హీరోయిన్ రెజీనా ఓసారి లైబ్రరీకి వెళ్లారు. అక్కడ వందల ఏళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే బుక్ చదివారు. ఆ బుక్‌లోని పాత్రలు దెయ్యాలుగా మారి రెజీనా ముందుకు వచ్చాయట. ఆ తర్వాత ఏం జరిగింది? దెయ్యాలు ఎవరిపై, ఎందుకు పగబట్టాయి? అనేది తెలుసుకోవాలంటే ‘కార్తీక’ చిత్రం చూడాల్సిందే. కాజల్ అగర్వాల్, రెజీనా, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో, రైజా విల్సన్, నోయిరికా కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’.
ఈ మేలో తమిళంలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘కార్తీక’ టైటిల్‌తో రిలీజ్ కానుంది. ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్థన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment