రసూల్ పూకుట్టి
‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో అకాడమీ అవార్డ్ అందుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి. లేటెస్ట్‌గా ‘ది సౌండ్ స్టోరీ’ అనే సినిమా కోసం తెర వెనుక నుంచి తెర మీదకు వచ్చారాయన. ప్రసాద్ ప్రభాకరన్ దర్శకత్వంలో రసూల్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ది సౌండ్ స్టోరీ’. హిందీ, మలయాళ భాషల్లో రూపొందించారు. తమిళంలో ‘ఒరు కథ సొల్లటుమా’ టైటిల్‌తో రిలీజ్ కానుంది. కేరళలోని తిరుచ్చూర్‌లో ప్రతి ఏడాది ‘పూరమ్’ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆచారం 1133 సంవత్సరాల పురాతనమైనదట. ఆ ఉత్సవాల్లోని సౌండ్‌ను రికార్డ్ చేయాలనుకునే పాత్రలో రసూల్ కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న కెనడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ కానుంది. ‘‘1133 సంవత్సరాలుగా ఉన్న ఆచారాన్ని ఆగస్ట్ 11న ‘సీట్ ఆఫ్ కల్చర్’గా కెనడా చలన చిత్రోత్సవాల్లో సెలబ్రేట్ చేసుకోనున్నాం’’ అన్నారు రసూల్.
Comments
Please login to add a commentAdd a comment