Rejishh Mithila Directorial With Yogi Babu Shooting Started Details Inside - Sakshi
Sakshi News home page

Rejishh Mithila: కమెడియన్‌ యోగిబాబు హీరోగా ఫాంటసీ కథా చిత్రం

Published Fri, Sep 2 2022 9:28 AM | Last Updated on Fri, Sep 2 2022 11:15 AM

Rajissh Midhila Directorial With Yogi Babu Shooting Started - Sakshi

నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటిస్తున్న ఫాంటసీ కథా చిత్రం యానై ముగత్తాన్‌. ప్రముఖ మలయాళ దర్శకుడు రెజెశ్‌ మిథిలా ఈ చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ ఇది వినోదభరితంగా సాగే ఫాంటసీ కథా చిత్రమని చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ సినిమాలో గణేశ్‌ అనే పాత్రలో యోగిబాబు నటిస్తున్నారని, అదే పేరుతో ఆటోడ్రైవర్‌గా నటుడు రమేష్‌ తిలక్‌ నటిస్తున్నారని చెప్పారు.

వీరిద్దరి జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయని, ఆ తరువాత జరిగే పరిణామాలే చిత్ర కథ అని తెలిపారు. ఇక వీళ్లు నివసిస్తున్న ఇంటి యజమానిగా నటి ఊర్వశి, పాన్‌ మసాల కొట్టు యజమానిగా నటుడు కరుణాకర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. ఈ సినిమాకు కార్తీ ఎస్‌.నాయర్‌ ఛాయాగ్రహణం, భారత్‌ శంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement