ముంబై: ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించిన తాజా బాలీవుడ్ సినిమా మలంగ్. అనిల్ కపూర్, కునాల్ ఖేము ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ.. హంతకుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. చంపడాన్ని అలవాటుగా చేసుకున్న కిల్లర్‌గా ఆదిత్య.. అతన్ని వెంటాడే పోలీసాఫీసర్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు.
ప్రేమికులుగా నటించిన ఆదిత్య, దిశ మధ్య మోతాదుకు మించి లవ్, రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. బికినీ సీన్‌తో ట్రైలర్‌లో ఎంట్రీ ఇచ్చిన దిశ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. ట్రైలర్ క్లైమాక్స్‌లో తమంతా చంపడాన్ని ఎంజాయ్ చేస్తామన్న రీతిలో సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలు డైలాగ్ చెప్పడం కొసమెరుపు. ఆదిత్య భూజాల మీద కూర్చుని.. అతడితో దిశ లిప్ లాక్ చేస్తున్న ఈ సినిమా స్టిల్‌ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటెన్స్ లవ్, ఎమోషనల్, క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.
మలంగ్ ట్రైలర్ వచ్చేసింది
Published Mon, Jan 6 2020 2:30 PM | Last Updated on Mon, Jan 6 2020 3:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment