Aashiqui 2
-
ఆయన నా బాయ్‌ఫ్రెండ్ అయితే బాగుంటుంది!
హిందీ విలన్ శక్తికపూర్ అంటే 1980ల్లో తెలియనివాళ్ళు లేరు. కానీ, ఈ తరానికి శక్తికపూర్‌ని పరిచయం చేయాలంటే, ‘శ్రద్ధాకపూర్ వాళ్ళ నాన్న’ అని చెప్పాలి. కొత్త తరం సెన్సేషనల్ హీరోయిన్స్ జాబితాలో శ్రద్ధాకపూర్ పేరూ ఉంటుంది. ‘ఆషికీ-2’, ‘హైదర్’ చిత్రాల ఫేమ్ అయిన శ్రద్ధ ప్రస్తుతం మణిరత్నం ‘ఓకే బంగారం’ హిందీ రీమేక్ ‘ఓకే జానూ’లో నటిస్తున్నారు. ఆమె పంచుకున్న మనోభావాల్లో కొన్ని ముచ్చట్లు... ► జీవితంలో నాకు నచ్చనిది ఏదీ లేదు. కానీ, ఒక్కోసారి జీవితం గురించి ఎక్కువ ఆలోచి స్తుంటా. అదే నన్ను బాధిస్తుంది. ఉదయమే నిద్రలేస్తా. ఆలస్యంగా పడుకోవాలంటే ఇరిటేషన్. అయామ్ నాట్ ఎట్ ఆల్ ఎ నైట్ పర్సన్. ► ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తే మనసు ప్రశాంతం. యాక్టింగ్ పక్కన పెడితే.. సింగింగ్, డ్యాన్సింగ్, ట్రావెలింగ్ ఇష్టం. చిన్న పిల్లలంటే మరీ ఇష్టం. పెళ్ల య్యాక ఎంతమంది పిల్లలు కావా లంటే, ఓ నంబర్‌తో సరిపెట్టలేను. ► సెలబ్రిటీల్లో మీ ఫ్యాంటసీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే బాగుంటుందంటే, ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ ఫేమ్, హాలీవుడ్ నటుడు జానీ డెప్ పేరు చెబుతా. చిన్నప్పటి నుంచి నేనూ, వరుణ్ ధావన్ గుడ్ ఫ్రెండ్స్. ఒకరి గురించి మరొకరికి తెలుసు. బాలీవుడ్లో నా బెస్ట్ ఫ్రెండ్ వరుణే. ► మహారాష్ట్ర తరహా హోమ్‌ఫుడ్ చాలా ఇష్టం. ఇంటి భోజనం ముందు స్టార్ హోటల్స్ గట్రా బలా దూర్. హోమ్ఫుడ్ని మించిన టేస్టీ ఫుడ్ ఏదీ ఉండదని నా ఫీలింగ్. బిర్యానీ కూడా ఇష్టమే. పానీ పూరీ, వడా పావ్ హ్యాపీగా లాగించేస్తా. ► ‘బాఘీ’లో యాక్షన్, ఫైట్స్ చేశా. ‘ఎబిసిడి 2’లో డ్యాన్స్ బాగా చేశా. ‘ఆషికీ2’లో రొమాంటిక్‌గా కనిపించా. మీరు నటించిన సినిమాల్లో ఏది ఇష్టమంటే చెప్పడం కష్టం. లవ్, యాక్షన్, కామెడీ, రొమాన్స్.. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించాలనుంది. హారర్ సినిమాలు చూడడ మంటే భయం. వాటిలో నటించగలనో? లేదో? తెలియదు. ఎవరైనా మంచి అవకాశం ఇస్తే హాలీవుడ్‌లోనూ నటించాలనుంది. ► ఐదారేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వయసు వరకూ పియానో వాయించా. మళ్లీ ఇప్పుడు ‘రాక్ ఆన్-2’ కోసం నా విద్య ప్రదర్శించా. ► నా పాటలన్నీ నాకిష్టమే. కానీ, ‘ఏక్ విలన్’లో పాడిన ‘గలియా..’ పాట ప్రత్యేకం. ఎందుకంటే, నేను పాడిన తొలి పాట అది. ► పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు, హలో చెప్పగానే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ.. నా పేరు అరుస్తూ.. చీర్స్ చెబుతుంటే చాలా బాగుంటుంది. వాళ్లంటే ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను. ఇండస్ట్రీలోకి వచ్చాక సంపాదించిన ఆస్తి జనం అభిమానమే. ► ‘అందాజ్ అప్నా అప్నా’ మళ్లీ మళ్లీ చూడాలని పించే సినిమా. ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. సల్మాన్, ఆమిర్‌ఖాన్‌లు చేసిన ఈ మల్టీస్టారర్‌లో మా నాన్నగారు శక్తి కపూర్ విలన్‌గా నటించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే, ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తుంటా. -
'హాఫ్ గర్ల్‌ఫ్రెండ్' శ్రద్ధా
బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కొత్త సంవత్సరాన్ని బిజీ బిజీగా ప్రారంభించింది. ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్న ఈ భామ, కొత్త ఏడాదిలో మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యింది. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో బాగీతో పాటు రాక్ ఆన్ సీక్వల్లో నటిస్తున్న శ్రద్ధా, ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో సౌత్ సూపర్ హిట్ సినిమా ఓకే బంగారం రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి అంగీకరించింది శ్రద్ధా. ఈ సినిమాతో పాటు తనకు ఆషికీ 2 సక్సెస్‌తో స్టార్ ఇమేజ్ అందించిన మోహిత్ సూరి దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాకు హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ, ఆషికీ 2లో కలిసి నటించిన ఆదిత్య రాయ్ కపూర్తోనే తెరను పంచుకోబోతుంది శ్రద్ధా కపూర్. -
సహజీవనం చేసేది వీళ్లిద్దరే!
ఆది, తార ప్రేమించుకుంటారు. ఇద్దరికీ పెళ్లి మీద నమ్మకం లేదు. కలిసి ఉన్నంత కాలం హాయిగా ఉండి, విడిపోదామనుకుంటారు. సహజీవనం సాగించి, చివరికి ఒకరిని ఒకరు విడిచి ఉండలేక పెళ్లితో ఒకటవుతారు. సహజీవనంపై ఈతరం ఆలోచనలకు అద్దంపట్టే కథాంశంతో అందమైన ప్రేమకథగా రూపొందిన ‘ఓకే బంగారం’ (తమిళంలో ‘ఓకే కన్మణి’) చిత్రకథ ఇది అని చూసినవాళ్లకి తెలిసే ఉంటుంది. దుల్కర్ సల్మాన్-నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దుల్కర్, నిత్యాలనే హిందీలో నటింపజేయాలనుకున్నారనే వార్త వినిపించింది. అయితే, ‘ఆషికి-2’ చిత్రంలో హాట్ కపుల్‌గా ఆన్‌స్క్రీన్ మీద రొమాన్స్ పండించేసిన ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ధాకపూర్ కూడా ఈ సహజీవనం సబ్జెక్టుకు బాగుంటారని చిత్రదర్శక-నిర్మాతలు షాద్-కరణ్ జోహార్‌కి అనిపించిందట. వాళ్లనే ఫైనలైజ్ చేశారు. విశేషం ఏంటంటే... గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘సఖి’ హిందీ రీమేక్ కూడా షాద్ దర్శకత్వంలో రూపొందింది. ‘‘మణిరత్నం-రచయిత గుల్జార్, ఏఆర్ రెహ్మాన్ కలిసి ఈ మళ్లీ ఈ ప్రేమకథను ఆవిష్కరించనున్నారు’’ అని కరణ్‌జోహార్ తెలిపారు. షాద్ దర్శకత్వం వహిస్తుండగా మణిరత్నం పేరుని కరణ్ ఎందుకు పేర్కొని ఉంటారు. బహుశా హిందీకి అనుగుణంగా చేసే మార్పుల విషయంలో మణిరత్నం సహకరిస్తారేమో! -
'ఎన్నిసార్లు చెప్పాలి.. మేము ఫ్రెండ్సేనని'
ముంబయి: తాను.. ఆదిత్య అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మంచి స్నేహితులుగానే ఉంటామని ఆష్కి-2 చిత్ర బాలీవుడ్ తార శ్రద్దాకపూర్ అంటోంది. ఆష్కి-2 చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు ఆదిత్యతో మరీ చనువుగా ఉంటోందని ఆ చిత్రంలో మాదిరిగానే వారిద్దరి నిజ జీవితంలో కూడా కెమిస్ట్రీ బాగా కుదిరి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఆ వదంతులే మరికాస్త ముందుకెళ్లి వారిద్దరిప్పుడు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారని రకరకాలు మీడియాలో వార్తలు పొక్కుతున్నాయి. ఇదే విషయంపై ప్రశ్నించిన మీడియాతో కాస్తంత చిర్రుబుర్రుగా మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను అదే విషయం మళ్లీ మళ్లీ చెప్తున్నాను. మేమెప్పుడు మంచి స్నేహితులమే. ఈ స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగిస్తాం. ఆష్కి-2 చిత్రం మాకు ఒక ప్రత్యేక అనుభవం అయితే మా ఇద్దరికే ఆ అనుభవం కాదు. దర్శకుడు మోహిత్ సూరి కూడా మాతో ఉన్నారు' అని చెప్పింది ఆ అమ్మడు. -
అది నా కెరీర్ కు ఒక మలుపు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో తన ప్రస్థానం కొనసాగించటానికి ‘ఆషికి-2’ సినిమా అనేది ఒక గొప్ప మలుపని ఆదిత్యారాయ్ కపూర్ అంటున్నాడు. 28 ఏళ్ల ఆదిత్య ‘లండన్ డ్రీమ్స్’, యాక్షన్ రీ ప్లే’, ‘గుజారిష్’ తదితర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ‘నాకు మొదటినుంచీ ఏదో ఒక రోజు కెరీర్లో మంచి మలుపు వస్తుందనే నమ్మకం ఉంది. అయితే ‘యే జవానీ దివానీ’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. మోహిత్ సూరి నేతృత్వంలో రూపొందించిన ‘ఆషికి-2’సినిమాలో ప్రధాన భూమిక నాదే. సోలో హీరో సినిమా అవకాశాలు రాలేదని నేను ఏనాడూ బాధపడలేదు. ఏ నిర్మాత అయినా వాణిజ్యపరంగా ఇబ్బందులు లేని కథానాయకుడు ఉండాలని కోరుకుంటాడు. అందువల్ల ఈ విషయంలో నేను ఎవరినీ నిందించదలుచుకోలేదు. అయితే అదృష్టం ‘ఆషికి-2’సినిమా రూపంలో వరించింది. చిన్న చిన్న పాత్రలు చేసే రోజుల్లో ఏనాడూ నిరాశకు గురికాలేదు. 2013లో విడుదలైన సినిమాల్లో ‘ఆషికి-2’ రికార్డు సృష్టించింది’ అని అన్నాడు. ఈ సినిమాలో ఆదిత్య... మద్యానికి అలవాటుపడిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. -
‘ఆషికి-2’ చేయడానికి ముందు భయపడ్డాను
గత ఏడాది హిందీలో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘ఆషికి 2’ ఒకటి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో సచిన్ జోషి, నాజియా జంటగా జయరవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేశ్ పునర్నిర్మించారు. నేడు సచిన్ జోషి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మనోభావాలు పంచుకుంటూ -‘‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. కొంత విరామం తర్వాత తెలుగులో చేసే సినిమా అద్భుతంగా ఉండాలని, ‘ఆషికి-2’ వంటి క్యూట్ లవ్‌స్టోరీ అయితే బాగుంటుందని ఈ రీమేక్‌లో నటించాలనుకున్నాను. ఇందులో హీరో ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. ముందు ఈ పాత్ర చేయడానికి కొంచెం భయపడ్డాను. తెలుగుకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా క్లయిమాక్స్ ఊహించని మలుపుతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే పాటలు పెద్దలు హిట్టయ్యాయి. ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం’’ అని చెప్పారు. ‘ఆషికి-2’ తమిళ రీమేక్‌లో నటించాలనుకుంటున్నాననీ, తెలుగులో ఓ హారర్, ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించనున్నానని సచిన్ తెలిపారు. అలాగే, థింక్ టాంక్ అనే సంస్థను ప్రారంభించి, లఘు చిత్రాలతో పాటు అన్ని రకాల సినిమాలు తీయాలని ఉందని వెల్లడించారు. -
సాధించాల్సింది ఎంతో ఉంది!
నటి శ్రద్ధాకపూర్ ముంబై: బాలీవుడ్లో అడుగుపెట్టి కనిపించింది మూడు సినిమాల్లోనే అయినా నటిగా మంచి మార్కులు కొట్టేసింది శ్రద్ధాకపూర్. అయితే ఇప్పటిదాకా తాను సాధించింది పెద్దగా ఏమీ లేదని, సాధించాల్సింది చాలా ఉందని, ‘ఆషికీ-2’ వంటి విజయాలెన్నింటినో అందుకోవాల్సి ఉందని చెబుతోంది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ఆషికీ-2’ ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో కథానాయకుడికి ఎంత పేరొచ్చిందో నాయికకూ అంతకంటే ఎక్కువ పేరే వచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే శ్రద్ధాకపూర్ అంటే ఎవరో అందరికీ తెలిసొచ్చింది. మిగతా రెండు సినిమాల్లో గ్లామర్ డాల్‌గానే కనిపించినా ఆషికీ-2లో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కడంతో రెచ్చిపోయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సరసన నటించే అవకాశం మొదటి సినిమా ‘తీన్ పత్తీ’తో దక్కడంతో ఇక తనకు తిరుగుండదని భావించింది. అయితే ఆ సినిమా కాస్తా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ప్రముఖ బ్యానర్ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో నటించింది. ‘లవ్ కా ది ఎండ్’ పేరుతో విడుదలైన ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దీంతో శ్రద్ధాకపూర్ కెరీ ర్ దాదాపుగా ముగిసిపోయిందనుకున్నారు సినీ విశ్లేషకులు. అయితే చిన్న హీరో, చిన్న బ్యానర్లో నటించే అవకాశం ‘ఆషికీ-2’ ద్వారా వచ్చింది. కాదనలేక చేసిన సినిమా కాస్తా కలెక్షన్లు కురిపించింది. ఇటు వసూళ్లతోపాటు బాలీవుడ్‌తో ఆమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. దీంతో శ్రద్ధాకపూర్ జాతకమే మారిపోయింది. అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయినా తొలి రెండు సినిమాల విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటున్నానని, కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నానని చెబుతోంది. మళ్లీ ‘ఆరోహి’ వంటి పాత్ర దక్కితే ప్రేక్షకులను మెప్పించేందుకు వందశాతం కష్టపడతానంటోంది. మరి ఈ అమ్మడు ఆశ తీరుతుందో లేదో చూడాలి. -
అద్భుతమైన ప్రేమకథ
బాలీవుడ్ హిట్ ‘ఆషికి 2’ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘నీ జతగా నేనుండాలి’. సచిన్, నజియా జంటగా నటిస్తున్నారు. కె.జయరవీంద్ర దర్శకుడు. బండ్ల గణేశ్ నిర్మాత. జీత్ గంగూలి, అంకిత్ తివారి, మిథున్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దిల్ రాజు ఆడియో సీడీని ఆవిష్కరించగా, శిరీష్, లక్ష్మణ్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు, బీవీఎస్ఎన్ ప్రసాద్, బీవీఎస్ రవి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ కథ మీదున్న ప్రేమతో సచిన్ ఈ సినిమా చేస్తున్నారని, బండ్ల గణేశ్ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని దర్శకుడు చెప్పారు. ‘‘ ‘ఆషికి 2’ రైట్స్ తీసుకున్న తర్వాత ఎవరైతే కరెక్ట్ అని ఆలోచిస్తున్న సమయంలో టక్కున సచిన్ గుర్తొచ్చారు. తెలుగులో తను నటించి చాలా కాలమైంది. పదేళ్లుగా నాకు మంచి మిత్రుడు తను. హిందీలో విజయం సాధించినట్లే, తెలుగులో కూడా ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంటుంది. జూలై మూడో వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అని బండ్ల గణేశ్ తెలిపారు. దర్శకుడు జయ రవీంద్ర అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఖర్చుకు వెనుకాడకుండా గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఇది అద్భుతమైన ప్రేమకథ అని సచిన్ చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. -
హిందీ చిత్రాన్ని మించేలా...
హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషికీ 2’ తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె. జయ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సచిన్, నజియా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ - ‘‘హిందీ ‘ఆషికీ 2’కి ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాని మించేలా ఈ సినిమా ఉండేట్లు దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ‘ఎవడు’లోని ‘నీ జతగా నేనుండాలి...’ పాటే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టాం. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కాబట్టి, ఈ టైటిలే బాగుంటుంది. నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లో షెడ్యూల్ పూర్తి చేసి, 16న పోలండ్ వెళ్లి అక్కడ ఓ పాట, ఫైట్ చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుంది’’ అని చెప్పారు. సచిన్, నజియా సహజమైన నటన కనబరుస్తున్నారని, హిందీ సినిమాని మించే స్థాయిలో ఉండాలనే పట్టుదలతో చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. సచిన్ మాట్లాడుతూ - ‘‘మాతృక కన్నా ఈ సినిమా బాగా వస్తోంది. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రానికి జీత్ గంగూలి, మిథున్, అంకిత్ మంచి పాటలు స్వరపరిచారు’’ అన్నారు. తెలుగులో తనకిది తొలి చిత్రమని నజియా తెలిపారు. -
బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీకి బెయిల్!
ముంబై: మాజీ ప్రియురాలిపై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీకి ముంబైలోని స్థానిక సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తును పమర్పించాం. శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలవుతారు అని అంకిత్ తరపు న్యాయవాది నీరజ్ గుప్తా వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుపై అత్యాచారం కేసులో మే 8 తేదిన అంకిత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి మే 12 తేది వరకు పోలీస్ కస్టడీ విధించారు. ఆతర్వాత అంకిత్ కు మే 26 తేది వరకు జుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో అంకిత్ తివారీ సోదరుడు కూడ అరెస్టయ్యాడు. ఆషికీ-2 చిత్రంలోని సున్ రహ హై తు అనే పాటతో సంగీత అభిమానుల ఆదరణను పొందాడు. -
రేప్ కేసులో బాలీవుడ్ సింగర్ అరెస్ట్!
ముంబై: ఆషికీ-2 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ రేప్ కేసులో అరెస్టయ్యాడు. 28 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై అంకిత్ తివారీ ఆయన సోదరుడు అంకుర్ తివారీ లను వెర్సోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అకింత్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆయన సోదరుడు తనను చంపుతానని బెదిరించారని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో అంకిత్, అంకుర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దికాలంగా పెళ్లి చేసుకుంటానని చెబుతూ ఓ మహిళను నమ్మించి.. ప్రస్తుతం అంకిత్ మనసు మార్చకున్నట్టు ముంబైకి చెందిన ఓ దిన పత్రిక కథనంలో వెల్లడించింది. తన స్నేహితురాలితో అంకిత్ తో పరిచయమైందని, అప్పటి నుంచి తనతో అంకిత్ క్లోజ్ గా ఉంటున్నారని బాధితురాలు తెలిపారు. -
ఆ గొంతు నిండా అమృతమే!
'నిను చూడనీ.. కనులెందుకు' అంటూ మెలోడియస్గా పాడినా, 'సై అంది నానో సయ్యందిరా' అంటూ మత్తు ఒలికించినా, 'హే నాయక్.. తూహై సుఖ్దాయక్' అంటూ హుషారెత్తించేలా పాడినా అవన్నీ అచ్చతెలుగు అమ్మాయి పాడినట్లే ఉంటాయి. కానీ, వీటితో పాటు ఎప్పుడో 2002 నుంచే తెలుగు పాటలు కూడా పాడిన ఉత్తరాది గాయని.. శ్రేయా ఘోషల్. మార్చి 12 బుధవారం ఆమె 30వ పుట్టిన రోజు. అచ్చంగా అమృతాన్ని గొంతులో పోసుకుందా అన్నట్లుగా పాడే ఆమె పాటలను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. తాజాగా ఆషికీ 2 చిత్రంలో ఆమె పాడిన 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' పాట అద్భుతమైన హిట్ అయింది. శ్రేయా ఘోషల్ తన పుట్టిన రోజు సందర్భంగా సినిమాలతో సంబంధం లేని 'హమ్నషీ' అనే గజల్ ఆల్బం విడుదల చేసింది. సినిమాలకు సంబంధం లేకుండా కూడా చేయగలిగినందుకు సంతోషంగా ఉందని చెప్పింది. తాను ఎప్పటినుంచో గజల్స్ అభిమానినని, అయితే అలా చేయగలనని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని శ్రేయా తెలిపింది. ఇకమీదట మరికొన్ని ఆధ్యాత్మిక ఆల్బంలు కూడా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఉర్దూ కవిత్వం సుమధురంగా ఉంటుందని, సినిమాల్లో ఆ అనుభవం పొరపాటున కూడా రాదని చెప్పింది. వాస్తవానికి శ్రేయాఘోషల్ బెంగాలీ అయినా.. ఆమె ఎక్కువగా హిందీ, ఉర్దూ పాటలే పాడింది. తాను బెంగాలీ అయినా, రాజస్థాన్‌లో పెరగడం వల్ల హిందీ బాగా వచ్చిందని చెప్పింది. -
ఆషికి 2 తెలుగు రీమేక్‌లో సచిన్ జోషి
హిందీలో సంచలన విజయం సాధించిన మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం 'ఆషికి 2'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తన సొంత వైకింగ్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బండ్ల గణేశ్‌తో కలిసి సచిన్ జోషి ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తున్నారు. 'మౌనమేలనోయి', 'ఒరేయ్ పండు' లాంటి చిత్రాల్లో హీరోగా నటించిన బాలీవుడ్ హీరో సచిన్ జోషి ఈ తెలుగు చిత్రంలో హీరోగా చేయబోతున్నాడు. అయితే ఈ తెలుగు సినిమాకు ఇంకా పేరు మాత్రం నిర్ణయించలేదు. ''ఆషికి 2 తెలుగు వెర్షన్లో నటించడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు బండ్ల గణేశ్‌కు కృతజ్ఞతలు. నువ్వు నిజమైన స్నేహితుడివి'' అని సచిన్ తన ట్విట్టర్ పేజీలో రాశాడు. బండ్ల గణేశ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. తాను, సచిన్ కలిసి ఈ ప్రాజెక్టు చేస్తున్నామని, తాను కేవలం నిర్మాణ పర్యవేక్షణ మాత్రమే చూసుకుంటానని, సచిన్ తన సొంత బ్యానర్ మీదే ఈ సినిమా తీస్తున్నాడని ఆయన చెప్పారు. మిగిలిన నటీనటులను ఇంకా నిర్ధారించాల్సి ఉందని, ఆ తర్వాతే ఈ ప్రాజెక్టు సెట్ మీదకు వెళ్తుందని అంటున్నారు. 'ఆజాన్', 'ముంబై మిర్రర్' లాంటి హిందీ చిత్రాలతో పాటు సన్నీ లియోన్ ఇటీవల నటించిన 'జాక్‌పాట్' చిత్రంలోనూ సచిన్ జోషి నటించాడు. ఇది బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. -
ఈ యేటి మేటి చిత్రం.. ఆషికీ 2
హిందీలో అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలేవో తెలుసా? దీనికి ప్రమాణాలేంటని అనుకుంటున్నారా? వీక్షకులు గూగుల్‌లో ఎక్కువగా ఏయే సినిమాలను సెర్చ్ చేశారన్నదే ఇందుకు అతిపెద్ద ప్రమాణం. దాని ప్రకారం చూసుకుంటే, అగ్రస్థానంలో 'ఆషికీ 2' నిలిచింది. ఇది రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. ఇందులో ప్రధానంగా 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' అంటూ వచ్చే మొదటిపాట యూట్యూబ్‌లో ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తోంది. వివిధ రకాలుగా దీన్ని ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, ముఖేష్ భట్ నిర్మించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్ 3, ధూమ్ 3, హిమ్మత్వాలా, రేస్ 2, ఏబీసీడీ, భాగ్ మిల్కా భాగ్, దబాంగ్ 2, మద్రాస్ కేఫ్ నిలిచాయి. -
ఈ యేటి మేటి చిత్రం.. ఆషికీ 2
హిందీలో అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలేవో తెలుసా? దీనికి ప్రమాణాలేంటని అనుకుంటున్నారా? వీక్షకులు గూగుల్‌లో ఎక్కువగా ఏయే సినిమాలను సెర్చ్ చేశారన్నదే ఇందుకు అతిపెద్ద ప్రమాణం. దాని ప్రకారం చూసుకుంటే, అగ్రస్థానంలో 'ఆషికీ 2' నిలిచింది. ఇది రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. ఇందులో ప్రధానంగా 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' అంటూ వచ్చే మొదటిపాట యూట్యూబ్‌లో ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తోంది. వివిధ రకాలుగా దీన్ని ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, ముఖేష్ భట్ నిర్మించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్ 3, ధూమ్ 3, హిమ్మత్వాలా, రేస్ 2, ఏబీసీడీ, భాగ్ మిల్కా భాగ్, దబాంగ్ 2, మద్రాస్ కేఫ్ నిలిచాయి. -
ఆస్కార్ కోసం కాదు.. ప్రేక్షకుల కోసమే:మహేశ్ భట్
కోల్ కతా: తాను అవార్డుల కోసం సినిమాలు చేయడం లేదని బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తెలిపారు. భారతీయ చిత్రాలు నిర్మించేది ఆస్కార్ లాంటి అవార్డుల దక్కించుకోవడం కోసం కాదన్నారు . ఈ సందర్భంగా ఐఎన్ఎస్ తో మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్డడించారు. అవార్దు అనేది..ప్రస్తుతం చేస్తున్న సినిమాకు ప్రామాణికం కాదన్నారు. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను నిర్మిస్తేనే బాగుంటదన్నారు. అవార్డుల కోసం మాత్రమే సినిమాలు చేయడం మంచి పద్దతి కాదనదే తన అభిప్రాయంగా తెలిపారు. ఏ దర్శకుడైనా, రచయిత అయినా, నిర్మాత అయిన సినీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు నిర్మిస్తే బాగుంటుందన్నారు. తాను మాత్రం ప్రేక్షకులు కోసమే సినిమాలు తీస్తున్నానని తెలిపారు. 'మనం ఆస్కార్ అవార్డుల కోసం తీస్తున్నామా?లేక భారతీయ ప్రేక్షకులు కోసమా? ' అనేది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలన్నారు. తాను నిర్మాతగా చేసిన ఆషికి-2 భారీ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. తొలి వారంలో ఆ చిత్రం రూ.20 కోట్లు వసూలు చేయగా, నెలలోనే రూ.100 కోట్లు కలెక్షన్ లతో ప్రభంజన సృష్టించిందని తెలిపారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూ. 9 కోట్ల వ్యయంతో మహేశ్ భట్ నిర్మించారు. -
పోల్చుకోక తప్పదు : శ్రద్ధాకపూర్
న్యూఢిల్లీ: ఆషిఖి 2 సినిమా హిట్ కావడంతో బాలీవుడ్లో మంచి స్థానం దక్కినట్టు నటి శ్రద్ధాకపూర్ భావిస్తోంది. సమకాలీక నటులతో పోల్చుకోవడం తప్పనిసరని అనుకుంటున్న శ్రద్ధ...అందుకు కూడా సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. పరిశ్రమలో ఏ స్థానంలో ఉన్నామనే దానికంటే తన పనితీరును మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టాలనుకుం టోంది ఈ 24 ఏళ్ల ఈ అందాలభామ. ‘నాకు నచ్చినా నచ్చకపోయినా ఇతరులతో పోల్చుకోవడం అనివార్యం. అయితే నేను చేస్తున్న పనిపై దృష్టి పెట్టడమే ఉత్తమమనేది నా ఆలోచన. నటిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడమే భావించి చిన్ననాటి కలల నుంచి బయటనపడి ఇక్కడ ఉంటున్నా. ఇక వెనక్కి తిరిగి చూడదలుచుకోలేదు’ అంటూ తన మనోభావాలను మీడియాతో పంచుకుంది. గాయని అరోహి పాత్ర పోషించిన శ్రద్ధ... అందరి మనసులను కొల్లగొట్టింది. ఇకపై తన నటనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఎటువంటి పాత్రలోనైనా ఇమిడిపోయేవిధంగా ఎదగాలనే తపనతో ముందుకు సాగుతున్నానంది. ‘ఎటువంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నా. ఫలానా పాత్రే కావాలని అనుకోవడం లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయేవిధంగా నన్ను నేను మలుచుకుంటా. పరిశ్రమలో నాకంటూ ఒక స్థానం సంపాదించుకుంటా’ అని తెలిపింది. కాగా నటి శ్రీదేవిని, ఆమె పనితీరును శ్రద్ధ ఆదర్శంగా తీసుకుంది. కుటుంబసభ్యులు తనకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపింది. చదువుకు స్వస్తి పలకాలని అనుకున్నానని, అందువల్లనే వారు తనకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్నారంది. అమ్మే తనకు మంచి స్నేహితురాలని చెప్పింది. అందువల్ల ఏ విషయమైనా ఆమెతో పంచుకుంటానంది శక్తికపూర్, శివంగి కొల్హాపురి కూతురైన శ్రద్ధ.