
సింగపూర్, యూరప్ దేశాల తరహాలో హంగులు
వినియోగదారుల కోసం ఫుడ్‌స్టాళ్లు, వాష్‌రూమ్‌లు
త్వరలో టెండర్ల ప్రక్రియ- బీఎంసీ
దాదర్: దక్షిణ ముంబైలోని ప్రముఖ ఫ్యాషన్ స్ట్రీట్‌కు కొత్త లుక్ ఇవ్వాలని బహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన నూతన ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉంచింది. సలహాదారుల కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం ఈ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దే పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని బీఎంసీ అదనపు కమిషనర్ (సిటీ) అశ్వినీ జోసీ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా..
నగరంలో ప్రధాన రైల్వే స్టేషన్‌లైన చర్చిగేట్–చత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్‌ఎంటీ) మధ్య ఈ ఫ్యాషన్ స్ట్రీట్ ఉంది. దీనికి కూత వేటు దూరంలో ఆజాద్ మైదానం ఉంది. ఇక్కడ నేటి యువతను ఆకర్శించే అనేక కొత్త డిజైన్‌లతో కూడిన దుస్తులు, డ్రెస్ మెటీరియల్స్ లభిస్తాయి. దీంతో ఈ మార్కెట్ నగరంతోపాటు పశి్చమ, తూర్పు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో ఎంతో గుర్తింపు పొందింది. ఇక్కడ రకరకాల దుస్తులతోపాటు, చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగులు, లగేజీ బ్యాగులు, బెల్టులు, బూట్లు తదితర ఫ్యాషనబుల్ వస్తువులు చౌక ధరకే లభించడంతో నిత్యం వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. అంతేగాకుండా దేశ నలుమూలలు, వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచి్చన పర్యాటకులు ఫ్యాషన్ స్ట్రీట్‌ను తప్పకుండా సందర్శిస్తారు. వివిధ పనుల నిమిత్తం ముంబైకి వచి్చన వారు కూడా ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన దుస్తులు, సామాగ్రి కొనుగోలు చేస్తారు. అన్ని రకాల, ఆధునిక ఫ్యాషన్ దుస్తులు లభించడంతో ఇక్కడికి పేదలతోపాటు, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరు. ముఖ్యంగా నేటి యువత ఆధునిక ఏసీ షాపింగ్ మాల్స్‌ల కంటే ఫుట్‌పాత్‌పై వెలసిన ఈ ఫ్యాషన్ స్ట్రీట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
లైసెన్సులు లేకుండానే వ్యాపారం..
ప్రస్తుతం ఇక్కడ 6/8 లేదా 8/8 చదరపుటడుగులతో కూడిన చిన్న చిన్న టేలాలు, షాపులు ఇలా 250–300 వరకు ఉన్నాయి. ఇందులో లైసెన్స్‌గల షాపులు 112 ఉన్నాయి. మిగతా దుకాణాలన్నీ టెంపరరీ కావడంతో షట్టర్లు, డోర్లు, విద్యుత్ దీపాలు లేవు. చార్జింగ్ లైట్లతోనే వ్యాపారాలు కొనసాగిస్తారు. ఇక్కడ నిత్యం లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. రాత్రుల్లు దొంగల నుంచి తమ వస్తువులను కాపాడుకునేందుకు అందులో పనిచేసే వారు లేదా యజమానులు అక్కడే నిద్రపోతుంటారు. ఇలాంటి చరిత్రగల ఫ్యాషన్ స్ట్రీట్ త్వరలో సింగపూర్, యూరోప్ దేశాల తరహాలో కొత్త హంగులు, విద్యుత్ దీపాలతో దర్శనమివ్వనుంది. షాపింగ్‌లకు వచ్చే కస్టమర్లకు ఇక్కడ తాగునీరు, మరుగుడొడ్లు లేవు. దీంతో షాపింగ్‌కు వచి్చన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే ఆధునీకీకరించే ఈ ప్రాజెక్టులో కస్టమర్లకు అవసరమైన కనీస వసతులు, అల్పాహార స్టాళ్లు, సేదతీరేందుకు బెంచీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అధునిక సీసీ కెమెరాలతో భద్రతకు సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment