కల్కి భామ టాటూ గోల.. ఇంతకీ ఏ భాషనో తెలుసా? | Kalki 2898 AD Actress Disha Patani Looks In tattoo Goes Viral | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: కల్కి భామ నడుముపై టాటూ.. ఈ కొత్త భాష ఇలా ఉందేంటి బ్రో!

Published Tue, Jul 9 2024 11:52 AM | Last Updated on Wed, Jul 10 2024 5:13 PM

Kalki 2898 AD Actress Disha Patani Looks In tattoo Goes Viral

లోఫర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ దిశా పటానీ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన కల్కి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం 11 రోజుల్లనే రూ.900 కోట్ల క్లబ్‌లో చేరింది. దిశా పటానీతో పాటు దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటించారు.

కాగా.. ఇటీవల PD అనే టాటూతో వార్తల్లో నిలిచింది. ఇది చూసిన కొందరు ప్రభాస్ డార్లింగ్‌ అంటూ అర్థం వచ్చేలా ఎవరికీ న‍చ్చింది వారు చెప్పుకొచ్చారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి తన ఒంటిపై టాటూతో కనిపించింది. ప్రభాస్ కల్కితో తన అనుభవాన్ని షేర్ చేస్తూ ఫోటోలు, వీడియోలు పంచుకుంది. ఇందుతో దిశా పటానీ శరీరంపై అర్థం కానీ విదేశీ భాషలో ఉన్న టాటూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్‌ దీని గురించి తెగ ఆరా తీస్తున్నారు. అసలు అర్థం కానీ భాషల్లో ఉన్న ఆ టాటూ ఏంటని చర్చించుకుంటున్నారు.

అయితే దిశా పటానీ నడుము మీద ఉన్న టాటూ.. హీబ్రూ భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లో ఈ భాష మాట్లాడతారు.  'అతను నమ్మే ప్రతిదీ పొందవచ్చు' అని ఆ టాటూ అర్థమట. మరీ ఆ టాటూ గురించి తెలుసుకోవాలంటే హీబ్రూ నేర్చుకోవాలా? నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది చూస్తుంటే కేవలం సినిమా షూటింగ్‌ కోసమే వేయించుకున్న టాటూలా అనిపిస్తోంది. రాక్సీ గెటప్‌లో ఉన్న దిశా పటానీ ప్రభాస్‌తో ఉన్న సెల్ఫీని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement