తాము విడిపోవడం లేదంటున్న బాలీవుడ్ జంట | Kunal Kemmu denies separation rumours from Soha Ali Khan | Sakshi
Sakshi News home page

తాము విడిపోవడం లేదంటున్న బాలీవుడ్ జంట

Published Sat, Apr 16 2016 3:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

తాము విడిపోవడం లేదంటున్న బాలీవుడ్ జంట - Sakshi

తాము విడిపోవడం లేదంటున్న బాలీవుడ్ జంట

ముంబై: బాలీవుడ్లో ఇటీవల విడాకుల సీజన్ నడుస్తోంది. విబేధాల కారణంగా ఇటీవల కొన్ని జంటలు విడిపోయాయి. తాజాగా బాలీవుడ్ జంట హీరో సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్, నటుడు కునాల్ కెమ్ము విడిపోతున్నట్టు రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కునాల్ స్పందిస్తూ.. తమకు విడిపోవాలనే ఆలోచనే లేదని చెప్పాడు.

'మా వివాహ బంధం చిక్కుల్లో పడిందా? నేను విడాకులు తీసుకోబోతున్నానా? కొంతమంది లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. నా భార్య నుంచి విడిపోవడం లేదు' అంటూ కునాల్ ట్వీట్ చేశాడు. 2014లో కునాల్, సోహాలకు పారిస్లో నిశ్చితార్థం జరిగింది. గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నారు.

బాలీవుడ్ జంట సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్లు విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరమూ  విడిపోతున్నామంటూ మలైకా, అర్బాజ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. మరో నటి కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్తో విడాకుల విషయంలో ఒప్పందం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement