నేనెందుకు అక్కడికి వెళ్లాలి?
ప్రతి మనిషికి కలలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాధించడానికి ప్రేమ, పెళ్లి వంటివి ప్రతిబంధకాలు కాకూడదని భావిస్తున్నాను అంటోంది యువ కథా నాయకి జననీ అయ్యర్. అవన్ ఇవన్, పాగన్ వంటి చిత్రాల్లో నటించిన ఈ భామకు కోలీవుడ్‌లో సరైన మార్కెట్ లభించలేదు. అయితే మాలీవుడ్ మాత్రం జననీ అయ్యర్‌ను బాగానే ఆదరిస్తోంది. ప్రస్తుతం అక్కడ నాలుగు చిత్రాలలో ఏక ధాటిగా నటించేస్తోంది. తమిళంలో తెగిడి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ బ్యూటీతో మినీ ఇంటర్వ్యూ.
మీకు అంతగా అవకాశాలు రాలేదెందుకు?
నాకు అర్థం కాని విషయం ఇదే. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నటి. ఎవరి వద్దకైనా వెళ్లి అవకాశాలివ్వమని అడగలేదు. సినిమా నాకు కొత్త కావడంతో ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియలేదు. అవకాశాలు రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. అయితే ఇకపై గ్యాప్ లేకుండా జాగ్రత్త పడతాను. ప్రస్తుతం తెగిడి చిత్రంలో నటించాను. ఇందులో ఐటిలో ఉద్యోగం చేసేయువతి పాత్ర ధరించాను. తదుపరి తిరుకుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో నటించనున్నాను.
పరదేశి చిత్రంలో మీకు రావాల్సిన చాన్స్ వేదిక ఎగరేసుకుపోయారటగా?
ఇది అసత్య ప్రచారం. పరదేశిలో నాకు నప్పే పాత్ర అయితే దర్శకుడు చాలా ఖచ్చితంగా నన్ను పిలిచేవారనే నమ్మకం ఉంది. నిజానికి ఆ చిత్ర హీరోయిన్ల పరిశీలనలో నా పేరు లేదు.
మలయాళంలో ఏకకాలంలో నాలుగు చిత్రాలు చేస్తున్నారట. తికమక పడే అవకాశం లేదా?
అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఒక్కో చిత్రం లోను, విభిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. సుధార చిత్రం లో కోల్‌కత్తా ముస్లిం యువతి పాత్రను చేస్తున్నాను. సెవెం త్ డే చిత్రంలో జెర్సీ అనే క్రిష్టియన్ యువతిగా నటిస్తున్నాను. ఎడిసన్ ఫోటో చిత్రంలో బ్రాహ్మణ యువతి గా ను, మోస్‌ఇల్ల కుదిరై మీనగళ్ చిత్రంలో పోస్టాఫీసులో పని చేసే అమ్మాయిగాను నటిస్తున్నాను. ఇలా ఒకదాని కొకటి సంబంధం లేని పాత్రలు కావడంతో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా నటిస్తున్నాను.
మాలీవుడ్ హీరోయిన్లు కోలీవుడ్‌పై కన్నేస్తుంటే మీరు మాలీవుడ్‌పై దృష్టి సారించారేమిటి?
నాకు అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. చేస్తున్నాను. అంతేకాని ఎలాంటి ప్లాన్ లేదు. ఇక్కడ మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను.
మలయాళ ప్రేక్షకులు ఎలాంటి పాత్రలు మీ నుంచి ఆశిస్తున్నారు?
మలయాళంలో గ్లామర్‌తో పని లేదు. ఫెర్మార్మెన్స్ నటిమణులే వారికి ఇష్టం. నేను నటించిన ఒక్క చిత్రమే మలయాళంలో విడుదలయ్యింది. మరో నాలుగు చిత్రాలు ఈ ఏడాది తెరపైకి రానున్నాయి. కాబట్టి ఈ ఏడాది చివరిలో మీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలను.
కోలీవుడ్‌లో సరైన ఆదరణ లేకపోవడంలో మాలీవుడ్‌లో మకాం మార్చారట?
నేను చెన్నై అమ్మాయిని. పుట్టి పెరిగింది ఇక్కడే. మాకు ఒక ఇల్లు ఇక్కడే ఉంది. అలాంటిది నేనెందుకు కేరళకు వెళ్లాలి? తమిళంలో అవకాశాలు లేకపోవడంతో కేరళకు మకాం మార్చినట్లు ఎవరో అసత్యపు ప్రచారం చేస్తున్నారు. ఇది నా వరకు రావడంతో చాలా అప్‌సెట్ అయ్యా ను. ఒకరి గురించి నెగిటివ్ ప్రచారం చేయడంతో అలాంటివారికి కలిగే ఆనందం ఏమిటో? ఇప్పుడు కూడా నేను చెప్పేదొక్కటే. ఏ భాషలో అవకాశాలు లభించినా నేను చెన్నైను విడిచి వెళ్లను. ఇక్కడ నుంచి కేరళకు రోజుకు నాలుగు రైళ్లు, నాలుగు ప్లైట్లు ఉన్నాయి వెళ్లి రావడానికి.
మోడలింగ్ చేశారా? చిత్రాలు చేస్తున్నారు. వీటిలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఏ రంగంలో ఉన్నాయంటారు?
నేను చదువుకుంటున్న సమయంలోనే పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేశాను. వాణిజ్య ప్రకటనల్లోనూ నటిం చాను. ఈ రెండింటిలో సంతోషమే ప్రధానం. సినిమాల్లో ఏడవాల్సి ఉంటుంది, భయపడాల్సి ఉంటుంది.
యువ నటుడితో ప్రేమాయణం అంటూ వస్తున్న వదంతుల గురించి?
నటనను వ్యక్తిగత జీవితం లో మిక్స్ చేయలేను. ఇప్పటి వరకు ఎవరిపైనా ప్రేమ పుట్టింది లేదు. సినిమాలో చాలా సాధిం చాల్సి ఉంది. అందుకు ప్రేమ, పెళ్లి వంటివి ఆటంకాలు కావడం నా కిష్టం లేదు.