Janani Iyer
-
పాత్రలే దెయ్యాలైతే..!
కాజల్, రెజీనా, జననీ అయ్యర్ ముఖ్య తారలుగా నటించిన తమిళ చిత్రం ‘కరుంగాప్పియం’. డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించారు. వెంకట సాయి ఫిల్మ్స్ పతాకంపై ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్ధన్ ‘కార్తీక’ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ముత్యాల రాందాస్, టి. జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘జూలై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఇందులో ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించే క్రమంలో రెజీనా లైబ్రరీలో వందేళ్ల క్రితం నాటి కాటుక బొట్టు అనే బుక్ చదువుతుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పే బుక్ అది. అయితే అందులోని పాత్రల గురించి చదువుతున్నప్పుడు అవి దెయ్యాలుగా మారి ఆమె ముందుకు వస్తాయి. ఇక తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రను కాజల్ చేశారు. జనని పాత్ర కూడా అలరించే విధంగా ఉంటుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని డీకే అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
దెయ్యాలు పగబడితే...
హీరోయిన్ రెజీనా ఓసారి లైబ్రరీకి వెళ్లారు. అక్కడ వందల ఏళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే బుక్ చదివారు. ఆ బుక్‌లోని పాత్రలు దెయ్యాలుగా మారి రెజీనా ముందుకు వచ్చాయట. ఆ తర్వాత ఏం జరిగింది? దెయ్యాలు ఎవరిపై, ఎందుకు పగబట్టాయి? అనేది తెలుసుకోవాలంటే ‘కార్తీక’ చిత్రం చూడాల్సిందే. కాజల్ అగర్వాల్, రెజీనా, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో, రైజా విల్సన్, నోయిరికా కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ఈ మేలో తమిళంలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘కార్తీక’ టైటిల్‌తో రిలీజ్ కానుంది. ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్థన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఆ పుస్తకం చదువుతుండగా ఫోన్.. వెంటనే ఒప్పుకున్నా : నటి
సినిమాల్లో కథానాయికగా నటిస్తునే వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉన్న నటి జనని అయ్యర్. ఈమె తాజాగా తీర్థయాత్రకు సంబంధించిన ప్రచార చిత్రంలో నటించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ దేవుడు ఉన్నాడా? లేడా అన్నది మిరాకిల్ జరిగినప్పుడే ఫీల్ అవుతామని, తీర్థయాత్రలకు సంబంధించిన ప్రచార చిత్రంలో నటించే అవకాశం రావడం తనకు ఓ అద్భుతం అని పేర్కొన్నారు. తాను 10 రోజులు క్రితం సాయిబాబా పుస్తకం చదువుతూ ఉండగా దర్శకుడు ధర్మ నుంచి ఫోన్‌కాల్ వచ్చిందన్నారు. ఒక ప్రచార చిత్రంలో నటించాలని కోరారని, తాను మరో ఆలోచన లేకుండా అంగీకరించినట్లు తెలిపారు. ఇందులో నటించడం మంచి అనుభవం అన్నారు. దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ భారత్ గౌరవ్ పథకం పేరుతో తొలిసారిగా ప్రైవేటు సంస్థతో కలిసి చెన్నై నుంచి షిరిడీ వరకు ప్రతివారం తీర్థయాత్రల కంటూ ప్రత్యేక రైలును నిర్వహిస్తోంది. ఇది ఈ నెల 17న బయలుదేరి ఐదు రోజుల పాటు కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, సేలం, బెంగుళూరు నుంచి షిరిడి వరకు పయనిస్తూ భక్తులకు మంచి వసతులతో కూడిన దైవ దర్శనం కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు. -
గొడవ పెట్టుకుంటానని డైరెక్టర్‌ను బెదిరించా: హీరోయిన్
కోలీవుడ్ కథానాయిక జనని అయ్యర్ తాజాగా నటించిన చిత్రం 'కూర్మన్'. ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. అయితే ఇందులో అవకాశం అంత ఈజీగా ఏం రాలేదట. గొడవపడి మరీ ఛాన్స్ దక్కించుకుందట! ఈ విషయాన్ని జనని అయ్యర్ స్వయంగా మీడియాకు వెల్లడించింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'తెగిడి సినిమా నుంచి దర్శకుడు బ్రియాన్ బి.జార్జ్ బాగా తెలుసు. ఆయన దర్శకుడిగా సినిమా తీస్తే అందులో తనను హీరోయిన్గా తీసుకోవాలని, లేదంటే గొడవ పెట్టుకుంటానని హెచ్చరించాను. నేను సరదాగా అన్నాను, కానీ ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. అలా కూర్మన్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో నా పాత్ర నాకు మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టడమే కాకుండా కెరీర్‌ను మలుపు తిప్పేలా ఉంటుంది' అని జనని అయ్యర్ చెప్పుకొచ్చింది. -
ప్రేమించా..కానీ! : హీరోయిన్
ప్రేమించాను కానీ..! అంటోంది నటి జననీఅయ్యర్. 2009లోనే రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ నటిగా దశాబ్దానికి చేరువవుతోంది. అయితే బాలా దర్శకత్వంలో ఆర్యకు జంటగా నటించిన అవన్ ఇవన్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జననీఅయ్యర్ ఆ తరువాత పలు చిత్రాలు చేసినా ఇంకా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇటీవల బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో–2లో కూడా పాల్గొని పాపులర్ అయిన ఈ అమ్మడితో చిన్న భేటీ. నటిగా దశాబ్దానికి చేరువవుతున్నారు. సినిమాలో మీరు నేర్చుకున్నది. సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ వస్తుంది. అప్పుడు వారి శ్రమ, నిరంత కృషి తెలుస్తుంది. అప్పటి వరకూ ఓర్పుగా వేచి ఉండాలి. ఇదే నేను నేర్చుకుంది. ఎలాంటి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు? నాకు నప్పే కథా పాత్ర అయి ఉండాలి. గ్లామర్ పాత్రలకు నేను నప్పుతానో లేదో తెలియదు గానీ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయేలా మంచి బలమైన కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. చారిత్రక కథా చిత్రాల్లోనూ నటించాలనే ఆశ ఉంది. భూత కాలంలోకి ఎలాగూ వెళ్లలేం, అలాంటి కథా చిత్రాల్లో నటించి ఆ అనుభవాన్ని పొందాలనుంది. జోదా అక్బర్ లాంటి రాణీ పాత్రల్లో నటించే అవకాశం వస్తే నటించాలని ఆశగా ఉంది. సినిమాను వదిలి పోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి ఆలోచనే రాలేదు. అయితే ఇంజినీరింగ్ చదివి నటివయ్యావెందుకని ఇంట్లో అనేవారు. అయితే నాకు నటన అంటే ఆసక్తి. వయసు మళ్లిన తరువాత కూడా ఈ రంగంలోనే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం మీటూ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. దీని గురించి మీ స్పందన? జ: లైంగిక వేధింపులు అన్ని రంగాల్లోనూ జరుగుతున్నాయి. అయితే వాటి గురించి ఇప్పుడు చాలా మంది ధైర్యంగా మాట్లాడుతున్నారు. నాకూ సంతోషంగా ఉంది. ఇదే సరైన సమయం. ఇప్పుడు మాట్లాడకపోతే చాలా విషయాలు వెలుగు చూడవు. మీకు నచ్చిన విషయం? ఇళయరాజా సంగీతాన్ని వింటూ ఒంటరిగా కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లటం ఇష్టం మీకు నచ్చిన హీరో? నాకు అజిత్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైన దర్శకుడు? బాలా, మణిరత్నం మీ స్లిమ్ శరీర రహస్యం? పెద్దగా శిక్షణ అంటూ ఏమీ తీసుకోను. ఇంకా చెప్పాలంటే కొవ్వు పదార్థాలను కూడా తినేస్తాను. అయినా బరువు పెరగను. అది నాకు దైవం ఇచ్చిన వరం. మీకు అజిత్, విజయ్‌లతో నటించే అవకాశం ఒకేసారి వస్తే? విజయ్ అభిమానులు క్షమించాలి. నేను అజిత్ చిత్రంలోనే నటిస్తాను. ప్రేమలో పడ్డారా? నేనూ ప్రేమించాను.అయితే ఇప్పుడెవరూ లేరు రాజకీయాల్లోకి వస్తారా? రాజకీయాలకు నేను చాలా దూరం. -
‘ఆయనతో నటించాలని ఉంది’
సాక్షి, సినిమా: సినిమా రంగంలో ఇవాళ ఒక్క భాషలో నటిస్తూ పోతే చాలదు. మార్కెట్‌ను పెంచుకోవాలంటే పలు భాషా చిత్రాల్లో నటించాలి. నయనతార నుంచి సమంత, అమలాపాల్, సాయిపల్లవిల వరకూ మాతృభాషల నుంచి ఇతర భాషలోకి తమ మార్కెట్‌ను విస్తరించుకుంటూ కథానాయికలుగా రాణిస్తున్నారు. అదే విధంగా నటి జననీ అయ్యర్ నటిగా తన పరిధిని పెంచుకోవాలని ఆశ పడుతోంది. అచ్చ తమిళ అమ్మాయి అయిన ఈ బ్యూటీ అవన్ ఇవన్, తెగిడి వంటి చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నటించిన పాగన్ వంటి కొన్ని చిత్రాలు నిరాశపరచడంతో కాస్త వెనుక పడినా తాజాగా బెలూన్ చిత్రంతో తన సత్తా చాటుకుంటోంది. ఇందులో మరో నాయకిగా అంజిలి నటించిందన్నది గమనార్హం. నటుడు జై హీరోగా నటించిన ఈ లవ్ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా నటి జననీ అయ్యర్‌తో చిట్‌చాట్.. మీరూ మోడలింగ్ రంగం నుంచి వచ్చిన నటేననుకుంటా? అవును. చెన్నైలో పుట్టి పెరిగి చదివిన నేను 150 వరకూ వాణిజ్య ప్రకటనల్లో నటించాను. అయితే సినిమాల్లో నటించాలన్నది నాకు ఫ్యాషన్. అందుకే తొలుత తిరు తిరు తురు తురు చిత్రంలో మోడల్‌గానే చిన్న పాత్రలో నటించాను. ఆ తరువాత గౌతమ్‌మీనన్ దర్శకత్వంలోనూ విన్నైతాండి వరువాయా చిత్రంలో సహాయదర్శకురాలిగా నటించాను. హీరోయిన్గా నా మొదటి చిత్రం బాలా దర్శకత్వం వహించిన అవన్ ఇవన్. అలా కథానాయకిగా నా ప్రస్థావన మొదలైంది. బాలా వంటి సంచన దర్శకుడి చిత్రంలో నటించినా మీరింకా సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారే? సక్సెస్ కాలేదనడం కర్టెక్ కాదు. కథానాయకిగా నా తొలి చిత్రం అవన్ ఇవన్ చిత్రంతోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్నాను. అదే విధంగా తెగిడి చిత్రం మంచి విజయాన్ని అందించింది. అయితే మీరన్నట్లు ఆ తరువాత నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో మంచి పాత్ర అనిపిస్తేనే నటించాలని నిర్ణయించుకున్నాను. మలయాళంలోనూ నటిస్తున్నట్లున్నారు? అవును అక్కడ 3 డాట్స్ అనే చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యాను. అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి .ప్రస్తుతం హ్యాపీబర్త్‌డే చిత్రంలో నటిస్తున్నాను. మరి టాలీవుడ్లో నటించాలన్న ఆసక్తి లేదా? నిజం చెప్పాలంటే తెలుగు చిత్రాలంటే నాకు చాలా ఇష్టం.అన్ని చిత్రాలు చూస్తాను.తెలుగులో నటించాలన్న ఆకాంక్ష చాలానే ఉంది.అయితే అక్కడ నాకు మేనేజర్ లేరు. తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం? ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు? పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలా మంది హీరోలంటే ఇష్టం.ముఖ్యంగా మహేశ్‌బాబుకు నేను అభిమానిని. ఆయనతో నటించాలన్న కోరిక ఉంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను. బెలూన్ చిత్రం గురించి? బెలూన్ చిత్రంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.ఇందులో 1980లో జరిగే కథాభాగంలో నేను నటించాను. ఈ పాత్ర కోసం వేష, భాషాపరంగా నన్ను నేను చాలా మార్చుకున్నాను. కరెక్ట్‌గా చెప్పాలంటే అప్పటి యువతిగా మారి నటించాననే చెప్పాలి. ఈ చిత్రంతో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్న లక్ష్యంగా నటించాను. బెలూన్ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ అనువాద చిత్రంగా విడుదల కానుంది కాబట్టి తెలుగులోనూ నాకిది మంచి ఎంట్రీ అవుతుందనే నమ్మకం ఉంది. -
మూండ్రాంపిరైలో శ్రీదేవిలా నటించా!
తమిళసినిమా: మూండ్రాం పిరై చిత్రంలో శ్రీదేవిలా నటించానని యువ నటి జననీఅయ్యర్ పేర్కొంది. జై, అంజలి జంటగా నటిస్తున్న తాజా చిత్రం బెలూన్. ఇందులో మరో కథానాయకిగా జననీఅయ్యర్ నటిస్తోంది. 70ఎంఎం పతాకంపై సినీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు కథానాయికల్లో ఒకరుగా నటించిన నటి జననీఅయ్యర్ తన పాత్ర గురించి తెలుపుతూ 1980లో వచ్చిన మూండ్రాంపిరై చిత్రాన్ని, అందులో నటి శ్రీదేవి గతాన్ని మరచిపోయి అమాయకపు అమ్మాయిగా నటించిన పాత్రను ఎప్పటికీ మరచిపోలేమన్నారు. అయితే శ్రీదేవిలా నటించడం ఎవరికీ సాధ్యం కాదని, బెలూన్ చిత్రంలో తన పాత్ర ఆ తరహాలో ఉంటుందని చెప్పింది. శ్రీదేవి సాటిగా నటించడం సాధ్యం కాదని చిత్ర దర్శకుడు తాను, ఇతర చిత్ర యూనిట్ భావించామని, అయితే ఆ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు శిరిష్ తనను నటింపజేశారని చెప్పింది. ఇందులో తన నటన తనకే ఆశ్చర్యం కలిగించిందని అంది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని అంజలి వ్యక్తం చేసింది. తాను ఇప్పటి వరకూ చేసిన పాత్రల్లో ఈ తరహా పాత్రను చేయలేదని, తనకు బెలూన్ చిత్రం ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. ఈ చిత్ర విడుదల హక్కుల్ని ఆరా సినిమా సంస్థ కొనుకోలు చేయడం విశేషం. -
జననీ విత్ ఫైవ్
మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న నటి జననీఅయ్యర్. ఆ మధ్య తమిళంలో అవన్ ఇవన్ లాంటి చిత్రాలతో మంచి నటనను ప్రదర్శించి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడుకు తెగిడి చిత్రం మంచి విజయాన్ని అందించింది. అయితే మలయాళంలో బిజీ కావడంతో కోలీవుడ్‌కు చిన్న గ్యాప్ వచ్చింది. తాజాగా ఐదు చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఐదు చిత్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉందంటున్న జననీ అయ్యర్ నటించిన అదేకంగళ్ చిత్రం ముందుగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీని గురించి జననీ తెలుపుతూ అదేకంగళ్ చిత్రంలో సాధన అనే యువతిగా పాత్రికేయురాలి పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. నటి శివద సేల్స్‌గర్ల్ పాత్రలో మరో హీరోయిన్గా నటిస్తున్నారని, కలైయరసన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఉంటుందన్నారు. సంగీతదర్శకుడు జిబ్రాన్ సంగీతం అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయన సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. నవ దర్శకుడు రోహిన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని, ఆయనకిది తొలి చిత్రం అయినా మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అన్నారు. అదేకంగళ్ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. కాగా ఈ బ్యూటీ జై కు జంటగా బెలూన్, అశ్విన్ కనుమను సరసన తొలైకాచ్చి, రమీజ్రాజాతో విధి మది ఉల్టా చిత్రాల్లో నటిస్తున్నారు. -
జననీ విత్ ఫైవ్
మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న నటి జననీఅయ్యర్. ఆ మధ్య తమిళంలో అవన్ ఇవన్ లాంటి చిత్రాలతో మంచి నటనను ప్రదర్శించి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడుకు తెగిడి చిత్రం మంచి విజయాన్ని అందించింది. అయితే మలయాళంలో బిజీ కావడంతో కోలీవుడ్‌కు చిన్న గ్యాప్ వచ్చింది. తాజాగా ఐదు చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఐదు చిత్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉందంటున్న జననీ అయ్యర్ నటించిన అదేకంగళ్ చిత్రం ముందుగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీని గురించి జననీ తెలుపుతూ అదేకంగళ్ చిత్రంలో సాధన అనే యువతిగా పాత్రికేయురాలి పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. నటి శివద సేల్స్‌గర్ల్ పాత్రలో మరో హీరోయిన్ గా నటిస్తున్నారని, కలైయరసన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఉంటుందన్నారు. సంగీతదర్శకుడు జిబ్రాన్ సంగీతం అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయన సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. నవ దర్శకుడు రోహిన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని, ఆయనకిది తొలి చిత్రం అయినా మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అన్నారు. అదేకంగళ్ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. కాగా ఈ బ్యూటీ జై కు జంటగా బెలూన్ , అశ్విన్ కనుమను సరసన తొలైకాచ్చి, రమీజ్రాజాతో విధి మది ఉల్టా చిత్రాల్లో నటిస్తున్నారు. -
హత్యలు చేస్తోందెవరు?
విల్లా ఫేం అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేశ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘తెగిడి’. ఈ చిత్రం ‘భద్రమ్’ పేరుతో ఈ నెల 21న తెలుగులో విడుదల కానుంది. శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిలిమ్ మేకర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళనాట గొప్ప విజయం సాధించిన సినిమా ఇదని రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘‘వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు? అనే ఉత్కంఠ భరిత కథాంశంతో ఈ చిత్రం రూపొందింది’’ అని శ్రేయాస్ శ్రీను తెలిపారు. ఇంకా సహ నిర్మాత డి.ఉమాదేవి, ఎస్కేఎన్లతోపాటు మల్టీ డైమన్షన్ వాసు, టి.ఆర్.సత్యనారాయణ, దశరథరామిరెడ్ది తదితరులు మాట్లాడారు. -
భద్రమ్ మూవీ ప్రేస్ మీట్
-
ఉత్కంఠ రేపే భద్రమ్
‘‘వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఒకటే ఉత్కంఠ. క్లైమాక్స్ దాకా కారణం అర్థం కాదు. ఊహించని మిస్టరీ. అందుకే కథకు తగ్గట్టు ‘భద్రమ్’ అని టైటిల్ పెట్టాం. కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్పడమే ఈ టైటిల్‌కి అర్థం’’ అని నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ అన్నారు. అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘తేగిడి’. ఈ చిత్రాన్ని ‘భద్రమ్’ పేరుతో పుష్యమి ఫిలింమేకర్స్ బి.శ్రీనివాసరెడ్డితో కలిసి శ్రేయాస్ శ్రీను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ -‘‘సాంకేతికంగా సినిమా ఉన్నంతంగా ఉంటుంది. ప్రసన్న నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు. -
నేనెందుకు అక్కడికి వెళ్లాలి?
ప్రతి మనిషికి కలలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాధించడానికి ప్రేమ, పెళ్లి వంటివి ప్రతిబంధకాలు కాకూడదని భావిస్తున్నాను అంటోంది యువ కథా నాయకి జననీ అయ్యర్. అవన్ ఇవన్, పాగన్ వంటి చిత్రాల్లో నటించిన ఈ భామకు కోలీవుడ్‌లో సరైన మార్కెట్ లభించలేదు. అయితే మాలీవుడ్ మాత్రం జననీ అయ్యర్‌ను బాగానే ఆదరిస్తోంది. ప్రస్తుతం అక్కడ నాలుగు చిత్రాలలో ఏక ధాటిగా నటించేస్తోంది. తమిళంలో తెగిడి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ బ్యూటీతో మినీ ఇంటర్వ్యూ. మీకు అంతగా అవకాశాలు రాలేదెందుకు? నాకు అర్థం కాని విషయం ఇదే. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నటి. ఎవరి వద్దకైనా వెళ్లి అవకాశాలివ్వమని అడగలేదు. సినిమా నాకు కొత్త కావడంతో ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియలేదు. అవకాశాలు రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. అయితే ఇకపై గ్యాప్ లేకుండా జాగ్రత్త పడతాను. ప్రస్తుతం తెగిడి చిత్రంలో నటించాను. ఇందులో ఐటిలో ఉద్యోగం చేసేయువతి పాత్ర ధరించాను. తదుపరి తిరుకుమరన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో నటించనున్నాను. పరదేశి చిత్రంలో మీకు రావాల్సిన చాన్స్ వేదిక ఎగరేసుకుపోయారటగా? ఇది అసత్య ప్రచారం. పరదేశిలో నాకు నప్పే పాత్ర అయితే దర్శకుడు చాలా ఖచ్చితంగా నన్ను పిలిచేవారనే నమ్మకం ఉంది. నిజానికి ఆ చిత్ర హీరోయిన్ల పరిశీలనలో నా పేరు లేదు. మలయాళంలో ఏకకాలంలో నాలుగు చిత్రాలు చేస్తున్నారట. తికమక పడే అవకాశం లేదా? అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఒక్కో చిత్రం లోను, విభిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. సుధార చిత్రం లో కోల్కత్తా ముస్లిం యువతి పాత్రను చేస్తున్నాను. సెవెం త్ డే చిత్రంలో జెర్సీ అనే క్రిష్టియన్ యువతిగా నటిస్తున్నాను. ఎడిసన్ ఫోటో చిత్రంలో బ్రాహ్మణ యువతి గా ను, మోస్ఇల్ల కుదిరై మీనగళ్ చిత్రంలో పోస్టాఫీసులో పని చేసే అమ్మాయిగాను నటిస్తున్నాను. ఇలా ఒకదాని కొకటి సంబంధం లేని పాత్రలు కావడంతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నటిస్తున్నాను. మాలీవుడ్ హీరోయిన్లు కోలీవుడ్‌పై కన్నేస్తుంటే మీరు మాలీవుడ్‌పై దృష్టి సారించారేమిటి? నాకు అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. చేస్తున్నాను. అంతేకాని ఎలాంటి ప్లాన్ లేదు. ఇక్కడ మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను. మలయాళ ప్రేక్షకులు ఎలాంటి పాత్రలు మీ నుంచి ఆశిస్తున్నారు? మలయాళంలో గ్లామర్‌తో పని లేదు. ఫెర్మార్మెన్స్ నటిమణులే వారికి ఇష్టం. నేను నటించిన ఒక్క చిత్రమే మలయాళంలో విడుదలయ్యింది. మరో నాలుగు చిత్రాలు ఈ ఏడాది తెరపైకి రానున్నాయి. కాబట్టి ఈ ఏడాది చివరిలో మీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలను. కోలీవుడ్‌లో సరైన ఆదరణ లేకపోవడంలో మాలీవుడ్‌లో మకాం మార్చారట? నేను చెన్నై అమ్మాయిని. పుట్టి పెరిగింది ఇక్కడే. మాకు ఒక ఇల్లు ఇక్కడే ఉంది. అలాంటిది నేనెందుకు కేరళకు వెళ్లాలి? తమిళంలో అవకాశాలు లేకపోవడంతో కేరళకు మకాం మార్చినట్లు ఎవరో అసత్యపు ప్రచారం చేస్తున్నారు. ఇది నా వరకు రావడంతో చాలా అప్సెట్ అయ్యా ను. ఒకరి గురించి నెగిటివ్ ప్రచారం చేయడంతో అలాంటివారికి కలిగే ఆనందం ఏమిటో? ఇప్పుడు కూడా నేను చెప్పేదొక్కటే. ఏ భాషలో అవకాశాలు లభించినా నేను చెన్నైను విడిచి వెళ్లను. ఇక్కడ నుంచి కేరళకు రోజుకు నాలుగు రైళ్లు, నాలుగు ప్లైట్లు ఉన్నాయి వెళ్లి రావడానికి. మోడలింగ్ చేశారా? చిత్రాలు చేస్తున్నారు. వీటిలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఏ రంగంలో ఉన్నాయంటారు? నేను చదువుకుంటున్న సమయంలోనే పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేశాను. వాణిజ్య ప్రకటనల్లోనూ నటిం చాను. ఈ రెండింటిలో సంతోషమే ప్రధానం. సినిమాల్లో ఏడవాల్సి ఉంటుంది, భయపడాల్సి ఉంటుంది. యువ నటుడితో ప్రేమాయణం అంటూ వస్తున్న వదంతుల గురించి? నటనను వ్యక్తిగత జీవితం లో మిక్స్ చేయలేను. ఇప్పటి వరకు ఎవరిపైనా ప్రేమ పుట్టింది లేదు. సినిమాలో చాలా సాధిం చాల్సి ఉంది. అందుకు ప్రేమ, పెళ్లి వంటివి ఆటంకాలు కావడం నా కిష్టం లేదు. -
భద్రమ్ మూవీ పోస్టర్స్