
ఈ మధ్య కాలంలో అంతగా సినిమాలు చేయడం లేదు శ్రియ. ఒకట్రెండు సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో తన కుమార్తె రాధతో కలిసి సమయాన్ని గడుపుతున్నారు. కూతురికి ఆట పాటలు నేర్పడంతో పాటు ఇంకా బోలెడన్ని విషయాలు నేర్పుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాధను ఆమె పొలానికి తీసుకెళ్లి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. పంట నూర్పిళ్ల విధానాన్ని తన కూతురుకి తెలియజేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పొలాలంటే ఏంటో నేటితరానికి పెద్దగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో శ్రియ తన కుమార్తెను ఇలా పొలానికి తీసుకెళ్లడం, నూర్పిళ్లు ఎలా చేస్తారో తానే స్వయంగా చేసి చూపంచడం హాట్‌టాపిక్‌గా మారింది.
సెల్‌ఫోన్లతో పిల్లలు బిజీగా ఉంటున్న ఈ కాలంలో శ్రియ ఇలా చేయడం అభినందనీయమని పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే.. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య 44’(వర్కింగ్ టైటిల్) సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment