‘ఆషికీ 3’ హీరోగా సిద్ధార్థ్‌.! | Sidharth Malhotra To Play Male Lead In Aashiqui 3 | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 10:01 AM | Last Updated on Sat, Jun 2 2018 11:33 AM

Sidharth Malhotra To Play Male Lead In Aashiqui 3 - Sakshi

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్లు ఆషికీ, ఆషికీ 2. ముఖ్యంగా ఆషికీ 2 ఘనవిజయం సాధించటమే కాదు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సిరీస్‌లో మరో భాగాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌. అయితే మూడో భాగంలో హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్ సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే నిర్మాత మహేష్‌ భట్‌ ఆషికీ 3కి సంబంధించి సిద్ధార్థ్‌ తో చర్చలు జరిపారు. సిద్ధార్థ్‌ కూడా ఈ సూపర్‌ హిట్ సిరీస్‌ లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆషికీ 2 చిత్రానికి మోహిత్‌ సూరి దర్శకత్వంలో వహించారు. మరో మూడో భాగానికి మోహితే దర్శకత్వం వహిస్తారా లేక మరో దర్శకుడు తెర మీదకు వస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement