బాలీవుడ్లో కిక్ ఇస్తున్న ఫ్రాంచైజీ మూవీస్
బాలీవుడ్లో కొన్ని ఫ్రాంచైజీ మూవీస్ ఉన్నాయి. ప్రతి ఏడాది వీటిలో కొన్ని సెట్స్‌పైకి వెళితే.. మరికొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. అయితే ఈ ఏడాది విశేషం ఏంటంటే... వివిధ ఫ్రాంచైజీస్లోని మూడో భాగాలు కొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరికొన్ని సెట్స్‌పైకి వెళ్తున్నాయి. ఇలా ‘ఏక్ దో తీన్..’ అంటూ థర్డ్ పార్డ్తో బిజీగా ఉన్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.
మళ్లీ టైగర్
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో పదేళ్ల క్రితం విడుదలైన ‘ఏక్తా టైగర్’ ఒకటి. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించారు. ఇదే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ జిందా హై’ (2017)లోనూ సల్మాన్, కత్రినా జంటగా నటించారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్. ఇక సల్మాన్, కత్రినా ‘టైగర్ 3’కి కూడా జోడీ కట్టారు. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల మాదిరి ‘టైగర్ 3’ కూడా స్పై ఫిల్మే. ‘ఏక్తా టైగర్’కు కబీర్ ఖాన్, ‘టైగర్ జిందా హై’ను అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించగా, ‘టైగర్ 3’కు మనీష్ శర్మ దర్శకుడు. ‘టైగర్’ ఫ్రాంచైజీలోని మూడు సినిమాలకు ముగ్గురు దర్శకులు దర్శకత్వం వహించగా, హీరో హీరోయిన్లు మాత్రం సల్మాన్, కత్రినాలే కావడం ఓ విశేషం.
ఓ వైపు దశ్యం.. మరోవైపు సింగమ్
హిందీ తెరపై ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్. హిందీ ‘దృశ్యం’ (2015), ‘దృశ్యం 2’ (2022) చిత్రాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. మలయాళంలో హీరో మోహన్‌లాల్– దర్శకుడు జీతూ జోసెఫ్ కలయికలో రూపొందిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు హిందీ రెండు భాగాల ‘దృశ్యం’ రీమేక్. అయితే ఈసారి మలయాళంలో మోహన్‌లాల్‌తో, హిందీలో అజయ్ దేవగన్‌తో ఒకేసారి ‘దృశ్యం 3’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారట జీతూ జోసెఫ్. ఇక హిందీ ‘దృశ్యం’కు నిషికాంత్ కామత్, ‘దృశ్యం 2’కి అభిషేక్ పాతక్ దర్శకత్వం వహించారు. ఇక దర్శకుడు రోహిత్ శెట్టి–హీరో అజయ్ దేవగన్ కాంబినేషన్లో ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ల తర్వాత ‘సింగమ్ వన్స్ ఎగైన్’ చిత్రం తెరకెక్కనుంది. ఇలా డైరీలో రెండు థర్డ్ పార్ట్ చిత్రాలకు డేట్స్ కేటాయించారు అజయ్ దేవగన్.
బిజీ కిలాడి
బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ వరుస చిత్రాలతో బిజీగా ఉంటారు. ఈ క్రమంలో ఈ బిజీ హీరో మూడు ఫ్రాంచైజీస్లోని మూడు థర్డ్ పార్ట్ సినిమాలకు అసోసియేట్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. బాలీవుడ్ హిట్ కామెడీ ఫ్రాంచైజీలో ‘వెల్కమ్’ తప్పక ఉంటుంది. 2007లో వచ్చిన ‘వెల్కమ్’, 2015లో విడుదలైన ‘వెల్కమ్ బ్యాక్’ (వెల్కమ్ 2) చిత్రాల తర్వాత ‘వెల్కమ్ టు ది జంగిల్ (వెల్కమ్ 3)’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, పరేష్ రావల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘వెల్కమ్, ‘వెల్కమ్ బ్యాక్’ చిత్రాలకు అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించగా, ‘వెల్కమ్ టు ది జంగిల్’ను దర్శకుడు అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘హేరా ఫేరీ’ (2000), ‘ఫిర్ హేరా ఫేరీ’ (2006) చిత్రాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హేరా ఫేరీ’ థర్డ్ పార్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని.. ఈ మూడో భాగంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటించనున్నామని ఇటీవల సునీల్ శెట్టి పేర్కొన్నారు. మరోవైపు ‘జాలీ ఎల్ఎల్బీ 3’ ఉంటుందని, ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటిస్తామన్నట్లుగా అర్షద్ వార్సీ ఇటీవల పేర్కొన్నారు. 2013లో ‘జాలీ ఎల్ఎల్బీ’, 2017లో ‘జాలీఎల్ఎల్బీ 2’ చిత్రాలు వచ్చాయి.
కొత్త డాన్
బాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్లోకి కొత్త డాన్ వచ్చాడు. ఈ డాన్ పేరు రణ్వీర్ సింగ్. హిందీలో ‘డాన్’ అనగానే తొలుత అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత షారుక్ ఖాన్ గుర్తొస్తారు. రచయితలు సలీమ్–జావేద్‌లు సష్టించిన డాన్ క్యారెక్టర్‌తో అమితాబ్ బచ్చన్ టైటిల్ రోల్లో చంద్ర బరోత్ తెరకెక్కించిన ‘డాన్’ (1978) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ తొలి డాన్‌గా అమితాబ్‌ని నిలిపింది. ఇక దాదాపు మూడు దశాబ్దాలకు ‘డాన్’ సినిమా ఆధారంగానే ఫర్హాన్ అక్తర్ 2006లో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ తీశారు. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. షారుక్ కూడా బెస్ట్ డాన్ అనిపించుకున్నారు. ఇక ఈ సినిమా హిట్ కావడంతో హీరో షారుక్ ఖాన్, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కాంబినేషన్లో ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ (2011) వచ్చి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే ‘డాన్ 3’ తెరకెక్కనుంది. అయితే ఇందులో షారుక్ నటించడంలేదు. డాన్‌గా రణ్వీర్ íసింగ్ నటిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారు.
బాలీవుడ్ బ్రహ్మాస్త్రం
ఒక సినిమా హిట్ సాధించిన తర్వాత, ఆ సినిమా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ సెట్స్‌పైకి వచ్చిన సినిమాలు బాలీవుడ్లో చాలా ఉన్నాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం ఇందుకు విభిన్నం. ఎందుకంటే ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం మూడు భాగాలుగా వస్తుందని ఈ సినిమాను ప్రకటించిన సమయంలోనే వెల్లడించారు మేకర్స్. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించిన ‘బ్రహ్మాస్త్రం’ సినిమా తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ట్ 1 శివ’ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 2: దేవ్’, ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 3’ చిత్రాలకు సంబంధించిన ప్రీ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. అయితే సెకండ్, థర్డ్ పార్ట్ షూటింగ్ ఒకేసారి జరుగుతుందని వరు సగా 2026, 2027లో ఈ సినిమాలు విడుదల అవుతాయనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజా ్రపాజెక్ట్ ‘వార్ 2’ కాబట్టి ఈ కారణంగా ‘బ్రహ్మాస్త్ర’ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.
ఇటు ప్రేమ.. అటు భయం
‘ప్రేమ.. జీవితాన్ని జీవించేలా చేస్తుంది’ అంటూ 1990లో వచ్చిన ‘ఆషికీ’కి బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మహేశ్ భట్ దర్శకత్వంలో రాహుల్ రాయ్, అనూ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. కాగా రెండు దశాబ్దాల తర్వాత ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ‘ఆషికీ 2’ (2013) సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు ‘ఆషికీ 3’కి శ్రీకారం జరిగింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. ఇంకా హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు. మరోవైపు హారర్ ఫిల్మ్ ‘భూల్ భూలెయ్య 3’లో కూడా హీరోగా నటిస్తున్నారు కార్తీక్ ఆర్యన్. ‘భూల్ భూలెయ్య 2’ను డైరెక్ట్ చేసిన అనీస్ బాజ్మీ, ఆ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేసిన కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్లోనే ‘భూల్ భూలెయ్య 3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియ దర్శన్ దర్శకత్వంలో 2007లో ‘భూల్ భూలెయ్య’ చిత్రం విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది.
కామెడీ ఫుక్రే
హీరో పుల్కిత్ సామ్రాట్, దర్శకుడు మగ్దీప్ సింగ్ లంబా కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘ఫుక్రే 3’ ఈ నెల 28న విడుదల కానుంది. 2013లో వచ్చిన ‘ఫుక్రే’, 2017లోని ‘ఫుక్రే రిటర్న్స్’ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ‘ఫుక్రే రిటర్న్స్’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది.
ఇలా బాలీవుడ్లో ముస్తాబు అవుతున్న మూడో భాగం చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.