'కల్కి', 'కంగువ' సినిమాలతో సౌత్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ దిశా పటానీ తండ్రి మోసపోయారు. మాజీ ఎస్పీ అయిన ఈయనకు మాయమాటలు చెప్పిన ఐదుగురు వ్యక్తులు.. ఏకంగా రూ.25 లక్షలు కాజేశారు. దీంతో దిశా తండ్రి పోలీసులని ఆశ్రయించాల్సి వచ్చింది. కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
(ఇదీ చదవండి: కంగువా చూసిన ప్రేక్షకులకు తలనొప్పి.. స్పందించిన సౌండ్ ఇంజనీర్)
ఇంతకీ ఏం జరిగింది?
దిశా తండ్రి జగదీష్ పటానీ గతంలో డిప్యూటీ ఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బరేలీలో ఉంటున్నారు. ఈయనకు బాగా పరిచయమున్న శివేంద్ర ప్రతాప్ సింగ్.. దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తుల్ని పరిచయం చేశాడు. తమకు చాలా పొలిటికల్ పరిచయాలున్నాయని.. ప్రభుత్వంలో ఏదైనా శాఖలో ఛైర్మన్ లేదా వైస్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తామని నమ్మబలికారు.
కొన్నిరోజులకు వీళ్లని నమ్మిన జగదీష్ పటానీ.. రూ.5 లక్షలు డబ్బుగా, రూ.20 లక్షల మొత్తాన్ని మూడుసార్లు పలు బ్యాంక్ అకౌంట్స్‌లో జమ చేశారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు అవుతున్నా ఏ విషయం తేలకపోయేసరికి సదరు వ్యక్తుల్ని ఉద్యోగం గురించి అడగ్గా.. తొలుత వడ్డీతో సహా డబ్బు తిరిగొచ్చేస్తా అన్నారు. మరోసారి అడిగేసరికి ఏకంగా బెదిరింపులకు దిగారు. ఇదేదో పెద్ద ఫ్రాడ్‌లా ఉందని అనుమాన పడిన దిశా పటానీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీళ్ల బండారం బయటపడింది.
(ఇదీ చదవండి: సిగ్గు లేకుండా నన్ను కమిట్‌మెంట్ అడిగాడు: టాలీవుడ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment