శబరిమలైలో కమెడియన్‌ యోగిబాబు సినిమా ప్రారంభం | Yogi Babu Pramod Shetty Sannidhanam Po Movie Starts With Pooja | Sakshi
Sakshi News home page

శబరిమలైలో కమెడియన్‌ యోగిబాబు సినిమా ప్రారంభం

Published Thu, Jan 19 2023 11:53 AM | Last Updated on Thu, Jan 19 2023 11:55 AM

Yogi Babu Pramod Shetty Sannidhanam Po Movie Starts With Pooja - Sakshi

తమిళసినిమా: నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సన్నిదానం పో చిత్ర షూటింగ్‌కు శబరిమలైలో శ్రీకారం చుట్టారు. సర్వదా సినీ గ్యారేజ్, షీమోన్‌ క్రియేషన్స్‌ సంస్థల అధినేతలు మధుసూదన్, షబీర్‌ బదాన్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. యోగిబాబు, ప్రమోద్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ చిత్రానికి రాజీవ్‌ వైద్య దర్శకత్వం వహిస్తున్నారు.

అయ్యప్పమాల ధరించి శబరిమలైకి వెళ్లిన దర్శకుడు, నటి నయనతార భర్త విఘ్నేశ్‌శివన్‌ ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని క్లాప్‌ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. చిత్రం శబరిమలై నేపథ్యంలో రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. శబరిమలై సన్నిధానం, అక్కడ డోలీ మోసే వారు, సన్నిధానంలో ఏర్పాటు చేసిన పోస్టాఫీస్‌ వంటి పలు అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయని తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement