ఈమె స్టార్ హీరోయిన్‌‌కి అక్క.. ఆర్మీలో 12 ఏళ్లుగా దేశసేవ.. గుర్తుపట్టారా? | Disha Patani Sister Khushboo Patani Details | Sakshi
Sakshi News home page

Guess The Person: పాన్ ఇండియా హీరోయిన్‌కి ఈమె అక్క.. ఇద్దరూ ఒకేలా.. కానీ?

Published Thu, Apr 25 2024 4:46 PM | Last Updated on Thu, Apr 25 2024 4:46 PM

Disha Patani Sister Khushboo Patani Details  - Sakshi

అందంగా ఉన్నోళ్లు సినిమాల్లోనే ఉంటారనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం డాక్టర్, టీచర్, హౌస్ వైఫ్, ఆర్మీ ఆఫీసర్.. ఇలా ఎక్కడో చోట సింపుల్‌గా బతికేస్తుంటారు. సోషల్ మీడియా వల్ల అనుకోకుండా అలా వైరల్ అయిపోతుంటారు. ఈమె కూడా సేమ్ అలానే. కాకపోతే ఈమెకి సినీ ఇండస్ట్రీతో సంబంధముంది. ఎందుకంటే ఈమె చెల్లెలు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ మరి. ప్రభాస్ సినిమాలోనే నటిస్తోంది. మరి ఈ అక్కచెల్లెళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఖుష్బూ పటానీ. హా.. అవును మీరు అనుకున్నది నిజమే. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఓ అక్క ఉంది. ఆమె ఈమెనే. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఖుష్బూ.. బరేలీలో స్కూలింగ్ పూర్తిచేశారు. ఎలక్ట‍్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారు. అయితే అందరిలా ఐటీ సైడ్ కాకుండా ఆర్మీలో చేరింది. సాధారణ సోల్జర్ స్థాయి నుంచి లెఫ్ట్‌నెంట్ వరకు చేరుకున్నారు.

దాదాపు 12 ఏళ్ల పాటు ఆర్మీలో దేశ సేవ చేసిన ఖుష్బూ పటానీ.. ఊహించని విధంగా గతేడాది వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే చెల్లి దిశా లానే ఈమె కూడా హెల్త్, ఫిట్‌నెస్ విషయంలో పక్కాగా ఉంటారు. ఎందుకంటే ఈమె సర్టిఫైడ్ న్యూట్రిషియన్ ట్రైనర్ కాబట్టి. ఇన్ స్టాలోనూ ఖుష్బూకి దాదాపు 3,80,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా తన ఆర్మీ జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈమె గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే చూడటానికి అక్కాచెల్లెళ్లు ఒకేలా కనిపిస్తున్నారు. కానీ ఒకరేమో నటి కాగా, మరొకరు మాత్రం ఆర్మీలో సేవ చేశారు.

(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement