mohit suri
-
హీరోలకు చోటు లేదు.. ఆసక్తిగా 'ఏక్ విలన్ 2' పోస్టర్స్
Ek Villain 2 First Look Posters Of John Abraham Arjun Kapoor Out: బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో మోహిత్ సూరి ఒకరు. ఆయన దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన తారగణంగా నటించిన చిత్రం 'ఏక్ విలన్'. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సీక్వెల్లో ఎవరు నటించనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నటించే నటీనటులను దర్శకనిర్మాతలు కొన్నాళ్లుగా రహస్యంగా ఉంచగా, తాజాగా వారి పేర్లను బయటపెట్టారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత నిరీక్షణకు తెరదింపారు. 'ఏక్ విలన్'కు సీక్వెల్‌గా వస్తున్న 'ఏక్ విలన్: రిటర్న్స్' చిత్రంలో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, దిశా పటానీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను 'విలన్ల లోకంలో హీరోలకు చోటులేదు' అనే క్యాప్షన్‌తో విడుదల చేశారు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
మలంగ్ ట్రైలర్ లాంచ్
-
మలంగ్ ట్రైలర్ వచ్చేసింది
ముంబై: ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించిన తాజా బాలీవుడ్ సినిమా మలంగ్. అనిల్ కపూర్, కునాల్ ఖేము ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ.. హంతకుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. చంపడాన్ని అలవాటుగా చేసుకున్న కిల్లర్‌గా ఆదిత్య.. అతన్ని వెంటాడే పోలీసాఫీసర్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు. ప్రేమికులుగా నటించిన ఆదిత్య, దిశ మధ్య మోతాదుకు మించి లవ్, రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. బికినీ సీన్‌తో ట్రైలర్లో ఎంట్రీ ఇచ్చిన దిశ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. ట్రైలర్ క్లైమాక్స్‌లో తమంతా చంపడాన్ని ఎంజాయ్ చేస్తామన్న రీతిలో సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలు డైలాగ్ చెప్పడం కొసమెరుపు. ఆదిత్య భూజాల మీద కూర్చుని.. అతడితో దిశ లిప్ లాక్ చేస్తున్న ఈ సినిమా స్టిల్‌ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటెన్స్ లవ్, ఎమోషనల్, క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. -
రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ..
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటిస్తున్న ‘మలంగ్’ లేటెస్ట్ పోస్టర్ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆదిత్య, దిశ, అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో సముద్రం ఒడ్డున ఆదిత్య, దిశ గాఢ చుంబనంలో మునిగిపోయినట్టు చిత్రీకరించారు. ఈ పోస్టర్‌ను దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ‘రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ.. మలంగ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్ జనవరి 6న విడుదలకానుంది. రాజ్, కలియుగ్, ఏక్ విలన్, ఆష్కీ 2 తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన మొహిత్ సూరి ఈ సినిమా తెరకెక్కించారు. క్రైమ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ‘మలాంగ్’ సినిమాలో కీలకమైన ఓ ముద్దు సన్నివేశం కోసం హీరోహీరోయిన్లు రెండు రోజులు శిక్షణ తీసుకున్నారట. కునాల్ ఖేము, అమృత ఖాన్విల్కర్, ఏంజెలా క్రిస్లింజ్కి, షాద్ రాంధ్వా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 7న ‘మలంగ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఆషికీ 3’ హీరోగా సిద్ధార్థ్.!
బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఎంటర్టైనర్లు ఆషికీ, ఆషికీ 2. ముఖ్యంగా ఆషికీ 2 ఘనవిజయం సాధించటమే కాదు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సిరీస్‌లో మరో భాగాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. అయితే మూడో భాగంలో హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత మహేష్ భట్ ఆషికీ 3కి సంబంధించి సిద్ధార్థ్ తో చర్చలు జరిపారు. సిద్ధార్థ్ కూడా ఈ సూపర్ హిట్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆషికీ 2 చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వంలో వహించారు. మరో మూడో భాగానికి మోహితే దర్శకత్వం వహిస్తారా లేక మరో దర్శకుడు తెర మీదకు వస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
కీర్తి సనాన్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’!
చేతన్ భగత్ నవల ఆధారంగా త్వరలోనే సినిమా తెరకెక్కనుంది. ఈ నవల బుధవారం విడుదల కానుంది. మోహిత్ సూరి దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ కీర్తి సనాన్కు దక్కనున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్ర ఆలియా భట్ ధరించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ పాత్ర కీర్తి సనాన్కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘హీరోపత్ని’ విడుదల తర్వాత కీర్తికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. -
కెరీర్లో మంచి మలుపు తెచ్చింది
న్యూఢిల్లీ: బాలీవుడ్‌లోకి అడుగిడిన ఆదిత్యరాయ్ కపూర్ కెరీర్ ‘ఆషికి-2’ సినిమాతో భారీ మలుపు తిరిగింది. తొలినాళ్లలో 28 ఏళ్ల ఆదిత్య ‘లండన్ డ్రీమ్స్’, యాక్షన్ రీ ప్లే’, ‘గుజారిష్’ తదితర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ‘ఏదో ఒకరోజు కెరీర్లో మంచి మలుపు వ స్తుందనే నమ్మకం నాకు మొదటినుంచీ ఉంది. అయితే ‘యే జవానీ దివానీ’సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. మోహిత్ సూరి నేతృత్వంలో రూపొందించిన ‘ఆషికి-2’సినిమాలో ప్రధాన భూమిక నాదే. సోలో హీరో సినిమా అవకాశాలు రాలేదని నేను ఏనాడూ బాధపడలేదు. ఏ నిర్మాత అయినా వాణిజ్యపరంగా ఇబ్బందులు లేని కథానాయకుడు ఉండాలని కోరుకుంటాడు. అందువల్ల ఈ విషయంలో నేను ఎవరినీ నిందించదలుచుకోలేదు. అయితే అదృష్టం ‘ఆషికి-2’సినిమా రూపంలో వరించింది. చిన్న చిన్న పాత్రలు చేసే రోజుల్లో ఏనాడూ నిరాశకు గురికాలేదు. ఏదో ఒకరోజు మంచి అవకాశం లభిస్తుంద నే నమ్మకం మాత్రం ఉండేది. 2013లో విడుదలైన సినిమాల్లో ‘ఆషికి-2’ రికార్డు సృష్టించింది’ అని అన్నాడు. ఈ సినిమాలో ఆదిత్య... మద్యానికి అలవాటుపడిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. ‘ఈ సినిమాతో అప్పటిదాకా ప్రేక్షకులకు నాపై అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో అత్యంత విభిన్నంగా కనిపించా. అందులోనూ సోలో హీరోగా నటించా. హీరోగా నన్ను చూడాలనుకునేవారంతా ఈ సినిమాను వీక్షించాలి. ఈ సినిమా తరువాత బాలీవుడ్లో నాకు అవకాశాలు వెల్లువెత్తాయి. నా సత్తా ఏమిటో ఈ సినిమాతో బయటపడింది. తగినంత గుర్తింపు వచ్చింది’అని అన్నాడు. ప్రస్తుతం ఆదిత్య.... ‘దావత్ ఎ ఇష్క్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో పరిణీతిచోప్రా కథానాయిక. ఈ సినిమాలోనూ ఆదిత్య ప్రధాన పాత్రలోనే కనిపించనున్నాడు. -
ఆస్కార్ కోసం కాదు.. ప్రేక్షకుల కోసమే:మహేశ్ భట్
కోల్ కతా: తాను అవార్డుల కోసం సినిమాలు చేయడం లేదని బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తెలిపారు. భారతీయ చిత్రాలు నిర్మించేది ఆస్కార్ లాంటి అవార్డుల దక్కించుకోవడం కోసం కాదన్నారు . ఈ సందర్భంగా ఐఎన్ఎస్ తో మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్డడించారు. అవార్దు అనేది..ప్రస్తుతం చేస్తున్న సినిమాకు ప్రామాణికం కాదన్నారు. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను నిర్మిస్తేనే బాగుంటదన్నారు. అవార్డుల కోసం మాత్రమే సినిమాలు చేయడం మంచి పద్దతి కాదనదే తన అభిప్రాయంగా తెలిపారు. ఏ దర్శకుడైనా, రచయిత అయినా, నిర్మాత అయిన సినీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు నిర్మిస్తే బాగుంటుందన్నారు. తాను మాత్రం ప్రేక్షకులు కోసమే సినిమాలు తీస్తున్నానని తెలిపారు. 'మనం ఆస్కార్ అవార్డుల కోసం తీస్తున్నామా?లేక భారతీయ ప్రేక్షకులు కోసమా? ' అనేది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలన్నారు. తాను నిర్మాతగా చేసిన ఆషికి-2 భారీ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. తొలి వారంలో ఆ చిత్రం రూ.20 కోట్లు వసూలు చేయగా, నెలలోనే రూ.100 కోట్లు కలెక్షన్ లతో ప్రభంజన సృష్టించిందని తెలిపారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూ. 9 కోట్ల వ్యయంతో మహేశ్ భట్ నిర్మించారు.