పూజలు పెళ్లి కోసమేనా? | Anushka Shetty Worshiped for marriage | Sakshi
Sakshi News home page

పూజలు పెళ్లి కోసమేనా?

Published Mon, Jun 12 2017 3:47 AM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

పూజలు పెళ్లి కోసమేనా?

పూజలు పెళ్లి కోసమేనా?

నటి అనుష్కకు ఇటీవల దైవ చింతన పెరిగిందా? తరచూ ఆలయ దర్శనాలు, అర్చనలు, దోషనివారణ పూజలు చేస్తున్న ఈ భామ నటనపై ఆసక్తి తగ్గించుకున్నారా? వీటన్నింటికీ కారణం పెళ్లేనా? ఇవే ప్రస్తుతం చిత్ర వర్గాల్లో అనుష్క గురించి చర్చలు. బాహుబలి–2 చిత్రం తరువాత ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి ప్రచారం బాగా జరుగుతోందని చెప్పవచ్చు.అంతే కాదు నటుడు ప్రభాస్‌తో ప్రేమాయణం అని, త్వరలోనే ఆయనతో ఏడడుగులకు సిద్ధం అవుతున్నారనే వదంతులు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం స్వీటీ ప్రభాస్‌ తనకు మంచి స్నేహితుడని, అంతకు మించి ఏమీ లేదని ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు.

అదే విధంగా ఇకపై తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయినా అనుష్క గురించి ప్రేమ, పెళ్లి ప్రచారాలు ఆగడం లేదు. అందుకు కారణం ఆమె చర్యలే కావచ్చు. ఆ మధ్య బెంగళూర్‌ సమీపంలోని మూకాంబికాదేవి ఆలయానికి తన కుటుంబ సబ్యులు సహా వెళ్లి విశేష పూజలు నిర్వహించారు. తాజాగా దోష నివారణ పూజలకు ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి దోష నివారణ పూజలు నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది.

దీంతో అనుష్క పెళ్లి కోసమే ఆమె తల్లిదండ్రులు  పూజలు చేయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అనుష్క కుటుంబ సభ్యులు కొట్టిపారేస్తున్నారనుకోండి. ఏదేమైనా అనుష్క చేతిలో భాగమతి అనే ఒకే ఒక్క చిత్రం ఉంది. బాహుబలి తరువాత ఒక్క కొత్త చిత్రాన్ని ఆమె అంగీకరించలేదు. అదే విధంగా చిన్న హీరోలతో చిత్రాలు చేయడానికి అంగీకరించడంలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక సంఘమిత్ర చిత్ర అవకాశాన్ని నిరాకరించారనే టాక్‌ వైరల్‌ అవుతోంది. బాహుబలి చిత్రం మాదిరి మరో రెండేళ్లు సంఘమిత్రకు వెచ్చించడానికి ఇష్టం లేకే ఈ అవకాశాన్ని నిరాకరించినట్లు ప్రచారం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement