
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఉగాదికి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. కాజల్ అగర్వాల్, రాధికా శరత్‌కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’. ఈ చిత్రం గంగ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై తెలుగులో విడుదల కానుంది.
‘‘ఘోస్టీ’లో పోలీస్‌గా, సినిమా హీరోయిన్‌గా కాజల్ ద్విపాత్రాభినయం చేశారు. ఆత్మలకు, కాజల్ పాత్రలకు సంబంధం ఏంటి? అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. ఉగాదికి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.