Kunal Kemmu
-
రామ్ జఠ్మలానీ బయోపిక్ తీస్తున్నాం: హీరోయిన్
ప్రముఖ న్యాయవాది దివంగత రామ్ జెఠ్మలానీ ఆత్మకథను తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ వెల్లడించారు. గత మూడేళ్లుగా వార్తల్లో ఉన్న ఈ బయోపిక్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు. సంపూర్థ కుటుంబానికి అవసరమైన పోషకాహార ఉత్పత్తులపై కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత కొన్నేళ్లు అనుకుంటున్న రామ్ జెఠ్మలానీ బయోపిక్ స్క్రిప్ట్ పూర్త కావచ్చిందని, త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుందని నాయక పాత్రను తన భర్త నటుడు కునాల్ పోషించనున్నట్లు తెలిపారు. దాదాపు 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉండి, అనేక మంది అతిరథ మహారథుల వంటి రాజకీయ నేతలు, క్రిమినల్స్‌కు వకల్తాగా, వ్యతిరేకంగా పని చేసిన జెఠ్మలానీ కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. -
బుక్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన సైఫ్ అలీఖాన్ దంపతులు
-
మలంగ్ ట్రైలర్ లాంచ్
-
మలంగ్ ట్రైలర్ వచ్చేసింది
ముంబై: ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించిన తాజా బాలీవుడ్ సినిమా మలంగ్. అనిల్ కపూర్, కునాల్ ఖేము ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ.. హంతకుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. చంపడాన్ని అలవాటుగా చేసుకున్న కిల్లర్‌గా ఆదిత్య.. అతన్ని వెంటాడే పోలీసాఫీసర్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు. ప్రేమికులుగా నటించిన ఆదిత్య, దిశ మధ్య మోతాదుకు మించి లవ్, రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. బికినీ సీన్‌తో ట్రైలర్లో ఎంట్రీ ఇచ్చిన దిశ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. ట్రైలర్ క్లైమాక్స్‌లో తమంతా చంపడాన్ని ఎంజాయ్ చేస్తామన్న రీతిలో సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలు డైలాగ్ చెప్పడం కొసమెరుపు. ఆదిత్య భూజాల మీద కూర్చుని.. అతడితో దిశ లిప్ లాక్ చేస్తున్న ఈ సినిమా స్టిల్‌ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటెన్స్ లవ్, ఎమోషనల్, క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. -
తప్పు ఒప్పుకున్న నటుడు.. ప్రశంసలు!
సాక్షి, ముంబై: సెలబ్రిటీలు చిన్న తప్పుచేసినా ఒప్పుకునేందుకు వారికి ధైర్యం చాలదు. ఎందుకంటే వారి పేరు, పరువు, పత్రిష్టలు అంటూ ఆలోచిస్తారు. కానీ బాలీవుడ్ నటుడు కునాల్ కేము తాను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన అంగీకరిస్తూ అందరికీ తెలిసేలా చేశాడు. తనకు బైక్స్ అంటే ఇష్టమని, కానీ కొన్ని సందర్భాల్లో హెల్మెట్ లేకుండా వెళ్తుంటానని, అలాంటి సందర్భంలో తీసిందే ఈ ఫొటో అంటూ కునాల్ ఓ ట్వీట్ చేశాడు. దగ్గర్లో ఉన్న ఇంటికి వెళ్లినా, లేక వేరే ప్రాంతానికి వెళ్తున్నామా అన్న దాంతో సంబంధం లేకుంగా కచ్చితంగా హెల్మెట్ ధరించాలంటూ పోస్ట్ చేయగా ముంబై పోలీసులు స్పందించారు. 'నీకు బైక్స్ అంటే ఇష్టం. మాకు ప్రజల భద్రతంటే ఇష్టము. మీ తప్పు ఒప్పుకోవడం ప్రమాదాలను నివారించదు కదా. మీకు రూ.500 ఈ- చలానా జారీ చేశాం. ఇంటికి త్వరలోనే వస్తుందంటూ' ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ఈ చలానా నెంబర్ వివరాలు వెల్లడించారు. అనిల్ కశ్యప్ అనే నెటిజన్ కునాల్ హెల్మెట్ లేకుండా వెళ్తున్న ఫొటోలను పోస్ట్ చేసి ఇతడికి చలానా కోరుకుంటున్నాడని ట్వీట్ చేయడంతో వార్తల్లో కెక్కాడు నటుడు. తప్పు ఒప్పుకుని, తాను మరోసారి తప్పుచేయనని ట్వీట్ చేసినందుకు నెటిజన్లు నటుడిని ప్రశంసించారు. అసలు ఎప్పుడో జరిగిన ఘటనకు ఇప్పుడు ఫైన్ వేస్తారా అని కొందరు ప్రశ్నించగా.. బైక్‌పై నెంబర్ ఎలా ఉందో పోలీసులు పట్టించుకుంటారా లేదా అని మరికొందరు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. I have seen this picture out there and honestly it’s very embarrassing given I love bikes and ride regularly and always with a helmet and some more gear but whether it’s a long ride or just next door a helmet should always be worn.apologies I don’t want to set the wrong example! pic.twitter.com/s8mDnmbTsv — kunal kemmu (@kunalkemmu) March 21, 2018 .@anilmanu1991 brought to our notice by your tweet, an e-challan Number MTPCHC1800225825 has been issued to the concerned pic.twitter.com/r1ui4krsQ9 — Mumbai Police (@MumbaiPolice) March 21, 2018 -
కూతురి తొలి ఫొటోతో చిల్డ్రన్స్ డే విషెస్ చెప్పిన హీరో!
ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. ఆ అమాయకమైన బాల్యాన్ని తలుచుకుంటే, ఆ అమాయకమైన చిన్నారుల్ని చూస్తే... వేల కట్టలేని సంతోషం మన సొంతమవుతోంది. ఈ రోజు బాలల దినోత్సతం. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు కునాల్ ఖేము తన గారాలపట్టిని సోషల్ మీడియాకు పరిచయం చేశాడు. ఇటీవల జన్మించిన తన కూతురి తొలి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ బాలల దినోత్సవం కునాల్ ఖేము, సోహా అలిఖాన్ దంపతులకు ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ దంపతులు గత సెప్టెంబర్ 29న తొలి బిడ్డకు జన్మనిచ్చారు. దైవికమైన చూపులతో చూడగానే ఎంతో ముద్దొచ్చేలా ఉన్న తన కూతురు ఇనాయా నౌమి ఫొటోను కునాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘ప్రపంచంలోని చిన్నారులందరికీ, నా మంచ్కిన్కి బాలల దినోత్సవం శుభాకాంక్షలు. మేం మంచి మనుష్యులుగా ఎదిగేలా మీ అమాయకత్వం మాలో స్ఫూర్తి నింపుతూనే ఉండని..’ అంటూ కామెంట్ పెట్టాడు. కులాన్, సోహా అలీఖాన్ 2015లో పెళ్లి చేసుకున్నారు. కునాల్ ఇటీవల నటించిన ’గోల్మాల్ అగైన్’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. Wishing all the children everywhere and my little munchkin a very happy children’s day. May your innocence continue to inspire us to be better people #happychildrensday A post shared by Kunal Kemmu (@khemster2) on Nov 14, 2017 at 12:52am PST -
అమ్మగా ప్రమోట్ అయిన బాలీవుడ్ నటి
సాక్షి, ముంబై : బాలీవుడ్ జంట కునాల్ ఖేము, సోహా అలీఖాన్‌ల నివాసంలో విజయదశమి పండుగ ముందే వచ్చేసింది. సోహా శుక్రవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కునాల్ ఖేమ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, మహార్నవమి రోజున పుట్టిన తన చిన్నారికి ప్రేమ, ఆశీస్సులు అందించిన అందరికీ అతడు ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తాయి. సోహా అలీఖాన్, కునాల్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. We are over the moon to share we have been blessed with a beautiful baby girl on this auspicious day Thank you for the love&blessings — kunal kemmu (@kunalkemmu) 29 September 2017 -
