
సినిమాల్లో కథానాయికగా నటిస్తునే వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉన్న నటి జనని అయ్యర్. ఈమె తాజాగా తీర్థయాత్రకు సంబంధించిన ప్రచార చిత్రంలో నటించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ దేవుడు ఉన్నాడా? లేడా అన్నది మిరాకిల్ జరిగినప్పుడే ఫీల్ అవుతామని, తీర్థయాత్రలకు సంబంధించిన ప్రచార చిత్రంలో నటించే అవకాశం రావడం తనకు ఓ అద్భుతం అని పేర్కొన్నారు. తాను 10 రోజులు క్రితం సాయిబాబా పుస్తకం చదువుతూ ఉండగా దర్శకుడు ధర్మ నుంచి ఫోన్‌కాల్ వచ్చిందన్నారు. ఒక ప్రచార చిత్రంలో నటించాలని కోరారని, తాను మరో ఆలోచన లేకుండా అంగీకరించినట్లు తెలిపారు. ఇందులో నటించడం మంచి అనుభవం అన్నారు.
దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ భారత్ గౌరవ్ పథకం పేరుతో తొలిసారిగా ప్రైవేటు సంస్థతో కలిసి చెన్నై నుంచి షిరిడీ వరకు ప్రతివారం తీర్థయాత్రల కంటూ ప్రత్యేక రైలును నిర్వహిస్తోంది. ఇది ఈ నెల 17న బయలుదేరి ఐదు రోజుల పాటు కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, సేలం, బెంగుళూరు నుంచి షిరిడి వరకు పయనిస్తూ భక్తులకు మంచి వసతులతో కూడిన దైవ దర్శనం కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment