ఆయన గురించి ఇప్పుడు చెప్పను | Interview with Trisha | Sakshi
Sakshi News home page

ఆయన గురించి ఇప్పుడు చెప్పను

Published Fri, Dec 12 2014 2:48 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ఆయన గురించి ఇప్పుడు చెప్పను - Sakshi

ఆయన గురించి ఇప్పుడు చెప్పను

 నా గురించి ఎలాగైనా రాసుకోండి. అయితే అంటూ...ఉత్కంఠకు తెరలేపిన త్రిష సినిమా వయసు పుష్కరకాలం. నేటికీ తనదైన స్టయిల్లో హొయలొలికిస్తూ కథానాయికిగా ప్రకాశిస్తున్నారు. అయితే సినిమాల మాట అటుంచితే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీపై వస్తున్న పుకార్లు ఎక్కువయ్యూయి. ఆ మధ్య ఒక టాలీవుడ్ యువ నటుడితో చెట్టాపట్టాలంటూ ప్రచారాల జోరుగా సాగింది. తాజాగా కోలీవుడ్‌కు చెందిన పారిశ్రామికవేత్త నిర్మాత వరుణ్‌మణియన్‌తో ఏకంగా నిశ్చితార్థం జరిగిపోయిందనే ప్రచారం హోరెత్తుతోంది. దీనికి తోడు ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఆయనతో పాటు కొందరు స్నేహితురాలను తీసుకుని ఢిల్లీ విహారయాత్ర చేసొచ్చారు. ఇది కోలీవుడ్‌లో మరింత వేడి పుట్టిస్తోంది. ఈ సందర్భంగా అందాల కుందనబొమ్మ త్రిషతో చిన్న ఇంటర్వ్యూ.
 
12 ఏళ్లుగా హీరోయిన్‌గా లైమ్‌లైట్‌లో కొనసాగడం ఎలా సాధ్యం?
భగవంతుని దయ అంటాను. ఇక నా వరకు చెప్పాలంటే సరైన కథలను ఎంపిక చేసుకోవడం, ప్రవర్తన, అలాగే కొంచెం అదృష్టం, ఇవన్నీ కారణం. ఎంత కష్టపడి నటించినా ప్రతిభ వున్నా, చేసిన చిత్రం విజయం సాధించాలి. ప్రముఖ హీరోల సరసన, ప్రముఖ నిర్మాణ సంస్థల్లో నటించాలి. డబ్బు ఆశతో రాంగ్ చిత్రాల్లో నటిస్తే ఇక కెరీర్ అంతేసంగతి.
 
 సినిమాలు వద్దురా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా?
  అలా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నేను కోరుకుని ప్రవేశించిన రంగం ఇది. సమయానికి తినడం కుదరదు, నిద్ర పోవడం సాధ్యం కాదు. ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం కుదరదు. అయినా నటనకు దూరం కావాలనే ఆలోచన ఎన్నడూ నా మనసులోకి రాలేదు.
 
 త్రిష ఎలాంటి అమ్మాయి?
 ఎలాంటి విషయాలనైనా ధైర్యంగా ఎదుర్కొనే పరిణితిచెందిన అమ్మాయి. మా ఇంట్లో అమ్మ, బామ్మ అందరూ ఆత్మస్థైర్యం మెండుగా గలవారే. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఏడ్చి గగ్గోలు పెట్టే రకం కాదు నేను. నా గురించి ఎలాగైనా రాసుకోండి... అయితే దేనికైనా హద్దు అంటూ ఒక టుంటుందిగా. దాన్ని దాటితే నాకు కోపం కట్టలు తెంచుకుంటుంది.
 
  ఎలాంటి పాత్రలో నటించాలని ఆశ?
 ప్రతినాయకిగా నటించాలని ఆశగా ఉంది. అదే విధంగా మహారాణిగాను నటించాలనే ఆకాంక్ష ఉంది. చారిత్రక కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా అంధురాలి పాత్ర పోషించాలని ఆశగా ఉంది.
 
  అజిత్ సరసన 4 చిత్రాల్లో నటించారు. ఆ అనుభవం?
  అజిత్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయమైనా ఉన్నదున్నట్లు మాట్లాడుతారు. ముఖ్యంగా స్త్రీలతో ఎలా మెలగాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనతో వరుసగా నటించే అవకాశం లభించడం గొప్పగా భావిస్తున్నాను.
 
  నటీమణుల వివాహ విషయాలు మాత్రమే చర్చనీయూంశమవుతుంటారుు ఎందుకు?
  మంచి పాయింట్ కొచ్చారనుకుంటున్నాను. ఇలాంటి ప్రశ్నకు సమాధానం కోసమే చాలామంది ఎదురు చూస్తుంటారు. పేరు, పాపులారిటీనే కారణం. నటీమణులు కాని వారు కూడా ప్రేమించుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారిలో కొందరి జీవితాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయినా అలాంటివన్నీ బయటకురావడం లేదు. హీరోయిన్ల వివాహ విషయాలకే ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు. ఒక వ్యక్తిని తొలి చూపులోనే పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు. అతని నేపథ్యం, గుణగణాలు, తెలుసుకోవాలి. సాధారణ అమ్మాయిలే కాదు, సినీ నటీమణులు కూడా ఇలాంటివే ఎదురు చూస్తారు. అయితే హీరోయిన్లను మాత్రమే ప్రచారం చేస్తున్నారు.  
 
  ఇంతకీ మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు?
  రెండేళ్ల నుంచే పెళ్లి చేసుకోమని అమ్మ ఒత్తిడి చేస్తున్నారు. నేను మంచి అబ్బాయిని చూడండి. పెళ్లిచేసుకుంటానని చెప్పాను. నాకుసినిమా అవకాశాలు పోతాయనే భయం లేదు.
 
  ఇంతకీ ఆ వరుణ్‌మణియన్ ఎవరు?
  నాకు స్నేహ బృందం చాలా ఉంది.  అయితే వరుణ్‌మణియన్ గురించి చెప్పాలంటే కాస్త సమయం కావాలి. అందువలన ప్రస్తుతానికి తనుగురించి ఏమి చెప్పను. నాకంటూ ఒక మంచి విషయం జరిగినప్పుడు తప్పకుండా అందరికీ చెబుతాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement