కోల్ కతా: తాను అవార్డుల కోసం సినిమాలు చేయడం లేదని బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తెలిపారు. భారతీయ చిత్రాలు నిర్మించేది ఆస్కార్ లాంటి అవార్డుల దక్కించుకోవడం కోసం కాదన్నారు . ఈ సందర్భంగా ఐఎన్ఎస్ తో మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్డడించారు. అవార్దు అనేది..ప్రస్తుతం చేస్తున్న సినిమాకు ప్రామాణికం కాదన్నారు. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను నిర్మిస్తేనే బాగుంటదన్నారు. అవార్డుల కోసం మాత్రమే సినిమాలు చేయడం మంచి పద్దతి కాదనదే తన అభిప్రాయంగా తెలిపారు.
ఏ దర్శకుడైనా, రచయిత అయినా, నిర్మాత అయిన సినీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు నిర్మిస్తే బాగుంటుందన్నారు. తాను మాత్రం ప్రేక్షకులు కోసమే సినిమాలు తీస్తున్నానని తెలిపారు. 'మనం ఆస్కార్ అవార్డుల కోసం తీస్తున్నామా?లేక భారతీయ ప్రేక్షకులు కోసమా? ' అనేది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలన్నారు. తాను నిర్మాతగా చేసిన ఆషికి-2 భారీ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. తొలి వారంలో ఆ చిత్రం రూ.20 కోట్లు వసూలు చేయగా, నెలలోనే రూ.100 కోట్లు కలెక్షన్ లతో ప్రభంజన సృష్టించిందని తెలిపారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూ. 9 కోట్ల వ్యయంతో మహేశ్ భట్ నిర్మించారు.