Resul Pookutty
-
కంగువా చూసిన ప్రేక్షకులకు తలనొప్పి.. స్పందించిన సౌండ్ ఇంజనీర్
హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని సన్నివేశాల్లో సౌండ్ ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చాయి. భరించలేనంత సౌండ్ వాడటంతో సినిమా చూసేటప్పుడు చిరాకు వచ్చిందని పలువురూ అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజనీర్ రసూల్ స్పందించాడు.చివరి క్షణాల్లోనే ఈ సమస్యలుకంగువాలో సౌండ్ బాలేదన్న రివ్యూలు చూస్తుంటే బాధగా ఉంది. ఈ విషయంలో ఎవర్నీ నిందించలేము. సినిమా కంప్లీట్ అయిన చివరి క్షణాల్లోనే ఇలాంటి సమస్యలే వస్తాయి. సినిమా రూపొందించే క్రమంలో జరిగే చిన్న తప్పుల వల్ల దాని మొత్తం విలువే మారిపోతుంది. మూవీ చూశాక ప్రేక్షకులు తలనొప్పితో బయటకు వెళ్తే రిపీటెడ్ ఆడియన్స్ ఉండరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.కంగువా..ఈ పోస్ట్ చూసిన పలువురూ నిజంగానే తమకు సినిమా చూస్తుంటే ఆ సౌండ్‌కు తలనొప్పి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. కంగువా విషయానికి వస్తే.. సూర్య.. కంగువ, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. దిశా పటానీ హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.చదవండి: పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. వీడియో వైరల్ -
ఇది ఆస్కార్ శాపం అన్నారు
‘‘ఆస్కార్ గెలిచిన తర్వాత బాలీవుడ్ నన్ను దూరం పెట్టింది. ఎవ్వరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను’’ అన్నారు సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి. ఇటీవలే సంగీత దర్శకుడు రెహమాన్ హిందీలో తనకు సినిమాలు రానీయకుండా ఓ గ్యాంగ్ పని చేస్తోందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘నాకూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది’’ అని తెలిపారు రెసూల్. ఈ విషయాన్ని ట్వీటర్ లో ప్రస్తావిస్తూ – ‘‘ఆస్కార్ విజయం తర్వాత బాలీవుడ్ వారు సినిమాలు ఇవ్వకపోయినా ప్రాంతీయ సినిమా నన్ను బాగా గౌరవించింది.. హిందీలో కొన్ని నిర్మాణ సంస్థలు ‘నా ముఖం మీదే నువ్వు మాకు అవసరం లేదు’ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని హాలీవుడ్ కి వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ వెళ్లలేదు, వెళ్లే ఆలోచన కూడా లేదు. నాకు ఆస్కార్ తెచ్చిపెట్టింది ఇండియన్ సినిమానే. అవకాశాలు రాని విషయం గురించి ఓ సందర్భంలో ఆస్కార్ అకాడమీ వాళ్లతో మాట్లాడితే ఆస్కార్ పొందినవారికి ఎదురయ్యే సమస్య ఇదే అని, ఇది ఆస్కార్ శాపమని చెప్పారు. అయినా ఆస్కార్ గెలిచి గాల్లో తేలుతూ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేయడాన్ని మించిన రియాలిటీ చెక్ ఉంటుందా? ఏది ఏమైనా నేను పని చేసిన ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం. నన్ను నమ్మేవాళ్లు, నా పనిని గౌరవించేవాళ్లు కొంతమంది ఉన్నారు. వారు నన్ను గౌరవిస్తారు.. నమ్ముతారు’’ అని పలు ట్వీట్స్ లో రాసుకొచ్చారు రెసూల్ పూకుట్టి. -
నాకు పరిశ్రమలో అవకాశాలు రాలేదు
-
‘ఆస్కార్ రావడమే శాపం’
బాలీవుడ్ పరిశ్రమలో ఒక గ్యాంగ్ తన గురించి దుష్ప్రచారం చేస్తూ తనకు ఆఫర్స్ రాకుండా చేస్తున్నారంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రెహమాన్ అనంతరం ఆస్కార్ అవార్డు విన్నర్ రేసుల్ పూకుట్టి కూడా తన ఆవేదనను బయట పెట్టారు. ఆస్కార్ గెలుచుకున్న తరువాత బాలీవుడ్లో అవకాశం ఇవ్వడానికి ఎవరు ఆసక్తి చూపలేదని తెలిపారు. కొంత మంది మాకు నువ్వు అవసరం లేదని ముఖం మీదే చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకి బాలీవుడ్ పరిశ్రమ అంటే ఇప్పటికీ ఇష్టమేనని పేర్కొన్నారు. Dear @shekharkapur ask me about it, I had gone through near breakdown as nobody was giving me work in Hindi films and regional cinema held me tight after I won the Oscar... There were production houses told me at my face ”we don’t need you” but still I love my industry,for it.... https://t.co/j5CMNWDqqr — resul pookutty (@resulp) July 26, 2020 రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై శేఖర్ కపూర్ స్పందిస్తూ రెహమాన్ ‘నీ సమస్య ఏంటో నీకు తెలుసు, నువ్వు ఆస్కార్ గెలుచుకున్నావు. ఆస్కార్ అంటేనే బాలీవుడ్లో చనిపోవడానికి ముద్దు పెట్టడం లాంటిది. దాని అర్థం నువ్వు బాలీవుడ్ హ్యాండిల్ చేసేదాని కంటే ఎక్కువ టాలెంట్ కలిగి ఉన్నావు’ అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కు రేసుల్ పూకుట్టి స్పందిస్తూ, ‘శేఖర్ దాని గురించి నన్ను అడగండి. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తరువాత నాకు పరిశ్రమలో అవకాశాలు రాలేదు. దాంతో నేను కుంగిపోయాను. తరువాత నాకు ఆస్కార్ శాపం గురించి తెలిసింది. కొంత మంది మాకు నువ్వు అవసరం లేదు అని ముఖం మీదే చెప్పారు. కానీ నాకు ఈ పరిశ్రమ అంటే ఇప్పటికీ ఇష్టమే’ అని చెప్పారు. @shekharkapur ...and much later when I discussed this with my @TheAcademy members friends they told me about #OscarCurse! It’s faced by everybody! I enjoyed going through that phase, when you are on top of the world &when you know people reject you,it’s the biggest reality check! — resul pookutty (@resulp) July 26, 2020 దిల్ బచరా విడుదల తరువాత మీరు బాలీవుడ్లో ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడంలేదు అని ఏఆర్ రెహమాన్‌ను ఒక ఇంటరర్వ్యూలో ప్రశ్నించగా, ‘నేను ఎప్పుడు మంచి సినిమాలకు చేయను అని చెప్పలేదు. కానీ కొంత మంది గ్యాంగ్ నా మీద రూమర్స్ సృష్టిస్తున్నారు. దీంతో అవకాశాలు రావడం లేదు’ అని రెహమాన్ చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చదవండి: నీ ప్రతిభను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేదు -
నో బ్రేక్.. సింగిల్ టేక్
‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ’ అనే డైలాగులు సినిమాల్లో సరదా సందర్భాల్లో చాలానే వింటుంటాం. కానీ మన ఇండియన్ ఇండస్ట్రీల్లో అలాంటి యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అమితాబ్ తాజాగా తన నటనతో ‘చెహర్’ చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురి చేశారట. ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్, కృతీ కర్బందా, రియా చక్రవర్తి ముఖ్య పాత్రల్లో రుమీ జాఫ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చె హర్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో 14 నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేశారట అమితాబ్. అంత లెంగ్తీ సీన్‌ని ఒకే ఒక్క టేక్‌లో చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే టీమ్ అంతా నిలబడి అమితాబ్‌కు చప్పట్లు కొట్టారట. ఈ విషయాన్ని ఆ చిత్ర సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి తెలిపారు. ‘‘అమితాబ్‌గారు ఇవాళ ఇండియన్ సినిమా చరిత్రలో మరో అద్భుతం సృష్టించారు. 14 నిమిషాలు ఏకధాటిగా నటించి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సార్, ఏమాత్రం డౌన్ లేదు. ప్రపంచంలో మీరు నిజంగా బెస్ట్’’ అని ట్వీట్ చేశారు రసూల్. -
దర్శక–నిర్మాత రసూల్!
సౌత్ అండ్ నార్త్ సినిమాలే కాకుండా కొన్ని హాలీవుడ్ సినిమాలకు సైతం వర్క్ చేశారు సౌండ్ ఇంజినీర్ రసూల్. 2009లో వచ్చిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికిగాను సౌండ్ మిక్సింగ్ విభాగంలో రసూల్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు రసూల్ దర్శకుడిగా మారనున్నారని సమాచారం. ‘రంగ్ దే బసంతి, ఢిల్లీ 6’ చిత్రాలకు కథ అందించిన కమల్పాండే ఈ సినిమాకు కథ రాస్తున్నారట. ఓ హాలీవుడ్ స్టూడియోతో కలిసి రసూల్ ఈ సినిమాను నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. -
గోల్డెన్ రీల్ అవార్డుకు ‘2.ఓ’
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిన భారతీయ చిత్రం 2.ఓకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోల్డెన్ రీల్ అవార్డుకు ఈ చిత్రం నామినేట్ అయ్యింది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అవార్డుల్లో ప్రధానమైన వాటిలో గోల్డెన్ రీల్ ఒకటి. ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్, ఎడిటింగ్ కళాకారులకు ఈ అవార్డులను ప్రతి ఏడాది అందిస్తుంటారు. ఈ ఏడాది 66వ గోల్డెన్ రీల్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఫిబ్రవరి 17న అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో బ్రహ్మాండంగా జరగనుంది. మోషన్ పిక్చర్ సౌండ్, ఎడిటర్స్ సంస్థ నిర్వహించనున్న ఈ అవార్డులకు శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన 3డీ ఫార్మెట్లో 4డీ ఎస్ఎల్ఆర్ సౌండ్‌సిస్టంలో రూపొందిన 2.ఓ చిత్రం నామినేట్ అవడం విశేషం. గత ఏడాది నవంబర్‌లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడీ చిత్రం విదేశీ చిత్రాల కేటగిరీలో ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్ విభాగంలో గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఈ అవార్డు కోసం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకూ ఓటింగ్ పక్రియ జరుగుతుంది. అధిక శాతం ఓటింగ్ పొందిన చిత్రానికి ఫిబ్రవరి 17న జరిగే కార్యక్రమంలో గోల్డెన్ రీల్ అవార్డును అందిస్తారు. 2.ఓ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టాన్ సౌండ్ డిజైనర్‌గా పని చేశారు. -
1133 ఏళ్ల ఆచారం
‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో అకాడమీ అవార్డ్ అందుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి. లేటెస్ట్గా ‘ది సౌండ్ స్టోరీ’ అనే సినిమా కోసం తెర వెనుక నుంచి తెర మీదకు వచ్చారాయన. ప్రసాద్ ప్రభాకరన్ దర్శకత్వంలో రసూల్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ది సౌండ్ స్టోరీ’. హిందీ, మలయాళ భాషల్లో రూపొందించారు. తమిళంలో ‘ఒరు కథ సొల్లటుమా’ టైటిల్‌తో రిలీజ్ కానుంది. కేరళలోని తిరుచ్చూర్‌లో ప్రతి ఏడాది ‘పూరమ్’ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆచారం 1133 సంవత్సరాల పురాతనమైనదట. ఆ ఉత్సవాల్లోని సౌండ్‌ను రికార్డ్ చేయాలనుకునే పాత్రలో రసూల్ కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న కెనడా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ కానుంది. ‘‘1133 సంవత్సరాలుగా ఉన్న ఆచారాన్ని ఆగస్ట్ 11న ‘సీట్ ఆఫ్ కల్చర్’గా కెనడా చలన చిత్రోత్సవాల్లో సెలబ్రేట్ చేసుకోనున్నాం’’ అన్నారు రసూల్. -
స్పీడు స్పీడులే... ఇది సూపర్ స్పీడులే!
‘నరసింహ’ సినిమా క్లైమాక్స్‌లో రజనీకాంత్ ఫైట్ చేస్తుంటే కారులో కూర్చున్న నటుడు అబ్బాస్ ‘ఆహా.. మీకింకా వయసు అవ్వలేదు’ అనే డైలాగ్ చెబుతాడు. ‘నరసింహ’లోని ఒక్క ఫైట్ మాత్రమే కాదు.. సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ రజనీ స్పీడ్ చూసి అభిమానులు ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడీ సూపర్‌స్టార్ స్పీడ్ చూసి ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘2.0’కి ఈయనే సౌండ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సోమవారం నుంచి రజనీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఒక్క రోజులో మూడు రీళ్లకు డబ్బింగ్ చెప్పేశారని రసూల్ పూకుట్టి ట్వీట్ చేశారు. ‘‘వృత్తి పట్ల తలైవా (రజనీకాంత్) అంకితభావం, నిబద్ధత అసమానం. ఆయనకు ఆయనే సాటి. ఒక్క రోజులో మూడు రీళ్లకు డబ్బింగ్ చెప్పారు. ఆయన వర్క్ చూసి నేను ఆశ్చర్యపోయా’’ అని రసూల్ అన్నారు. రసూల్ మాటలు వింటుంటే, ‘బాషా’లో సూపర్ స్టార్ సై్టల్‌ను ఉద్దేశించి రాసిన ‘సై్టలు సై్టలులే.. ఇది సూపర్ సై్టలులే...’ పాటను ఆయన స్పీడుకి ఆపాదించి, ‘స్పీడు స్పీడులే.. ఇది సూపర్ స్పీడులే’ అని కూడా అనొచ్చేమో అనిపిస్తోంది. అమీ జాక్సన్ హీరోయిన్గా, హిందీ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సిని మాకు రెహమాన్ సంగీత దర్శకుడు. -
డబ్బింగ్ చెబుతున్న సూపర్ స్టార్
చెన్నె: సూపర్ స్టార్ రజనీకాంత్, అగ్రశ్రేణి దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ '2.0' నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. సోమవారం నుంచి డబ్బింగ్ మొదలు పెట్టారు. హీరో రజనీకాంత్ డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రసూల్ పోకుట్టి ట్విటర్ ద్వారా వెల్లడించారు. '2.0' డబ్బింగ్ పనుల కోసం చెన్నై వెళుతున్నట్టు ఆయన తెలిపారు. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ సైంటిస్ట్, చిట్టి రోబో పాత్రల్లో కనిపించనున్నారు. లికా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. గత నెలలో ముంబైలో విడుదల చేసిన ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. 2017 దీపావళికి త్రీడీలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
'ఈ అవార్డు నిర్భయ ఆత్మకే..'
లాస్ ఏంజిల్స్ : 'ఈ అవార్డు నిర్భయ ఆత్మకే..' అంటూ ప్రముఖ భారతీయ యువ శబ్దగ్రాహకుడు రెసూల్ పోకుట్టి ట్వీట్ చేశారు. రెసూల్ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న మోషన్ పిక్చర్స్ సౌండ్ ఎడిటర్స్ 63వ 'గోల్డెన్ రీల్ అవార్డ్స్' వేడుకలో 'బెస్ట్ సౌండ్' అవార్డును సొంతం చేసుకున్నారు. 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీకి సమకూర్చిన శబ్దానికిగాను రెసూల్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఆయన తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ అవార్డు భారతీయ యువతలో ఉన్న నిజమైన చైతన్యానిదని, నిర్భయ ఆత్మకే చెందుతుందంటూ ట్వీట్ చేశారు. ఆసియాలో గోల్డెన్ రీల్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు రెసూల్ పోకుట్టి కావడం విశేషం. 'ఇండియాస్ డాటర్', 'అన్ ఫ్రీడమ్' అనే రెండు చిత్రాలకు రెసూల్ పోకుట్టికి నామినేషన్లు లభించాయి. ఈ రెండు చిత్రాలు భారత్‌లో నిషేధానికి గురికావడం గమనార్హం. ఇదివరకే 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికిగాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో మరో ఇద్దరితో కలిపి రెసూల్ ఆస్కార్ అందుకున్నారు. కాగా ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం నేపథ్యంగా వచ్చిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ భారత్ లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. లెస్లీ ఉడ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేసింది. And the Golden Reel goes to.... pic.twitter.com/cveHza7hJo — resul pookutty (@resulp) February 28, 2016 Is it true that I really got it....it's for the true spirit of the youth of India. This goes to Nirbhaya's soul..! pic.twitter.com/8ziq8mK7Zp — resul pookutty (@resulp) February 28, 2016