పోల్చుకోక తప్పదు : శ్రద్ధాకపూర్
పోల్చుకోక తప్పదు : శ్రద్ధాకపూర్
Published Tue, Oct 1 2013 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: ఆషిఖి 2 సినిమా హిట్ కావడంతో బాలీవుడ్‌లో మంచి స్థానం దక్కినట్టు నటి శ్రద్ధాకపూర్ భావిస్తోంది. సమకాలీక నటులతో పోల్చుకోవడం తప్పనిసరని అనుకుంటున్న శ్రద్ధ...అందుకు కూడా సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. పరిశ్రమలో ఏ స్థానంలో ఉన్నామనే దానికంటే తన పనితీరును మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టాలనుకుం టోంది ఈ 24 ఏళ్ల ఈ అందాలభామ. ‘నాకు నచ్చినా నచ్చకపోయినా ఇతరులతో పోల్చుకోవడం అనివార్యం.
అయితే నేను చేస్తున్న పనిపై దృష్టి పెట్టడమే ఉత్తమమనేది నా ఆలోచన. నటిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడమే భావించి చిన్ననాటి కలల నుంచి బయటనపడి ఇక్కడ ఉంటున్నా. ఇక వెనక్కి తిరిగి చూడదలుచుకోలేదు’ అంటూ తన మనోభావాలను మీడియాతో పంచుకుంది. గాయని అరోహి పాత్ర పోషించిన శ్రద్ధ... అందరి మనసులను కొల్లగొట్టింది. ఇకపై తన నటనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఎటువంటి పాత్రలోనైనా ఇమిడిపోయేవిధంగా ఎదగాలనే తపనతో ముందుకు సాగుతున్నానంది. ‘ఎటువంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నా.
ఫలానా పాత్రే కావాలని అనుకోవడం లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయేవిధంగా నన్ను నేను మలుచుకుంటా. పరిశ్రమలో నాకంటూ ఒక స్థానం సంపాదించుకుంటా’ అని తెలిపింది. కాగా నటి శ్రీదేవిని, ఆమె పనితీరును శ్రద్ధ ఆదర్శంగా తీసుకుంది. కుటుంబసభ్యులు తనకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపింది. చదువుకు స్వస్తి పలకాలని అనుకున్నానని, అందువల్లనే వారు తనకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్నారంది. అమ్మే తనకు మంచి స్నేహితురాలని చెప్పింది. అందువల్ల ఏ విషయమైనా ఆమెతో పంచుకుంటానంది శక్తికపూర్, శివంగి కొల్హాపురి కూతురైన శ్రద్ధ.
Advertisement
Advertisement