
హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని సన్నివేశాల్లో సౌండ్ ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చాయి. భరించలేనంత సౌండ్ వాడటంతో సినిమా చూసేటప్పుడు చిరాకు వచ్చిందని పలువురూ అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజనీర్ రసూల్ స్పందించాడు.

చివరి క్షణాల్లోనే ఈ సమస్యలు
కంగువాలో సౌండ్ బాలేదన్న రివ్యూలు చూస్తుంటే బాధగా ఉంది. ఈ విషయంలో ఎవర్నీ నిందించలేము. సినిమా కంప్లీట్ అయిన చివరి క్షణాల్లోనే ఇలాంటి సమస్యలే వస్తాయి. సినిమా రూపొందించే క్రమంలో జరిగే చిన్న తప్పుల వల్ల దాని మొత్తం విలువే మారిపోతుంది. మూవీ చూశాక ప్రేక్షకులు తలనొప్పితో బయటకు వెళ్తే రిపీటెడ్ ఆడియన్స్ ఉండరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
కంగువా..
ఈ పోస్ట్ చూసిన పలువురూ నిజంగానే తమకు సినిమా చూస్తుంటే ఆ సౌండ్‌కు తలనొప్పి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. కంగువా విషయానికి వస్తే.. సూర్య.. కంగువ, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment