ఆషికి 2 తెలుగు రీమేక్లో సచిన్ జోషి | Sachiin Joshi in Telugu remake of 'Aashiqui 2' | Sakshi
Sakshi News home page

ఆషికి 2 తెలుగు రీమేక్లో సచిన్ జోషి

Published Mon, Feb 10 2014 12:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

ఆషికి 2 తెలుగు రీమేక్లో సచిన్ జోషి

ఆషికి 2 తెలుగు రీమేక్లో సచిన్ జోషి

హిందీలో సంచలన విజయం సాధించిన మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం 'ఆషికి 2'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తన సొంత వైకింగ్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బండ్ల గణేశ్తో కలిసి సచిన్ జోషి ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తున్నారు. 'మౌనమేలనోయి', 'ఒరేయ్ పండు' లాంటి చిత్రాల్లో హీరోగా నటించిన బాలీవుడ్ హీరో సచిన్ జోషి ఈ తెలుగు చిత్రంలో హీరోగా చేయబోతున్నాడు. అయితే ఈ తెలుగు సినిమాకు ఇంకా పేరు మాత్రం నిర్ణయించలేదు. ''ఆషికి 2 తెలుగు వెర్షన్లో నటించడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు బండ్ల గణేశ్కు కృతజ్ఞతలు. నువ్వు నిజమైన స్నేహితుడివి'' అని సచిన్ తన ట్విట్టర్ పేజీలో రాశాడు.

బండ్ల గణేశ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. తాను, సచిన్ కలిసి ఈ ప్రాజెక్టు చేస్తున్నామని, తాను కేవలం నిర్మాణ పర్యవేక్షణ మాత్రమే చూసుకుంటానని, సచిన్ తన సొంత బ్యానర్ మీదే ఈ సినిమా తీస్తున్నాడని ఆయన చెప్పారు. మిగిలిన నటీనటులను ఇంకా నిర్ధారించాల్సి ఉందని, ఆ తర్వాతే ఈ ప్రాజెక్టు సెట్ మీదకు వెళ్తుందని అంటున్నారు. 'ఆజాన్', 'ముంబై మిర్రర్' లాంటి హిందీ చిత్రాలతో పాటు సన్నీ లియోన్ ఇటీవల నటించిన 'జాక్పాట్' చిత్రంలోనూ సచిన్ జోషి నటించాడు. ఇది బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement