నా తొలి సూపర్‌స్టార్‌ ఆయనే! | He is my first superstar- said by trisha | Sakshi
Sakshi News home page

నా తొలి సూపర్‌స్టార్‌ ఆయనే!

Published Sun, Mar 5 2017 2:39 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

నా తొలి సూపర్‌స్టార్‌ ఆయనే!

నా తొలి సూపర్‌స్టార్‌ ఆయనే!

ప్రేమ, పెళ్లి అంటూ ఆ మధ్య నిత్యం వార్తల్లో ఉన్న నటి త్రిష సంచలనాలకు కేంద్రంగా మారారు. అంతే కాదు నటిగానూ కాస్త వెనుకబడిపోయారు.అయితే నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్ తో ప్రేమ, పెళ్లి బెడిసి కొట్టడంతో వ్యక్తిగతంగా త్రిష ఏమి కోల్పోయారోగానీ, వృత్తిపరంగా యమగా పుంజుకున్నారు. అంతేకాదు అప్పటి వరకూ గ్లామర్‌ డాల్‌ పాత్రలకే పరిమితమైన ఈ బ్యూటీకీ ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు తలుపుతట్టాయి. ప్రస్తుతం ఇటు హీరోయిన్  ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు, అటు కమర్సియల్‌ అంశాలతో కూడిన గ్లామరస్‌ పాత్రలను పోషిస్తూ, ఇతర టాప్‌ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు.

త్రిష, విక్రమ్‌తో కలిసి నటించిన తొలి చిత్రం సామి. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో కమర్షియల్‌గా పెద్ద హిట్‌ అయ్యింది. తాజాగా సామి సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే ఇందులో విక్రమ్‌ సరసన నటించే నాయకి ఎవరన్న అంశంపై చాలానే చర్చ జరిగింది. చాలా మందిని పరిశీలన లోకి తీసుకున్నా చివరికి అటు తిరిగి ఇటు తిరిగి త్రిషనే ఆ అవకాశం వరించింది.దీని గురించి త్రిష స్పందిస్తూ తన తొలి సూపర్‌స్టార్‌ హీరో విక్రమ్‌ అని పేర్కొన్నారు. భూమి గుండ్రం అన్నట్లుగా జీవితం గుండ్రం అని చెప్పను కానీ, సామి–2లో మళ్లీ విక్రమ్‌తో నటించనుండడం సంతోషంగా ఉందని త్రిష పేర్కొన్నారు.

సామి చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. సూర్యతో సీ– 3 చిత్రాన్ని తెరకెక్కించి ఈ చిత్ర విజయాన్ని ఆశ్వాదిస్తున్న దర్శకుడు హరి తాజాగా సామి సీక్వెల్‌ కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైయ్యారు. ఇంతకు ముందు విక్రమ్‌ హీరోగా ఇరుముగన్  వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శిబుతమ్మీన్స్  ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం మోహిని చిత్రాన్ని పూర్తి చేసిన నటి త్రిష అరవిందస్వావిుకి జంటగా చతురంగవేట్టై–2 చిత్రంలో నటిస్తున్నారు.అదే విధంగా విజయ్‌సేతుపతితో కూడా 96 అనే ఒక చి త్రం చేస్తున్నారు. వీటితో పాటు మరో లేడీ ఓరియెం టెడ్‌ చిత్రంలో నటించనున్న త్రిష, నటుడు విక్రమ్‌తో నటించనున్న మూడో చిత్రం సామి–2. ఇంతకు ముందు భీమ చిత్రంలో కూడా విక్రమ్‌తో రొమాన్స్ చేశారన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement