మూడో ప్రేమికుడు | Confirmed: Rumoured lovebirds Alia Bhatt and Sidharth Malhotra to star in Aashiqui 3 | Sakshi
Sakshi News home page

మూడో ప్రేమికుడు

Published Tue, Apr 12 2016 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

మూడో ప్రేమికుడు

మూడో ప్రేమికుడు

1990లో మహేశ్‌భట్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆషికి’ మ్యూజికల్‌గా ఎంత సూపర్‌హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదే పంథాలో ‘ఆషికి-2’ పేరుతో మూడేళ్ల క్రితం వచ్చిన సినిమా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాతో ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ ఓవర్‌నైట్ స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ‘ఆషికి’కి మూడో భాగం రానుంది. ఇందులో జంటగా సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియా భట్‌లు నటించనున్నారు. తొలి చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తోనే మంచి జంట అనిపించుకున్న వీరిద్దరూ ఇటీవల ‘కపూర్ అండ్ సన్స్’లో నటించారు. రియల్ లవర్స్‌గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ రీల్ లవర్స్‌గానూ ఎలాగూ రాణిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement