
కోలీవుడ్ కథానాయిక జనని అయ్యర్ తాజాగా నటించిన చిత్రం 'కూర్మన్'. ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. అయితే ఇందులో అవకాశం అంత ఈజీగా ఏం రాలేదట. గొడవపడి మరీ ఛాన్స్ దక్కించుకుందట! ఈ విషయాన్ని జనని అయ్యర్ స్వయంగా మీడియాకు వెల్లడించింది.
దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'తెగిడి సినిమా నుంచి దర్శకుడు బ్రియాన్ బి.జార్జ్ బాగా తెలుసు. ఆయన దర్శకుడిగా సినిమా తీస్తే అందులో తనను హీరోయిన్‌గా తీసుకోవాలని, లేదంటే గొడవ పెట్టుకుంటానని హెచ్చరించాను. నేను సరదాగా అన్నాను, కానీ ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. అలా కూర్మన్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో నా పాత్ర నాకు మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టడమే కాకుండా కెరీర్‌ను మలుపు తిప్పేలా ఉంటుంది' అని జనని అయ్యర్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment