పెళ్లి ఘడియలు వచ్చాయా?
నటి అనుష్కకు కల్యాణ ఘడియలు తోసుకొస్తున్నాయా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే హీరోలకు ఏజ్ బార్ అవుతున్నా వారి పెళ్లిళ్ల గురించి మీడియా పెద్దగా పట్టించుకోదుగానీ, హీరోరుున్లకు మూడు పదుల వయసు రాగానే పెళ్లెప్పుడు, ప్రేమ వివాహమా? పెద్దలు నిశ్చరుుంచిన పెళ్లా అంటూ విలేకరుల నుంచి, పరిశ్రమకు చెందిన వారి వరకూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. ఇక వందతుల పర్వం సరే సరి. అరుుతే వదంతుల్లో కొంత నిజం ఉంటుందనే వారి భావనను పరిగణలోకి తీసుకోకుండా ఉండలేం. కాగా దక్షిణాదిలో మూడు పదుల వయసు దాటిన వారిలో ముఖ్యంగా నయనతార, త్రిష, అనుష్కల గురించి ప్రచారం చాలానే జరుగుతోంది. నటి త్రిష మూడున్నర దశాబ్దాల వయసుకు చేరుకున్నారు.
ఈమె ఆ మధ్య పెళ్లికి సిద్ధమై నిర్మాత వరుణ్ మణియన్‌తో వివాహ నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.అరుుతే పెళ్లిని మాత్రం రద్దు చేసుకున్నారు. ఇప్పుడు తనకు పెళ్లి ఆలోచన లేదని స్పష్టంగా చెబుతున్నారు.నటి నయనతార విషయానికి వస్తే ప్రేమ, పెళ్లి విషయాల్లో ఈమె చాలా సంచలనాలనే సృష్టించారు.శింబుతో ప్రేమాయణం వివాదాలతో ముగిసింది.ప్రభుదేవాతో పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోరుుంది.తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమ కలాపాలను సోషల్ మీడియా హాట్‌గానే ప్రచారం చేస్తోంది.ఇక పెళ్లి చేసుకునే విషయం గురించి ఆ లవ్‌బర్‌డ్సగా ప్రచారంలో ఉన్న వారిద్దరే చెప్పాల్సి ఉంటుంది. ఇక నటి అనుష్క విషయానికి వస్తే నయనతార, త్రిషల కంటే రీల్ ఏజ్ తక్కువే అరుునా, రియల్ ఏజ్ కాస్త ఎక్కువే.
ఇటీవలే 36వ పుట్టిన రోజును జరుపుకున్న అనుష్క పెళ్లి వార్తలు చాలా కాలం వదంతుల రూపంలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ యోగా సుందరి పెళ్లి గురించి వార్తలు ప్రచారం అవుతున్నారుు.అనుష్కకు పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.వచ్చే ఏడాది అనుష్కకు పీపీపీ..డుండుండుం ఖాయం అంటున్నారు.అందుకే అనుష్క కొత్తగా చిత్రాలేమీ ఒప్పుకోవడం లేదని చిత్ర వర్గాల టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ సూర్యతో ఎస్ 3 చిత్రాన్ని పూర్తి చేసి బాహుబలి 2, తెలుగులో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస కథా చిత్రం నమో వెంకటేశాయ చిత్రంలో నటిస్తున్నారు.