
ప్రముఖ న్యాయవాది దివంగత రామ్ జెఠ్మలానీ ఆత్మకథను తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ వెల్లడించారు. గత మూడేళ్లుగా వార్తల్లో ఉన్న ఈ బయోపిక్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు. సంపూర్థ కుటుంబానికి అవసరమైన పోషకాహార ఉత్పత్తులపై కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్‌లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
గత కొన్నేళ్లు అనుకుంటున్న రామ్ జెఠ్మలానీ బయోపిక్ స్క్రిప్ట్ పూర్త కావచ్చిందని, త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుందని నాయక పాత్రను తన భర్త నటుడు కునాల్ పోషించనున్నట్లు తెలిపారు. దాదాపు 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉండి, అనేక మంది అతిరథ మహారథుల వంటి రాజకీయ నేతలు, క్రిమినల్స్‌కు వకల్తాగా, వ్యతిరేకంగా పని చేసిన జెఠ్మలానీ కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment