మలంగ్ సినిమా తాజా పోస్టర్
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటిస్తున్న ‘మలంగ్’ లేటెస్ట్ పోస్టర్ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆదిత్య, దిశ, అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో సముద్రం ఒడ్డున ఆదిత్య, దిశ గాఢ చుంబనంలో మునిగిపోయినట్టు చిత్రీకరించారు. ఈ పోస్టర్‌ను దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ‘రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ.. మలంగ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్ జనవరి 6న విడుదలకానుంది.
రాజ్, కలియుగ్, ఏక్ విలన్, ఆష్‌కీ 2 తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన మొహిత్ సూరి ఈ సినిమా తెరకెక్కించారు. క్రైమ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ‘మలాంగ్’ సినిమాలో కీలకమైన ఓ ముద్దు సన్నివేశం కోసం హీరోహీరోయిన్లు రెండు రోజులు శిక్షణ తీసుకున్నారట. కునాల్ ఖేము, అమృత ఖాన్విల్కర్, ఏంజెలా క్రిస్లింజ్కి, షాద్ రాంధ్వా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 7న ‘మలంగ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment