
మీ పట్టు చీర, ప్లెయిన్ చీర మీదకు ఎన్ని రకాల బ్లౌజ్ డిజైన్స్ వున్నాయి? ఎందుకంటే ఆ బ్లౌజ్‌లన్నింటిలోనూ ఇప్పుడు కామ్‌గా వచ్చి ముందు వరసలో నిలిచిపోయింది కోల్డ్ షోల్డర్ స్లీవ్స్ బ్లౌజ్. ఆధునిక దుస్తుల మీద అందంగా మెరిసిన ఈ స్లీవ్స్ ఇప్పుడు సంప్రదాయ శారీ బ్లౌజ్‌ల మీద ఒద్దికగా చేరాయి.
చాలా సాధారణంగా ఉండే డ్రెస్‌కే కోల్డ్ షోల్డర్ స్లీవ్స్‌తో అద్భుతమై లుక్ వస్తే.. ఇక సంప్రదాయ పెళ్లి పట్టు చీరలకైతే చూపుతిప్పుకోనివ్వని కళ తీసుకువస్తున్నాయి. పెళ్లికూతురు అందానికి కొత్త సింగారాలు అద్దుతున్నాయి. కోల్డ్ షోల్డర్ స్లీవ్స్.. బ్లౌజ్‌కి ఒక చిరుగులా అనిపిస్తాయి. ఈ స్లీవ్స్‌కి ఎంబ్రాయిడరీ చేయడం, ఆభరణాలతో అలంకరించడం కూడా మంచి అందాన్ని తీసుకువస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment