సాక్షి, ముంబై : బాలీవుడ్ జంట కునాల్ ఖేము, సోహా అలీఖాన్‌ల నివాసంలో విజయదశమి పండుగ ముందే వచ్చేసింది. సోహా శుక్రవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కునాల్ ఖేమ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, మహార్నవమి రోజున పుట్టిన తన చిన్నారికి ప్రేమ, ఆశీస్సులు అందించిన అందరికీ అతడు ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తాయి. సోహా అలీఖాన్, కునాల్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
We are over the moon to share we have been blessed with a beautiful baby girl on this auspicious day Thank you for the love&blessings
— kunal kemmu (@kunalkemmu) 29 September 2017