Fashion: ర్యాప్‌.. డ్రేప్‌.. టాప్‌ టు బాటమ్‌ ఒకే రంగుతో! | Fashion Trends: Wrap Drape Dress Gives You Stylish Look | Sakshi
Sakshi News home page

Wrap Drape Dress: ర్యాప్‌.. డ్రేప్‌.. టాప్‌ టు బాటమ్‌ ఒకే రంగుతో!

Published Sat, Oct 8 2022 3:57 PM | Last Updated on Sat, Oct 8 2022 5:03 PM

Fashion Trends: Wrap Drape Dress Gives You Stylish Look - Sakshi

ర్యాప్‌.. డ్రేప్‌.. టాప్‌ టు బాటమ్‌ ఒకే రంగుతో ఆకట్టుకోవడం ఈ డ్రెస్‌ ప్రత్యేకత ఇండియన్‌ శారీ లుక్‌ను తలపిస్తూనే వెస్ట్రన్‌ గౌన్‌లా అనిపించే స్టైలిష్‌ డ్రెస్‌. వేడుకలలో వెరైటీ మార్కులు కొట్టేస్తుంది. క్యాజువల్‌ వేర్‌గా కంఫర్ట్‌ని సొంతం చేస్తుంది.

సింగిల్‌పీస్‌ అయినప్పటికీ ఇంద్రధనుస్సును మరిపించే హంగులు ఉన్న డ్రెస్‌గా నవతరం మనసులను దోచేస్తుంది ఈ ర్యాప్‌ డ్రేప్‌ డ్రెస్‌. 

ప్లెయిన్‌ లేదా చిన్న చిన్న ప్రింట్లు ఉన్న సిల్క్‌ మెటీరియల్‌ను లాంగ్‌ ఫ్రాక్‌ మోడల్‌ వచ్చేలా డిజైన్‌ చేసి, కింది అంచు భాగంలో చీర కుచ్చిళ్లను తలపించేలా డ్రేప్‌ చేసి, నడుము దగ్గర బెల్ట్‌తో ర్యాప్‌ చేయడం ఈ డ్రెస్‌ ప్రత్యేకత. 

ధోతీ టాప్‌ కాంబినేషన్‌ సెట్‌లా కూడా ఈ స్టైల్‌ మనల్ని ఆకట్టుకుంటుంది.  

చదవండి: Sonali Bendre: సోనాలీ బింద్రే ధరించిన ఈ త్రీ పీస్‌ డ్రెస్‌ ధర 78 వేల పైమాటే! స్పెషాలిటీ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement