Varun maniyan
-
నా తొలి సూపర్‌స్టార్ ఆయనే!
ప్రేమ, పెళ్లి అంటూ ఆ మధ్య నిత్యం వార్తల్లో ఉన్న నటి త్రిష సంచలనాలకు కేంద్రంగా మారారు. అంతే కాదు నటిగానూ కాస్త వెనుకబడిపోయారు.అయితే నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్ తో ప్రేమ, పెళ్లి బెడిసి కొట్టడంతో వ్యక్తిగతంగా త్రిష ఏమి కోల్పోయారోగానీ, వృత్తిపరంగా యమగా పుంజుకున్నారు. అంతేకాదు అప్పటి వరకూ గ్లామర్ డాల్ పాత్రలకే పరిమితమైన ఈ బ్యూటీకీ ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు తలుపుతట్టాయి. ప్రస్తుతం ఇటు హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు, అటు కమర్సియల్ అంశాలతో కూడిన గ్లామరస్ పాత్రలను పోషిస్తూ, ఇతర టాప్ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. త్రిష, విక్రమ్‌తో కలిసి నటించిన తొలి చిత్రం సామి. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో కమర్షియల్‌గా పెద్ద హిట్ అయ్యింది. తాజాగా సామి సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే ఇందులో విక్రమ్ సరసన నటించే నాయకి ఎవరన్న అంశంపై చాలానే చర్చ జరిగింది. చాలా మందిని పరిశీలన లోకి తీసుకున్నా చివరికి అటు తిరిగి ఇటు తిరిగి త్రిషనే ఆ అవకాశం వరించింది.దీని గురించి త్రిష స్పందిస్తూ తన తొలి సూపర్‌స్టార్ హీరో విక్రమ్ అని పేర్కొన్నారు. భూమి గుండ్రం అన్నట్లుగా జీవితం గుండ్రం అని చెప్పను కానీ, సామి–2లో మళ్లీ విక్రమ్‌తో నటించనుండడం సంతోషంగా ఉందని త్రిష పేర్కొన్నారు. సామి చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. సూర్యతో సీ– 3 చిత్రాన్ని తెరకెక్కించి ఈ చిత్ర విజయాన్ని ఆశ్వాదిస్తున్న దర్శకుడు హరి తాజాగా సామి సీక్వెల్ కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైయ్యారు. ఇంతకు ముందు విక్రమ్ హీరోగా ఇరుముగన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శిబుతమ్మీన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం మోహిని చిత్రాన్ని పూర్తి చేసిన నటి త్రిష అరవిందస్వావిుకి జంటగా చతురంగవేట్టై–2 చిత్రంలో నటిస్తున్నారు.అదే విధంగా విజయ్‌సేతుపతితో కూడా 96 అనే ఒక చి త్రం చేస్తున్నారు. వీటితో పాటు మరో లేడీ ఓరియెం టెడ్ చిత్రంలో నటించనున్న త్రిష, నటుడు విక్రమ్‌తో నటించనున్న మూడో చిత్రం సామి–2. ఇంతకు ముందు భీమ చిత్రంలో కూడా విక్రమ్‌తో రొమాన్స్ చేశారన్నది గమనార్హం. -
త్రిష ఇల్లన్నా బిందుమాధవి
త్రిష లేకుంటే నయనతార (త్రిష ఇల్లన్నా నయనతార) అన్న సినిమా టైటిల్ విన్నాం. ఇదేంటి త్రిష లేకుంటే బిందుమాధవి అంటున్నారు అన్నదేగా మీ సందేహం. ఇంతకు ముందు మీరు విన్నది రీల్ కథ. ఇది రియల్ కహానీ. నటి త్రిష నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్ ల రియల్ ప్రేమ భాగోతం అందరికీ తెలిసిందే. వారి ప్రేమ నిశ్చితార్థం వరకూ వెళ్లి పెళ్లి పీటలెక్కలేకబోయింది. అయితే పెళ్లికి ముందే వరుణ్ మణియన్ తో త్రిష ప్రత్కేక విమానంలో విహారయాత్ర పేరుతో వెళ్లి ఆగ్రాలో ప్రేమికుల చిహ్నంగా భావించే తాజ్‌మహాల్ ప్రాంతాలను చుట్టి ఎంజాయ్ చేసొచ్చిన విషయం తెలిసిందే. అయితే వివాహానంతరం నటనకు స్వస్తి చెప్పాలన్న వరుణ్‌మణియన్ షరతు ఆమోదనీయంగా లేక పోవడంతో త్రిష ఆయనతో పెళ్లిని రద్దు చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రేమ కథ ముగిసి ఏడాది దాటిందో లేదో నిర్మాత వరుణ్‌మణియన్ గురించి మరో ప్రేమ కథ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సారి నటి త్రిషకు బదులు నటి బిందుమాధవి ఆయనతో చేరారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, కళుగు, దేసింగ్‌రాజా, జాక్సన్ దురై తమిళ చిత్రాల్లో నటించిన బిందుమాధవి తెలుగమ్మాయన్నది తెలిసిన విషయమే. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేని ఈ బ్యూటీ నిర్మాత వరుణ్‌మణియన్ తో కలిసి విహారయాత్రకు వెళ్లి షికార్లు కొట్టొచ్చారు. ఆ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి, ఆనక వెంటనే డెలిట్ చేశారు.అయినా జరగాల్సిందేదో జరిగిపోయింది. నటి బిందుమాధవి, వరుణ్‌మణియన్ ల సన్నిహిత ఫొటో దృశ్యాలిప్పుడు సోషల్‌మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. మరి వీరి విహారకథ ఏ మలుపు తిçరుగుతుందో వేచి చూడాలి. -
పెళ్లి ఘడియలు వచ్చాయా?
నటి అనుష్కకు కల్యాణ ఘడియలు తోసుకొస్తున్నాయా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే హీరోలకు ఏజ్ బార్ అవుతున్నా వారి పెళ్లిళ్ల గురించి మీడియా పెద్దగా పట్టించుకోదుగానీ, హీరోరుున్లకు మూడు పదుల వయసు రాగానే పెళ్లెప్పుడు, ప్రేమ వివాహమా? పెద్దలు నిశ్చరుుంచిన పెళ్లా అంటూ విలేకరుల నుంచి, పరిశ్రమకు చెందిన వారి వరకూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. ఇక వందతుల పర్వం సరే సరి. అరుుతే వదంతుల్లో కొంత నిజం ఉంటుందనే వారి భావనను పరిగణలోకి తీసుకోకుండా ఉండలేం. కాగా దక్షిణాదిలో మూడు పదుల వయసు దాటిన వారిలో ముఖ్యంగా నయనతార, త్రిష, అనుష్కల గురించి ప్రచారం చాలానే జరుగుతోంది. నటి త్రిష మూడున్నర దశాబ్దాల వయసుకు చేరుకున్నారు. ఈమె ఆ మధ్య పెళ్లికి సిద్ధమై నిర్మాత వరుణ్ మణియన్‌తో వివాహ నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.అరుుతే పెళ్లిని మాత్రం రద్దు చేసుకున్నారు. ఇప్పుడు తనకు పెళ్లి ఆలోచన లేదని స్పష్టంగా చెబుతున్నారు.నటి నయనతార విషయానికి వస్తే ప్రేమ, పెళ్లి విషయాల్లో ఈమె చాలా సంచలనాలనే సృష్టించారు.శింబుతో ప్రేమాయణం వివాదాలతో ముగిసింది.ప్రభుదేవాతో పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోరుుంది.తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమ కలాపాలను సోషల్ మీడియా హాట్‌గానే ప్రచారం చేస్తోంది.ఇక పెళ్లి చేసుకునే విషయం గురించి ఆ లవ్బర్డ్సగా ప్రచారంలో ఉన్న వారిద్దరే చెప్పాల్సి ఉంటుంది. ఇక నటి అనుష్క విషయానికి వస్తే నయనతార, త్రిషల కంటే రీల్ ఏజ్ తక్కువే అరుునా, రియల్ ఏజ్ కాస్త ఎక్కువే. ఇటీవలే 36వ పుట్టిన రోజును జరుపుకున్న అనుష్క పెళ్లి వార్తలు చాలా కాలం వదంతుల రూపంలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ యోగా సుందరి పెళ్లి గురించి వార్తలు ప్రచారం అవుతున్నారుు.అనుష్కకు పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.వచ్చే ఏడాది అనుష్కకు పీపీపీ..డుండుండుం ఖాయం అంటున్నారు.అందుకే అనుష్క కొత్తగా చిత్రాలేమీ ఒప్పుకోవడం లేదని చిత్ర వర్గాల టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ సూర్యతో ఎస్ 3 చిత్రాన్ని పూర్తి చేసి బాహుబలి 2, తెలుగులో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస కథా చిత్రం నమో వెంకటేశాయ చిత్రంలో నటిస్తున్నారు. -
ప్రేమించడానికి రెడీ కానీ..
చెన్నై : సంచలన హీరోయిన్లలో త్రిష ఒకరు. ఏదో ఒక విధంగా నిత్యం వార్తల్లో ఉంటారు. సినీ పరిశ్రమలో 13 ఏళ్లకు పైగా ప్రముఖ కథానాయిక వెలుగొందుతున్నారు. కొత్త నాయికలు వరుసకడుతున్న ఈ రోజుల్లో ఇంత సుదీర్ఘ కాలం రాణించడం సాధారణ విషయం కాదు. ఇంకో విషయం ఏమిటంటే 30 ఏళ్లు పైబడిన త్రిషను చూస్తే అంత వయసుందని అనుకోలేం. ఇంతకు ముందు త్రిషపై రకరకాల వదంతులు ప్రచారం అయ్యాయి. ఆ రూమర్లకు చెలించని త్రిష ఇటీవల వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్ ప్రేమలో పడి పెళ్లికి కూడా సిద్ధం అయ్యారు.నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో వరుణ్ మణియన్‌కు కటీఫ్ చెప్పేశారు. కారణాలు ఏమైనా త్రిష ఇసుమంత కూడా బాధ వ్యక్తం చేయలేదు. దీన్ని చాలా ఈజీగా తీసుకున్నారు. మరో విషయం ఏమిటంటే అప్పటి వరకూ నత్తనడకన నడిచిన ఆమె సినీ కేరీర్ ఆ తర్వాతే జెట్ స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం త్రిషకు చేతినిండా సినిమాలు. ఈ పరిస్థితిలో మళ్లీ ప్రేమలో పడతారా? అన్న ప్రశ్నకు ‘ఓ ఎస్.. నచ్చినోడు తారసపడితే ప్రేమిస్తా.. మనసులు కలిస్తే పెళ్లి కూడా చేసుకుంటా..’ అని బదులిచ్చారు. అయితే వయసు దాటిపోతుందనో, సమాజం కోసమే పెళ్లి చేసుకోవాలనుకోను అని చెప్పారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై-2 చిత్రంలో, నాయకి అనే హారర్ నేపథ్యంలో సాగే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. కమల్ హాసన్‌తో నటించిన తూంగావనం చిత్రం దీపావళికి సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. -
మమ్ముట్టి సరసన త్రిష
నటి త్రిషకు వరుణ్‌మణియన్ పెళ్లి మాత్రమే బెడిసికొట్టింది కానీ ఇతర అన్ని విషయాల్లోనూ భేష్‌గా వర్కౌట్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే వరుణ్‌మణియన్‌తో ప్రేమకు ముందు ఆ తరువాత అని కూడికలు వేస్తే నటిగా ఆ తరువాతే నట జీవితం బ్రైట్ అయిందని చెప్పవచ్చు. అంతకు ముందు ఒకటి అరా చిత్రాలతో నెట్టుకొస్తున్న త్రిషకు వరుణ్‌మణియన్‌తో సన్నిహిత సంబంధాలు పెరిగిన తరువాతే ఐదారు అవకాశాల్లో బిజీ అయ్యారు. ఇకపోతే తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్ ఆశను తీర్చుకున్నారు. అలాగే దక్షిణాది భాషల్లో ఒకటైన కన్నడంలోనూ శివరాజ్‌కుమార్ సరసన పవర్ చిత్రంలో నటించి అక్కడి ప్రేక్షకులను అలరించి తన ముచ్చట తీర్చుకున్నారు. ఇక దక్షిణాదిలో మిగిలింది మలయాళ సినిమా. ఇప్పుడా ఆశ తీరబోతోందని సమాచారం. అవును మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో రోమాన్స్‌కు త్రిష రెడీ అయ్యే సమయం ఆసన్నమైందట. ఆయనతో వైట్ అనే చిత్రంలో నటించే విషయంపై చర్చలు జరుగుతున్నాయన్నది కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రానికి ఉదయ్‌ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. మలయాళ చిత్రపరిశ్రమలోకి కూడా ఎంట్రీ అయితే ఓ పనైపోద్ది అని అనుకుంటున్న త్రిష మమ్ముట్టితో మాలీవుడ్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇంతకీ ఈమెకు ఆ చిత్రంలో నటించమని సూచించిందెవరో తెలుసా?త్రిష తన ప్రియ నేస్తంగా భావించే నటి నయనతార అట. ఈమె ఇంతకు ముందు భాస్కర్ ది రాస్కెల్ చిత్రంలో మ మ్ముట్టితో జతకట్టారన్నది గమనార్హం. ఇక త్రిష ప్రస్తుతం కమలహాసన్‌కు జంటగా తూంగావనం చిత్రాన్ని పూర్తి చేసి,సుందర్.సి దర్శకత్వలో అరణ్మణి-2 చిత్రంలో నటిస్తున్నారు. -
అతను దొరికితే ఈపాటికి త్రిష పెళ్లయ్యేది!
‘‘సమాజం కోసం ఎవరూ పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకుని బాధపడేవాళ్లను నేను చాలామందిని చూస్తున్నాను. అందుకే, ఇతరుల కోసం కాకుండా మనకు నిజంగా మంచి తోడు దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాలి’’ అని త్రిష అంటున్నారు. వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం జరిగిన విషయం, అది బ్రేక్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి మీద మీకు ఏమైనా అపనమ్మకం ఏర్పడిందా? అనే ప్రశ్న త్రిష ముందుంచితే -‘‘వివాహ వ్యవస్థ మీద నూటికి నూరుపాళ్ళు నమ్మకం ఉంది. అయితే, వయసు మీద పడుతోందనో, ఇతరులు ఏమైనా అనుకుంటారనో పెళ్లి చేసుకోకూడదు. అసలు పెళ్లికి వయసుతో సంబంధం లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకోవచ్చు. ఒకవేళ నా పాతికేళ్ల వయసులో నా లాంటి వ్యక్తి దొరికి ఉంటే.. అప్పుడు నిక్షేపంగా అతన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఈపాటికి నాకు పెళ్లయ్యుండేది’’ అని చెప్పారు. మీ నిశ్చితార్థం రద్దు కావడానికి అసలైన కారణాలు? అని త్రిషను అడిగితే -‘‘కారణాలదేముంది? ఎన్నయినా చెప్పచ్చు. కానీ, కొంతమంది గురించి చెప్పాల్సి వస్తుంది. నాకది ఇష్టం లేదు. నా జీవితంలో ఏం జరిగినా సమాధానం చెప్పాల్సింది మా అమ్మగారికే. ఏది ఏమైనా అమ్మ, నేను మొత్తం మా కుటుంబం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
చేతులు మారనున్న చెన్నై!
ముంబై: సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్. శ్రీనివాసన్ తన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్య బాధ్యతలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నారా... జట్టును మరొకరికి అమ్మి బీసీసీఐ అధ్యక్ష పదవిని అందుకోవాలనుకుంటున్నారా... ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఐపీఎల్ జట్లను రద్దు చేయడం లేదా కొనసాగించే విషయంలో కోర్టు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దాంతో ఈ సీజన్‌కు చెన్నై, రాజస్థాన్ జట్లు కొనసాగుతున్నట్లుగానే భావించాలి. ఫిబ్రవరి 16న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. వాస్తవానికి గతంలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9-10 తేదీల్లోనే వేలం జరగాలి. అయితే చెన్నై జట్టు యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చేందుకు, తన ఫ్రాంచైజీని అమ్మేందుకు శ్రీనివాసన్‌కు మరి కొంత సమయం లభించేందుకు దీనిని పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి. త్రిషకు కాబోయే భర్త కూడా... చెన్నై జట్టును కొనుగోలు చేసే విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రఖ్యాత మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్) ఈ విషయంలో ముందంజలో ఉన్నట్లు సమాచారం. అయితే చెన్నైకి చెందిన యువ వ్యాపారవేత్త, బిల్డర్ వరుణ్ మణియన్ కూడా జట్టును తీసుకునే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. ఇటీవలే ప్రముఖ నటి త్రిషతో నిశ్చితార్థం జరుపుకోవడంతో వరుణ్ వార్తల్లోకి వచ్చాడు. ఇతను కూడా శ్రీనివాసన్ కుటుంబానికి సన్నిహితుడనే తెలుస్తోంది. బోర్డు పదవిపైనే శ్రీనివాసన్ ఆసక్తి చూపుతున్నారు కాబట్టి... మార్పు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావచ్చని, అయితే ఇంకా ఎవరూ తమను నేరుగా సంప్రదించలేదని ఆయన సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. అమ్మకం సాధ్యమేనా! మరో వైపు చెన్నై జట్టు అమ్మకం ప్రక్రియ సజావుగా సాగడంపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పు అనంతరం పరిస్థితి చూస్తే ఏ దశలోనైనా జట్టు రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి టీమ్‌ను ఎవరూ సొంతం చేసుకుంటారనేది ప్రశ్న. సుప్రీం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ కూడా ఈ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ తుది నివేదిక ఇచ్చే వరకు జట్టును అమ్మడానికి వీలు కాదని, అలా చేసినా దానిపై ‘స్టే’ ఉత్తర్వులు రావచ్చని కూడా క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు సుప్రీం తీర్పును గౌరవిస్తూనే, ఇటు శ్రీనివాసన్‌కు కూడా సమస్య రాకుండా మధ్యేమార్గంగా బీసీసీఐలోనే సమస్యను పరిష్కరించుకునేందుకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మధ్యవర్తిత్వం చేయనున్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఐపీఎల్-8కు ముందే పని చేయడం ప్రారంభిస్తే, ఏం చేయాలనేదానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ స్పష్టం చేశారు. -
త్రిష, పెళ్లి విమానంలో జరుపుకోనున్నారట
నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో ప్రేమలో పడ్డ త్రిష, తమ పెళ్లిని విమానంలో జరుపుకోనున్నారట. ఈ జంట ఇటీవలే తాజ్‌మహల్‌ను తిలకించేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లొచ్చారు. వీరి వివాహ నిశ్చితార్థం ఈ నెల 23న చెన్నైలో జరగనుంది -
ఆయన గురించి ఇప్పుడు చెప్పను
నా గురించి ఎలాగైనా రాసుకోండి. అయితే అంటూ...ఉత్కంఠకు తెరలేపిన త్రిష సినిమా వయసు పుష్కరకాలం. నేటికీ తనదైన స్టయిల్లో హొయలొలికిస్తూ కథానాయికిగా ప్రకాశిస్తున్నారు. అయితే సినిమాల మాట అటుంచితే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీపై వస్తున్న పుకార్లు ఎక్కువయ్యూయి. ఆ మధ్య ఒక టాలీవుడ్ యువ నటుడితో చెట్టాపట్టాలంటూ ప్రచారాల జోరుగా సాగింది. తాజాగా కోలీవుడ్‌కు చెందిన పారిశ్రామికవేత్త నిర్మాత వరుణ్‌మణియన్‌తో ఏకంగా నిశ్చితార్థం జరిగిపోయిందనే ప్రచారం హోరెత్తుతోంది. దీనికి తోడు ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఆయనతో పాటు కొందరు స్నేహితురాలను తీసుకుని ఢిల్లీ విహారయాత్ర చేసొచ్చారు. ఇది కోలీవుడ్‌లో మరింత వేడి పుట్టిస్తోంది. ఈ సందర్భంగా అందాల కుందనబొమ్మ త్రిషతో చిన్న ఇంటర్వ్యూ. 12 ఏళ్లుగా హీరోయిన్గా లైమ్‌లైట్‌లో కొనసాగడం ఎలా సాధ్యం? భగవంతుని దయ అంటాను. ఇక నా వరకు చెప్పాలంటే సరైన కథలను ఎంపిక చేసుకోవడం, ప్రవర్తన, అలాగే కొంచెం అదృష్టం, ఇవన్నీ కారణం. ఎంత కష్టపడి నటించినా ప్రతిభ వున్నా, చేసిన చిత్రం విజయం సాధించాలి. ప్రముఖ హీరోల సరసన, ప్రముఖ నిర్మాణ సంస్థల్లో నటించాలి. డబ్బు ఆశతో రాంగ్ చిత్రాల్లో నటిస్తే ఇక కెరీర్ అంతేసంగతి. సినిమాలు వద్దురా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? అలా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నేను కోరుకుని ప్రవేశించిన రంగం ఇది. సమయానికి తినడం కుదరదు, నిద్ర పోవడం సాధ్యం కాదు. ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం కుదరదు. అయినా నటనకు దూరం కావాలనే ఆలోచన ఎన్నడూ నా మనసులోకి రాలేదు. త్రిష ఎలాంటి అమ్మాయి? ఎలాంటి విషయాలనైనా ధైర్యంగా ఎదుర్కొనే పరిణితిచెందిన అమ్మాయి. మా ఇంట్లో అమ్మ, బామ్మ అందరూ ఆత్మస్థైర్యం మెండుగా గలవారే. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఏడ్చి గగ్గోలు పెట్టే రకం కాదు నేను. నా గురించి ఎలాగైనా రాసుకోండి... అయితే దేనికైనా హద్దు అంటూ ఒక టుంటుందిగా. దాన్ని దాటితే నాకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎలాంటి పాత్రలో నటించాలని ఆశ? ప్రతినాయకిగా నటించాలని ఆశగా ఉంది. అదే విధంగా మహారాణిగాను నటించాలనే ఆకాంక్ష ఉంది. చారిత్రక కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా అంధురాలి పాత్ర పోషించాలని ఆశగా ఉంది. అజిత్ సరసన 4 చిత్రాల్లో నటించారు. ఆ అనుభవం? అజిత్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయమైనా ఉన్నదున్నట్లు మాట్లాడుతారు. ముఖ్యంగా స్త్రీలతో ఎలా మెలగాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనతో వరుసగా నటించే అవకాశం లభించడం గొప్పగా భావిస్తున్నాను. నటీమణుల వివాహ విషయాలు మాత్రమే చర్చనీయూంశమవుతుంటారుు ఎందుకు? మంచి పాయింట్ కొచ్చారనుకుంటున్నాను. ఇలాంటి ప్రశ్నకు సమాధానం కోసమే చాలామంది ఎదురు చూస్తుంటారు. పేరు, పాపులారిటీనే కారణం. నటీమణులు కాని వారు కూడా ప్రేమించుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారిలో కొందరి జీవితాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయినా అలాంటివన్నీ బయటకురావడం లేదు. హీరోయిన్ల వివాహ విషయాలకే ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు. ఒక వ్యక్తిని తొలి చూపులోనే పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు. అతని నేపథ్యం, గుణగణాలు, తెలుసుకోవాలి. సాధారణ అమ్మాయిలే కాదు, సినీ నటీమణులు కూడా ఇలాంటివే ఎదురు చూస్తారు. అయితే హీరోయిన్లను మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు? రెండేళ్ల నుంచే పెళ్లి చేసుకోమని అమ్మ ఒత్తిడి చేస్తున్నారు. నేను మంచి అబ్బాయిని చూడండి. పెళ్లిచేసుకుంటానని చెప్పాను. నాకుసినిమా అవకాశాలు పోతాయనే భయం లేదు. ఇంతకీ ఆ వరుణ్‌మణియన్ ఎవరు? నాకు స్నేహ బృందం చాలా ఉంది. అయితే వరుణ్‌మణియన్ గురించి చెప్పాలంటే కాస్త సమయం కావాలి. అందువలన ప్రస్తుతానికి తనుగురించి ఏమి చెప్పను. నాకంటూ ఒక మంచి విషయం జరిగినప్పుడు తప్పకుండా అందరికీ చెబుతాను. -
నాకు మార్చిలో పెళ్లా?
నటి త్రిషకు పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడు ప్రము ఖ పారిశ్రామికవేత్త, నిర్మాత వరుణ్ మణియన్. వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి. ఇది సోమవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ చేస్తున్న ప్రచారం. నిజం చెప్పాలంటే గత ఏడాదికి పైగా త్రిష వివాహం గురించి మీడియాలో రకరకాల ప్రచారం కలకలం రేగుతూనే ఉంది. టాలీవుడ్ నటుడు రానాతో ప్రేమ, రహస్య వివాహం జరిగిపోయిందంటూ వదంతులు జోరుగా సాగాయి. ఇటీవల రానాకు త్రిషకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీనికి కారణం ఒక కన్నడ నటి అనే ప్రచారం కూడా హల్చల్ చేసింది. ప్రేమ విఫలం అవడంతో నటి త్రిష అసహనంతో ఉన్నారని, దీంతో అనారోగ్యానికి గురయ్యూరంటూ వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి రకరకాల ప్రచారం మధ్య సోమవారం త్రిష, వరుణ్ మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిందనే న్యూస్ కోలీవుడ్‌లో మరింత చర్చనీయాంశంగా మారింది. లేసా లేసా చిత్రం ద్వారా హీరోయిన్గా రంగ ప్రవేశం చేసిన త్రిష ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రముఖ కథానాయికి స్థాయికి చేరారు. నాయికిగా దశాబ్ద కాలాన్ని దాటేసిన త్రిషకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి ఆమె తల్లి వచ్చారని, వరుడివేటలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా త్రిష వరుణ్ మణియన్ సన్నిహితంగా ఉన్న ఫొటో ఇంటర్నెట్లో ప్రచారమై కోలీవుడ్‌నే ఆశ్చర్యపరిచింది. వీరి వివాహ నిశ్చితార్థం రెండు రోజుల ముందు జరిగిందని వచ్చే ఏడాది మార్చిలో త్రిష, వరుణ్ మణియన్‌ల వివాహం జరగనుందని ప్రచారం జోరందుకుంది. అరుుతే ఇదంతా అసత్యప్రచారం అని త్రిష తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాంటిదేమైనా జరిగితే ముందుగా మీకే చెబుతానని ఈ బ్యూటీ అభిమానులనుద్దేశించి ట్విట్టర్లో పోస్టు చేశారు. అదే విధంగా త్రిష తల్లి ఉమ కూడా నిశ్చితార్థం ప్రచారాన్ని ఖండించారు. త్రిష పెళ్లి ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రచారం గురించి వరుణ్ మణియన్ గానీ, ఆయన కుటుంబం గానీ ఖండించకపోవడం గమనార్హం.పరిశ్రమలోని ఒక వర్గం టాక్ మరోలా వినిపిస్తోంది. నటి త్రిష వరుణ్ మణియన్‌ల నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమేనని ఈ విషయాన్ని త్రిష, ఆమె తల్లి ఉమ దాచడానికి కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే త్రిష ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారని పెళ్లి విషయం తెలిస్తే ఆ చిత్రాల వ్యాపారానికి పెద్ద దెబ్బే తగులుతుందని అందువలన ఈ పెళ్లి నిశ్చితార్థం విషయాన్ని మరికొద్ది రోజులు రహస్యంగా ఉంచాలనే భావనలో వున్నట్లు కోడంబాక్కం టాక్. - తమిళ సినిమా