తాము విడిపోవడం లేదంటున్న బాలీవుడ్ జంట
ముంబై: బాలీవుడ్లో ఇటీవల విడాకుల సీజన్ నడుస్తోంది. విబేధాల కారణంగా ఇటీవల కొన్ని జంటలు విడిపోయాయి. తాజాగా బాలీవుడ్ జంట హీరో సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్, నటుడు కునాల్ కెమ్ము విడిపోతున్నట్టు రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కునాల్ స్పందిస్తూ.. తమకు విడిపోవాలనే ఆలోచనే లేదని చెప్పాడు. 'మా వివాహ బంధం చిక్కుల్లో పడిందా? నేను విడాకులు తీసుకోబోతున్నానా? కొంతమంది లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. నా భార్య నుంచి విడిపోవడం లేదు' అంటూ కునాల్ ట్వీట్ చేశాడు. 2014లో కునాల్, సోహాలకు పారిస్‌లో నిశ్చితార్థం జరిగింది. గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ జంట సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్లు విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరమూ విడిపోతున్నామంటూ మలైకా, అర్బాజ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. మరో నటి కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్‌తో విడాకుల విషయంలో ఒప్పందం చేసుకుంది. -
ఒక్కటైన కునాల్, సోహా
-
నిరాడంబరంగా సోహా, కునాల్ పెళ్లి
బాలీవుడ్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన ప్రేమజంటల్లో కునాల్ ఖేము, సోహా అలీఖాన్‌ల జోడీ ఒకటి. ఈ ఇద్దరి బంధం ఎన్నాళ్లో? అని చాలామంది అనుకున్నారు. కానీ, ఈ జంట తమ లవ్‌ని మ్యారేజ్ వరకూ తీసుకెళ్లింది. ఆదివారం ఈ ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. సోహా సోదరుడు సైఫ్ అలీఖాన్ దగ్గరుండి మరీ తన చెల్లెలి పెళ్లి జరిపించారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో సైఫ్ అలీఖాన్ కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. సోహా, కునాల్ జంటగా నటించనున్న ‘గాయల్-2’ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. -
పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ జంట!
ముంబై : ఈ నెల 25న ఆదివారం తాను నటుడు కునాల్ ఖేమును నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటున్నట్లు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ చెప్పారు. ఖార్లోని నివాసంలో కొద్ది మంది అతిథుల మధ్య సాదాసీదాగా తమ వివాహం జరుగుతుందని అన్నారు. పెళ్లిరోజు ఎటువంటి దుస్తులు ధరించాలో ఇంకా తేల్చుకోలేదని 36 ఏళ్ల వధువు అన్నారు. ఈ పెళ్లి వేడుక తనకు చిరస్మరణీయమైనదిగా, ప్రత్యేకమైనదిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోహా చెప్పారు. సోదరుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు కరీనాకపూర్ ధరించిన తమ కుటుంబ సాంప్రదాయ దస్తులను ఎందుకు ధరించడం లేదని ప్రశ్నించగా, అవి తమ నాయనమ్మవని చెప్పారు. వాటిని ఆమె తన కోడులు (సోహా తల్లి షర్మిల)కు ఇచ్చిందని, ఆమె తనకు కాబోయే కోడలు (కరీనా)కు ఇచ్చిందని అన్నారు. సోహా, కునాల్ల నిశ్చితార్థం గత ఏడాది పారిస్‌లో జరిగింది. కునాల్ సోహాకన్నా ఐదేళ్లు చిన్నవాడు. వీరిద్దరూ ‘99’అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ వివాహం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, షర్మిల చెప్పారు.