయ చీరతోనే వస్తుంది. ఎన్ని మోడర్న్ డ్రెస్‌లు వేసినా కూడా.. అచ్చమైన ఆడపిల్లలా కనిపించాలంటే చీరతో సింగారించుకోవాల్సిందే. చీరకట్టులో అందం చూసి దానికి ఫ్యాన్స్ అయిపోయిన విదేశీ వనితలూ ఉన్నారు. చేయి తిరిగిన పడుచులకు కూడా శారీ కట్టుకోవడానికి 15 నిమిషాలు కావాల్సిందే. అదే అలవాటు లేని ఆడవాళ్లకు చీర కట్టుకోవడం కత్తిమీద సామే. అందంగా కట్టుకున్నా.. కుచ్చుళ్లు ఎక్కడ జారిపోతాయో అని టెన్షన్ కొందరిది. వీరి టెన్షన్‌కు చెక్ పెడుతూ ఇన్‌స్టా శారీస్ తీసుకొచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ రెడీమేడ్ శారీని లాంగ్ ఫ్రాక్ వేసుకున్నట్టు వేసుకుని జిప్ లాగితే సరి.. శారీలో సెట్ అయిపోతారు. నయా ట్రెండ్స్‌తో ఫ్యాషన్ మార్కెట్లో హల్చల్ చేస్తున్న డిజైనర్లు.. రోజుకో వెరైటీ కాస్ట్యూమ్స్‌తో అదరగొడుతున్నారు. శారీస్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వాటికి తమ క్రియేటివిటీ జోడించి మరిన్ని మెరుగులు అద్దుతున్నారు. ఇన్నాళ్లూ డిఫరెంట్ శారీస్‌తో మార్కులు కొట్టేసిన వీళ్లు.. చీరకట్టును ఈజీ చేస్తూ ఇన్‌స్టా శారీలను తీసుకొచ్చారు. జస్ట్ జిప్‌తో ఈజీగా ధరించే విధంగా డిజైన్ చేశారు. ట్రెడిషన్‌ను మిస్ చేయకుండా బ్లౌజ్ అటాచ్‌మెంట్‌తో ఈ చీరలు వస్తున్నాయి. బ్లెండెడ్ సిల్క్, ఫ్రెంచ్ లేస్, ఫాలోయింగ్ నెట్ వంటి మెటీరియల్స్‌తో ఈ కస్టమైజ్డ్ శారీస్ ప్రిపేర్ చేస్తున్నారు. అమ్మాయిలకు వరం.. ఈ ఫాస్ట్ గోయింగ్ వరల్డ్‌లో శారీ డ్రేపింగ్‌తో ఇబ్బంది పడే అమ్మాయిలకు ఇది ఒక వరం. ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు చీరలు కట్టుకునే టైం కూడా ఉండదు. వారికి కూడా ఈ రకం చీరలు ఎంతో హెల్ప్ చేస్తాయి. పార్టీల్లో స్పెషల్‌గా, యూనిక్‌గా కనిపించాలని భావించే వాళ్లు ‘ఇన్‌స్టా శారీస్’ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కలెక్షన్లలో రస్టిక్ రెడ్, ఎమరాల్డ్ గోల్డ్, బోల్డ్ గోల్డ్, బ్రిలియంట్ పింక్ వంటి రంగుల్లో కనిపిస్తున్నాయి. వీటి ధర రూ.9,000 నుంచి రూ.20 వేల వరకు ఉంది. - నీతా, సఖి ఫ్యాషన్స్ డిజైనర్ శిరీష చల్లపల్లి -
ఆ ఒక్కటే కాదు..!
సంప్రదాయ దుస్తుల్లో బిగ్స్క్రీన్పై మురిపించే మలయాళ తార జ్యోతికృష్ణా... తనపై ఉన్న ఆ ముద్రను చెరిపేసుకోవాలనుకొంటున్నట్టుంది. ఆ విషయాన్ని స్ట్రయిట్‌గా చెప్పట్లేదు గానీ.. ‘మోడర్న్ అవుట్‌ఫిట్స్ నాకు సూటవ్వవని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పటివరకు వచ్చిన క్యారెక్టర్లు నాపై అలా ట్రెడిషనల్ గాళ్ ముద్ర వేశాయి. కానీ వాటికే పరిమితమవ్వాలనుకోవడం లేదు. నాకూ మోడర్న్ డ్రెస్సులు సరిపోతాయని చెప్పడానికి ఓ ఫొటో సూట్ కూడా చేశా’ అంటూ తనకు తానే బ్రాండింగ్ చేసుకొంటోందీ సుందరి. -
చీరకట్టే స్త్రీ శిల్పంలా ఉండాలి
‘‘అందమైన అమ్మాయి చీర కడితే... పండువెన్నెల్లా ఉంటుంది. ఉదాహరణకు నా లాంటి అమ్మాయి అన్నమాట’’ అని ధీమాగా చెబుతున్నారు తమన్నా. ఈ మిల్కీబ్యూటీకి చీరంటే వల్లమాలిన అభిమానమట. ఇటీవల చీర గురించి తమన్నా మాట్లాడుతూ -‘‘గ్లామర్ ప్రపంచంలో ట్రెండీగా ఉండటం తప్పని సరి. అందుకనే ఎక్కువగా మోడ్రన్ డ్రస్సుల్లోనే ఉంటాం. కానీ పండుగలు, పబ్బాలు వచ్చాయంటే మాత్రం ఆలోచించకుండా... చీరలోకి దూరిపోతాను. చీరలంటే నాకు ఎంత ఇష్టమంటే... మార్కెట్లో కొత్తరకం చీరలేమైనా కనిపించాయంటే... ముందు వాటిని కొనేయాల్సిందే. ప్రైవేటు ఫంక్షన్లకు ఎక్కువశాతం చీరలోనే ఎటెండ్ అవుతుంటాను. అయితే... స్త్రీకి చీరే అందం అనే వ్యాఖ్యానంతో మాత్రం నేను ఏకీభవించను. ఎందుకంటే... కొంతమంది చీరకడితే... ఆ చీరకున్న అందం చెడుతుంది. అందుకే చీరను కట్టే స్త్రీ కూడా శిల్పంలా ఉండాలి. నిజానికి చీరలో నేను చాలా బాగుంటాను. మోడ్రన్ ట్రెండ్‌కి అలవాటు పడ్డా... చీర ఇచ్చేంత గ్లామర్ నాకు ఏ దుస్తులూ ఇవ్వవు’’ అని చెప్పారు తమన్నా.