చీర కట్టుకున్నదని నటిని తిట్టేశారు! | Soha Ali Khan trolled for wearing pink sari | Sakshi
Sakshi News home page

చీర కట్టుకున్నదని నటిని తిట్టేశారు!

Published Thu, Jun 29 2017 9:24 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

Soha Ali Khan trolled for wearing pink sari

బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌, ఆమె భర్త కునాల్‌ ఖేము త్వరలోనే తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గర్భవతి అయిన ఆమెకు తమ ఇంట్లో సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోహా అలీఖాన్‌ ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నారు. ఇళ్లంతా అలకరించిన బెలూన్‌ల నడుమ.. గులాబీ రంగు చీర కట్టుకొని, భర్తతో దిగిన ఫొటోను ఆమె పోస్టు చేసింది. ఆమె ఇలా ఫొటోలు పెట్టిన కాసేపటికే.. కొందరు విద్వేషకులు ఆమెపై మండిపడ్డారు. సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకున్నందుకు ఆమె తీరుపై విమర్శలు గుప్పించారు.

ఆమె ఇక ఎంతమాత్రం ముస్లిం కాదంటూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఆమె తన శ్రీమంతం ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోగా.. రంజాన్‌ ఈద్‌ సందర్భంగా ఈ ఫొటోలు పెట్టారంటూ కొందరు నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. కొందరు నెటిజన్లు ఆమె హిందూమతంలోకి మారిందంటూ విమర్శించారు. కాగా, పలువురు నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు.  ఈ ఫొటోలకు మతానికి ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి వైఖరితోనే ఇస్లాం మతంపై తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. చీర కట్టుకోవడం భారతీయ సంప్రదాయం అని, దీనిని మతకోణంలో చూడొద్దంటూ హితవు పలుకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement