బాలీవుడ్‌లో ‘ఆషికీ’ మూవీ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘ఆషికీ, ఆషికీ 2’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలను టీ సిరీస్, వినేష్ ఫిల్మ్స్ నిర్మించాయి. హిట్ ఫ్రాంచైజీ కావడంతో ‘ఆషికీ 3’ని కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే ‘ఆషికీ 3’ని 2022లో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా, దర్శకుడిగా అనురాగ్ బసును అనుకుంటున్నారట మేకర్స్.
తృప్తి డిమ్రికి చెక్
కానీ ఇప్పుడు టీ సిరీస్–వినేష్ ఫిల్మ్స్ ప్రతినిధుల మధ్యలో ‘ఆషికీ 3’ గురించి విభేదాలు తలెత్తాయని టాక్. దీంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరికొంత సమయం పడుతుందని బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్‌గా త్రిప్తీ దిమ్రీ (Tripti Dimri)ని కూడా తప్పించారని సమాచారం. ఈ ప్లేస్‌ను బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరీ (Sharvari) భర్తీ చేశారని భోగట్టా. తృప్తి డిమ్రిని తప్పించడానికి ప్రధాన కారణం తను యానిమల్ సినిమాలో బోల్డ్, ఇంటిమేట్ సీన్లలో నటించిడమేనని తెలుస్తోంది. దీంతో ఆషికి-3లో హీరోయిన్ పాత్రకు ఆమె సెట్ కాదని మేకర్స్ అభిప్రాయపడ్డారట. ఆ ఛాన్స్ ఇప్పుడు యంగ్ బ్యూటీ శార్వరీకి దక్కింది. ఆమె ఇప్పటి వరకు బాజీరావ్ మస్తానీ,ముంజ్యా,మహారాజ్,వేద వంటి మరో రెండు సినిమాలు మాత్రమే చేసింది.
మాజీ ముఖ్యమంత్రి మనవరాలికి ఛాన్స్
పదేళ్లుగా ఆమె ఇండస్ట్రీలో ఉన్నా పెద్దగా మెప్పించింది లేదు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా మూడు సినిమాలకు పనిచేశారు. ఇంతకీ శార్వరీ ఎవరో తెలుస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోకసభ స్పీకర్ మనోహర్ జోషి సొంత మనవరాలు. నేటి రాజకీయ నాయకుల కుటుంబాల నుంచి హీరోయిన్లుగా నటించేందుకు పెద్దగా ఎవరూ రారు. కానీ, శార్వరీ మాత్రం గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలోనే కొనసాగడం విశేషం. ‘ఆషికీ 3’లో శార్వరీ భాగం అయ్యారా? ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్‌కు వెళ్తుందా? అనే విష యాలపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి ఉండాల్సిందే.
ఈ ప్రాజెక్టు కోసం కార్తిక్ ఆర్యన్ సరసన నటించడానికి కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, రష్మిక మందన్న, ఆకాంక్ష శర్మ లాంటి హీరోయిన్ల పేర్లను మేకర్స్ పరిశీలించారు. కానీ ఆయనతో ఇంతకు ముందు కలిసి పనిచేయని సరికొత్త నటి కోసం వెతుకున్న సమయంలో శార్వరీ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే, చివర వరకు రేసులో ఆకాంక్ష పేరు కూడు ఉందని తెలుస్తోంది.
12వ ముఖ్యమంత్రిగా మనోహర్ జోషి
మహారాష్ట్రకు 12వ ముఖ్యమంత్రిగా మనోహర్ జోషి పనిచేశారు. గతేడాదిలో ఆయన మరణించారు. శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గానూ వ్యవహరించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో నమ్రత కుమార్తెనే ఈ శార్వరీ.
Comments
Please login to add a commentAdd a comment